Begin typing your search above and press return to search.

రిలీజ్ ఆల‌స్యంపై సెటైర్లు.. గౌత‌మ్ మీన‌న్ రియాక్ష‌న్

ఇప్పుడు నేను 3 సంవత్సరాల అనుభవంతో MNCలో పని చేస్తున్నాను. మీ జీవితం ఎలా మారిపోయింది?`` అంటూ గౌత‌మ్ మీన‌న్ ని ప్ర‌శ్నించాడు.

By:  Tupaki Desk   |   26 Oct 2023 12:03 PM GMT
రిలీజ్ ఆల‌స్యంపై సెటైర్లు.. గౌత‌మ్ మీన‌న్ రియాక్ష‌న్
X

సౌత్ లో క్రేజీ స్టార్ డైరెక్ట‌ర్ల‌లో ఒక‌రిగా గౌత‌మ్ మీన‌న్‌కి ఉన్న గుర్తింపు ప్ర‌త్యేక‌మైన‌ది. అత‌డికంటూ ప్ర‌త్యేక‌మైన ఫాలోయింగ్ ఉంది. ఏ మాయ చేసావే- సూర్య స‌న్నాఫ్ కృష్ణ‌న్- ఘ‌ర్ష‌ణ‌- ఎంత‌వాడు కానీ, రాఘవన్ వంటి క్లాసిక్ సినిమాల్ని తెర‌కెక్కించిన మేటి ద‌ర్శ‌కుడు ఆయ‌న‌. కానీ ద‌ర్శ‌కుడిగా అత‌డి కెరీర్ ఇటీవ‌ల గాడి త‌ప్పింద‌ని అంతా భావిస్తున్నారు. గౌతమ్ మీనన్ 2016లో తన `ధృవ నచ్చతిరమ్` చిత్రాన్ని ప్రారంభించినా కానీ రిలీజ్ కి ఎనిమిదేళ్లు ప‌ట్టింది. దీంతో నెటిజ‌నులు ఒక రేంజులో సెటైర్ల‌తో విరుచుకుప‌డుతున్నారు. త్వరలో విడుదల చేస్తామనే ప్ర‌క‌ట‌న‌తో ఇప్పుడు ఈ మూవీ డైరెక్ట‌ర్ గౌత‌మ్ మీన‌న్ ని నెటిజ‌నులు ఒక రేంజులో ఆట ప‌ట్టిస్తున్నారు.

ధృవ నచ్చతిరమ్ ట్రైలర్ ఇప్ప‌టికే విడుద‌లై ఆక‌ట్టుకుంది. విక్రమ్ పాత్ర‌ను ఎంతో స్టైలిష్ గా ఆవిష్క‌రించారు. ఇప్పుడు విడుద‌ల చేస్తున్న‌ది కేవలం అధ్యాయం 1. రెండవ భాగం వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇంత‌లోనే నెటిజ‌నులు గౌత‌మ్ మీన‌న్ పై సెటైర్లు విసురుతున్నారు. సినిమా విడుదల చాలా ఆలస్యం కావడంపై నెటిజ‌నుల్లో చ‌ర్చ సాగుతోంది. సామాజిక జ‌నాల్లో ఒకరు గౌత‌మ్ పై పంచ్ విసిరారు. దాని సారాంశం ఇలా ఉంది. ``ధృవ నచ్చతిరం ప్రకటించినప్పుడు నేను కాలేజీలో 2వ సంవత్సరం చదువుతున్నాను. ఇప్పుడు నేను 3 సంవత్సరాల అనుభవంతో MNCలో పని చేస్తున్నాను. మీ జీవితం ఎలా మారిపోయింది?`` అంటూ గౌత‌మ్ మీన‌న్ ని ప్ర‌శ్నించాడు.

ఈ ట్వీట్ గౌతమ్ మీనన్‌కు చేరడంతో దానికి స్మార్ట్ ట్వీట్ తో స్పందించాడు. అత‌డి స‌మాధానం కూడా అంతే ధీటుగా ఉంది. ``అప్పటి నుండి చాలా నేర్చుకున్నాను. నేను 3 సినిమాలు, 4 ఆంథాలజీ లఘు చిత్రాలు, 5 మ్యూజిక్ వీడియోలను దర్శకత్వం వహించి విడుదల చేసాను. 6వ ప్రాజెక్ట్ ని అభివృద్ధి చేసాను`` అని తెలిపారు. ఇంత అంద‌మైన‌, చమత్కారమైన సమాధానం చూసి గౌతమ్‌ను ప్రశంసిస్తూ చాలా మంది ట్వీట్లు చేసారు. త‌న‌ జీవితంలో మార్పు ఏమిటో స్ప‌ష్టంగా చెప్పారు గౌత‌మ్. ధృవ న‌చ్చ‌తిరమ్ మొద‌ట సూర్య తో మొద‌లైంది. ఆ త‌ర్వాత ఆర్థిక ఇబ్బందుల‌లో ప‌డింది. త‌ర్వాత విక్ర‌మ్ తో సినిమా పూర్త‌యింది. దీనికోసం ఎనిమిదేళ్లు ప‌ట్టింది. కానీ ఈ గ్యాప్ లోనే గౌత‌మ్ మీన‌న్ మూడు చిత్రాలకు దర్శకత్వం వహించి విడుదల చేయడమే కాకుండా .చాలా చిత్రాల్లో నటించారు. అతను ఇటీవలి బ్లాక్ బస్టర్ దళపతి విజయ్ LEO లో కీలక పాత్రలో కనిపించాడు. న‌టుడిగాను గౌత‌మ్ మీన‌న్ ఇటీవ‌ల స‌త్తా చాటుతున్నాడు. అత‌డి యూనిక్ స్టైల్ కి అద్భుత‌మైన ఫ్యాన్స్ ఉన్నారు.