Begin typing your search above and press return to search.

సీనియర్స్ కూడా రిస్క్ చేసేందుకు రెడీ..!

కథ కుదరకపోతే అక్కడ ఎంత పెద్ద స్టార్ హీరో ఉన్నా వృధా అవుతుంది.

By:  Tupaki Desk   |   12 April 2024 3:30 PM GMT
సీనియర్స్ కూడా రిస్క్ చేసేందుకు రెడీ..!
X

లక్షల కొద్దీ హార్డ్ కోర్ అభిమానులు ఉన్నా.. కోట్ల కొద్దీ తమను ఇష్టపడే ఆడియన్స్ ఉన్నా.. వందకు పైగా సినిమాలు చేసిన అనుభవం ఉన్నా.. ఇవేవి ఒక సినిమాకు కారణాలు కావు. యువ హీరో నుంచి స్టార్ హీరో వరకు కథే మొదటి హీరో.. ఆ కథలో కథనంలో పోషించే పాత్రలే హీరోలు. కథ సరిగా కుదిరితేనే హీరో కి ఉన్న స్టార్ ఇమేజ్ కూడా దానికి యాడ్ అవుతుంది. కథ కుదరకపోతే అక్కడ ఎంత పెద్ద స్టార్ హీరో ఉన్నా వృధా అవుతుంది.

తెలుగు తెర మీద ఎప్పుడు చూడని అద్భుతమైన కథలు, కథనాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు యువ దర్శకులు. వారి ప్రతిభ మెచ్చి సీనియర్ స్టార్స్ కూడా వారితో కలిసి పనిచేసేందుకు సై అనేస్తున్నారు. సీనియర్ స్టార్ హీరోలు ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సినిమాల వైపు ఒకసారి చూస్తే. మెగాస్టార్ చిరంజీవి కేవలం ఒకే ఒక సినిమా అనుభవం ఉన్న డైరెక్టర్ వశిష్టతో విశ్వంభర సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకోసం భారీ రిస్క్ చేస్తున్నాడని తెలుస్తుంది. ఆడియన్స్ కు విజువల్ ఫీస్ట్ అందించేందుకు మేకర్స్ సూపర్ స్కెచ్ వేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమా కోసం చిరు తన ఏజ్ ని కూడా లెక్క చేయకుండా రిస్క్ చేస్తున్నాడని టాక్.

ఇక నందమూరి బాలకృష్ణ చేస్తున్న సినిమా కూడా డైరెక్టర్ కె.ఎస్ బాబీ డైరెక్షన్ లో వస్తుంది. ఈ సినిమా కూడా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చేందుకు రెడీ అవుతుంది. ఈ సినిమా విషయంలో కూడా మేకర్స్ అదిరిపోయే యాక్షన్ సీన్స్ ప్లాన్ చేస్తున్నారట. ఫ్యాన్స్ ని అలరించేందుకు బాలయ్య కూడా ఈ యాక్షన్ సీన్స్ కోసం చాలా కష్టపడుతున్నారని తెలుస్తుంది. బాలయ్య ఈ సినిమాలో డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ తో కనిపిస్తారని తెలుస్తుంది.

సీనియర్ స్టార్ హీరోల్లో వెంకటేష్ కాస్త రేసులో వెనక పడినట్టు అనిపించినా మళ్లీ తిరిగి ఫాం లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. సైంధవ్ తో స్టైలిష్ యాక్షన్ మూవీ చేయగా అది కాస్త మిస్ ఫైర్ అయ్యింది. అందుకే తనకు హిట్ ఇచ్చిన డైరెక్టర్ అనీల్ రావిపుడితో వెంకటేష్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ తో వస్తుందని తెలుస్తుంది. ఈ సినిమా కోసం వెంకటేష్ ఏం చేసేందుకైనా రెడీ అనేస్తున్నాడని టాక్.

ఇక నా సామిరంగ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నాగార్జున తన నెక్స్ట్ సినిమా విషయంలో భారీ ప్లానింగ్ తో ఉన్నారు. ఆల్రెడీ ధనుష్ కుబేరలో నటిస్తున్న నాగార్జున సోలో సినిమా కోసం రకరకాల కథలు వింటున్నాడని తెలుస్తుంది. తమిళ దర్శకుడు నవీన్ తో నాగ్ సినిమా లాక్ అయినట్టు టాక్. అఫీషియల్ అనౌన్స్ మెంట్ బయటకు రావాల్సి ఉంది. నాగార్జున కూడా తర్వాత సినిమా యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో ఉండేలా ప్లాన్ చేస్తున్నారట.

ఓ పక్క యువ హీరోలు వెరైటీ కథలతో అదరగొట్టేస్తుంటే సీనియర్ హీరోలుగా రొటీన్ టెంప్లేట్ సినిమాలు చేస్తే ఎలా అనే ఆలోచనతో సీనియర్ స్టార్స్ అంతా తమ ఫుల్ ఎఫర్ట్ పెట్టేస్తున్నారు.