Begin typing your search above and press return to search.

సీనియర్ డైరెక్టర్ లవ్ స్టోరీ చెబుతాడట..!

ఆ సినిమాకన్నా ముందు బలగం రావడంతో ఆ ఎఫెక్ట్ రంగమార్తాండ మీద పడిందని చెప్పుకొచ్చారు.

By:  Tupaki Desk   |   21 March 2024 5:30 PM GMT
సీనియర్ డైరెక్టర్ లవ్ స్టోరీ చెబుతాడట..!
X

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న దర్శకుడు కృష్ణవంశీ. ఇది అది అని కాకుండా డిఫరెంట్ జోనర్స్ ట్రై చేసిన కృష్ణవంశీ ఇప్పుడు పూర్తిగా ట్రాక్ తప్పాడు. లాస్ట్ ఇయర్ ఆయన చేసిన రంగమార్తాండ సినిమా ఆశించిన స్థాయిలో వర్క్ అవుట్ కాలేదు. ఆ సినిమాకన్నా ముందు బలగం రావడంతో ఆ ఎఫెక్ట్ రంగమార్తాండ మీద పడిందని చెప్పుకొచ్చారు. కానీ ఏ సినిమా లెక్క ఆ సినిమాదే కాబట్టి అలా చెప్పడం కష్టం.


ఇక లేటెస్ట్ గా కృష్ణవంశీ తన నెక్స్ట్ సినిమా ప్రయత్నాల్లో ఉన్నారని తెలుస్తుంది. ఈసారి కృష్ణవంశీ లవ్ స్టోరీ చేస్తున్నాడని టాక్. 3 జంటల ప్రేమకథలతో కృష్ణవంశీ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. కొత్త వాళ్లతో ఈ ప్రేమకథ తెరకెక్కించే ప్లానింగ్ లో ఉన్నారట కె.వి. తను ఎంచుకున్న ఎలాంటి కథతో అయినా డైరెక్టర్ గా తన ప్రతిభ చూపించే కృష్ణవంశీ కొన్నాళ్లుగా సరైన హిట్టు పడక కెరీర్ లో వెనుక పడ్డాడు.

ఇంతకీ కృష్ణవంశీ లవ్ స్టోరీ చేస్తే ఎలా ఉంటుంది అంటే ఆల్రెడీ ఆయన గులాబీ చూసిన ఆడియన్స్ కు మరోసారి మళ్లీ కృష్ణవంశీ మొదటి రోజులు గుర్తు చేసుకునేలా చేస్తాడని అంటున్నారు. డైరెక్టర్ గా ఎక్కడ తను చెప్పే కథ విషయంలో ఎవరు వేలెత్తనివ్వకుండా చేసుకునే కృష్ణవంశీ ఈసారి ప్రేమకథతో రావడం ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది.

మరి ఈ సీనియర్ డైరెక్టర్ ఈ తరం యువత మెచ్చే లవ్ స్టోరీ చేయగలడా.. ప్రస్తుతం లవ్ స్టోరీ ఎలా మొదలవుతుంది.. ఎలా కొనసాగుతుంది లాంటి విషయాలను కృష్ణవంశీ ఎలా చెప్పబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. తప్పకుండా కృష్ణవంశీ చేయబోతున్న ఈ లవ్ స్టోరీ సినిమాపై ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెరిగింది. ఇంతకీ ఈ సినిమా కాస్టింగ్ ఎవరు.. సినిమా ఎప్పుడు మొదలవుతుంది లాంటి డీటైల్స్ త్వరలో తెలుస్తాయి. లవ్ స్టోరీ అది కూడా సీనియర్ డైరెక్టర్ కృష్ణవంశీ లాంటి వారు తీయడం అంటే సంథింగ్ స్పెషల్ అని చెప్పొచ్చు. అయితే ఈ తరం యువ దర్శకులు కొత్త కొత్త పాయింట్స్ తో ప్రేమ కథలు తీస్తుంటే వారికి ధీటుగా కృష్ణవంశీ మెప్పించగలడా లేదా అన్నది చూడాలి.