Begin typing your search above and press return to search.

డిజాస్టర్ సినిమాకు సెన్సేషనల్ టీఆర్‌పీ!

ఈ విషయాన్ని ఇప్పటికే కొన్ని సినిమాలు ప్రూవ్ చేయగా.. లేటెస్టుగా 'ఆది కేశవ' చిత్రం కూడా ఈ లిస్టులో చేరిపోయింది.

By:  Tupaki Desk   |   15 Feb 2024 12:25 PM GMT
డిజాస్టర్ సినిమాకు సెన్సేషనల్ టీఆర్‌పీ!
X

ఇటీవల కాలంలో బుల్లితెర ప్రేక్షకుల ప్రేక్షకుల మైండ్ సెట్ ను ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. ఎప్పుడు ఏ సినిమాని ఆదరిస్తారో, ఎప్పుడు ఏ చిత్రాన్ని లైట్ తీసుకుంటారో తెలియడం లేదు. మరీ ముఖ్యంగా ఓటీటీల హవా మొదలైన తర్వాత ఈ విషయాలు అస్సలు అర్ధం కావడం లేదు. థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమాలు టీవీల్లో ఫ్లాప్ అవుతున్నాయి.. బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ గా మారిన చిత్రాలు మాత్రం మంచి టీఆర్పీ రేటింగ్స్ రాబడుతున్నాయి. ఈ విషయాన్ని ఇప్పటికే కొన్ని సినిమాలు ప్రూవ్ చేయగా.. లేటెస్టుగా 'ఆది కేశవ' చిత్రం కూడా ఈ లిస్టులో చేరిపోయింది.


మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా నటించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'ఆది కేశవ'. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. 2023 నవంబర్‌ 24న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, రొటీన్‌ కథ, కథనాలతో ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయింది. దీంతో బాక్సాఫీసు దగ్గర డిజాస్టర్ గా మారింది. నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కు పెడితే, అక్కడ కూడా ఆదరణ కరువైంది. అలాంటి అట్టర్ ఫ్లాప్ మూవీ ఇప్పుడు టీవీల్లో మాత్రం బ్లాక్ బస్టర్ హిట్టయింది.

'ఆది కేశవ' సినిమాని ఇటీవల 'స్టార్ మా' ఛానల్ లో ప్రీమియర్ గా ప్రసారం చేశారు. దీనికి అర్బన్ లో ఎవరూ ఊహించని విధంగా 10.47 టీఆర్‌పీ రేటింగ్ వచ్చింది. ఓవరాల్ గా అర్బన్ + రూరల్ కలిపి 9.87 TRP సాధించింది. ఓటీటీలు రాజ్యమేలుతున్న రోజుల్లో ఒక సినిమాకి ఈ రేంజ్ టీఆర్పీ రావడం అనేది మామూలు విషయం కాదు. అది కూడా ఒక డిజాస్టర్ మూవీకి ఈ రేంజ్ రేటింగ్స్ అంటే సెన్సేషనల్ అనే చెప్పాలి. గత ఎనిమిది నెలల్లో ఏ చిత్రానికైనా ఇదే హయ్యస్ట్ రేటింగ్ కావడం విశేషం. గతంలో వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన (18.5), కొండ పొలం (12.34) సినిమాలకి కూడా మంచి రేటింగ్స్ వచ్చాయి.

ఈ మధ్య 'స్కంద' సినిమా కూడా బుల్లితెర మీద డీసెంట్ రెస్పాన్స్ తెచ్చుకుంది. రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కలయికలో వచ్చిన ఈ డిజాస్టర్ మూవీకి 8.47 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. అంతకుముందు థియేటర్లలో ఫ్లాప్ అయిన 'ఆది పురుష్' సినిమా 9.47 రేటింగ్ నమోదు చేసింది. అదే సమయంలో బ్లాక్ బస్టర్ హిట్టయిన దసరా (4.99), వాల్తేరు వీరయ్య (5.14), మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి (4.35), జైలర్ (5.39), బ్రో (7.24) లాంటి సినిమాలకి తక్కువ రేటింగ్స్ వచ్చాయి. దీన్ని బట్టి థియేటర్లలో హిట్టయిన మూవీ బుల్లితెరపై కూడా హిట్టవ్వాలని లేదు.. థియేటర్లలో ఫ్లాప్ అయిన సినిమా టీవీల్లో కూడా ఫ్లాప్ అవుతుందనే గ్యారెంటీ లేదనేది స్పష్టం అవుతుంది.

ఇక 'ఆది కేశవ' విషయానికొస్తే.. ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్, శ్రీలీల తో పాటుగా అపర్ణా దాస్‌, సుమన్‌, రాధిక శరత్ కుమార్‌, సదా, జయప్రకాష్, తనికెళ్ళ భరణి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. మలయాళ విలక్షణ నటుడు జోజు జార్జ్‌ విలన్‌ గా నటించారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నాగ వంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం సమకూర్చారు.