Begin typing your search above and press return to search.

వాళ్లను చూసి నేర్చుకోవాల్సిందే..!

ఈమధ్య వస్తున్న సీనియర్ హీరోల సినిమాలు చూస్తే ఫ్యాన్స్ ఉన్నారు కదా వాళ్లే చూసుకుంటారనుకుంటే పొరబడినట్టే.

By:  Tupaki Desk   |   12 Aug 2023 7:53 AM GMT
వాళ్లను చూసి నేర్చుకోవాల్సిందే..!
X

తరాలు మారుతున్నా కొత్త కథలతో తెలుగు సినిమా స్థాయి ప్రపంచస్థాయికి తీసుకెళ్తున్నా సరే కొన్ని సినిమాలు మాత్రం ఇంకా ఒకప్పటి పాత పద్ధతినే ఫాలో అవుతూ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. ముఖ్యంగా హీరోకి ఉన్న కోట్ల మంది ఫ్యాన్స్ ని చూసి వారేం చేసినా చెల్లుబాటు అవుతుంది అనుకునే రోజులు పోయాయి. సరైన కథ అందుకు తగినట్టుగా కథనం లేకపోతే స్టార్ సినిమా అయినా సరే చీల్చి చెండాడేస్తున్నారు ఆడియన్స్. ఈ క్రమంలో సీనియర్ స్టార్ హీరోల సినిమాల మీద ఈ ఫోకస్ ఎక్కువగా ఉంటుంది.

దశాబ్దాల అనుభవం.. కోట్ల కొద్దీ ఫ్యాన్స్.. తాము ఎలాంటి సినిమా చేసినా సరే ఫ్యాన్స్ మెచ్చుతారు అనుకుంటే పొరపాటు జరిగినట్టే. మారిన సినిమా ప్రమాణాలను.. ప్రేక్షకుల ఆలోచన విధానాన్ని బట్టి సినిమాలు చేయాలి. ఎలాంటి కథ తీసుకున్నా సరే ఫ్యాన్స్ మీద నెట్టేసి డ్యాన్స్ లు, ఫైట్స్ లు పెట్టడం అన్నది ఆమోదయోగ్యం కానీ పనే అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈమధ్య వస్తున్న సీనియర్ హీరోల సినిమాలు చూస్తే ఫ్యాన్స్ ఉన్నారు కదా వాళ్లే చూసుకుంటారనుకుంటే పొరబడినట్టే. ఆ ఫ్యాన్స్ కూడా సినిమా చూసి ఎంజాయ్ చేయలేని పరిస్థితి వస్తే ఏమి చేయలేరు.

సీనియర్ హీరో ఒకరు డ్యాన్స్ బాగా వేస్తే.. మరొకరి సినిమాలో రక్తం ఏరులై పారుతుంది. వారి దగ్గరకు ఎలాంటి సినిమా వచ్చినా సరే ఆ కథను వారికి నచ్చినట్టుగా.. వారి ఫ్యాన్స్ కోరుకునే అంశాలు పెట్టి చేస్తున్నారు. అదే సినిమాకు దెబ్బ పడేలా చేస్తుంది. ఈ విషయంలో మలయాళ సీనియర్ స్టార్స్ ని ప్రత్యేకంగా ప్రశం సించాల్సిందే. మలయాళంలో మమ్ముట్టి, మోహన్ లాల్ లు కథను నమ్మి సినిమాలు చేస్తారు. వారికి అక్కడ బీభత్సమైన ఫ్యాన్స్ ఉన్నారు. కానీ ఆ ఫ్యాన్స్ ని నమ్మి.. ఫ్యాన్స్ కోరుకున్నట్టు సినిమా చేయరు వీరు కొత్త పంథాలో సినిమా చేస్తూ ఆ ఫ్యాన్స్ మెప్పు పొందుతున్నారు.

అయితే ఈ పంథాని తెలుగు స్టార్స్ కొనసాగించలేకపోతున్నారు. మన హీరోల ఇమేజ్ కి అలాంటి కథలు నప్పవని చెప్పుకోవడమే తప్ప అలాంటి కథలను తీసి ఫ్యాన్స్ ముందుకొస్తే బెటర్ అని చెప్పొచ్చు. రీసెంట్ గా వచ్చిన ఓ స్టార్ సినిమా 90ల నాటి కథ కథనంతో వచ్చిందని దుమ్మెత్తిపోస్తున్నారు. ఆ హీరో వరకు సినిమాకు న్యాయం చేసినా మిగతా యాస్పెక్ట్స్ అన్నిటిలో సినిమా ఫెయిల్యూర్ అయ్యింది.

అయితే రీమేక్ సినిమా కావడం.. అందరికి తెలిసిన కథ అవడం వల్ల ఈ రిజల్ట్ వచ్చిందని చెప్పుకున్నా ఇలాంటి హీరోలు ఒరిజినల్ స్టోరీస్ ముఖ్యంగా కంటెంట్ బేస్డ్ సినిమాలు చేస్తే రిజల్ట్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని చెప్పొచ్చు. మరి మన హీరోలు ఇప్పటికైనా పంథా మారుస్తారా లేదా అన్నది చూడాలి.