Begin typing your search above and press return to search.

త‌ప్పుడు రాత‌లు అంటూ ఖండించిన సీనియ‌ర్ న‌టి

ప్ర‌గ‌తి ఒక నిర్మాతను పెళ్లి చేసుకోబోతున్నట్లు క‌థ‌నాలు వ‌చ్చాయి. అయితే ఇలాంటి వాటిని చదివిన త‌ర్వాత‌ ప్రగతి త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డ్డారు.

By:  Tupaki Desk   |   30 Oct 2023 4:50 AM GMT
త‌ప్పుడు రాత‌లు అంటూ ఖండించిన సీనియ‌ర్ న‌టి
X

ట్రెండ్ ని అనుస‌రించి కెరీర్ ప‌రంగా దూసుకెళ్ల‌డ‌మెలానో న‌టి ప్ర‌గ‌తిని చూసి నేర్చుకోవాలి. నేటిత‌రంలో తీవ్ర‌మైన‌ పోటీని ఎదుర్కొనేందుకు ప్ర‌గ‌తి ఎన్నో సాహ‌సాలు చేస్తుంటారు. న‌టిగా త‌న అందం ఫిట్నెస్‌ని కాపాడుకునేందుకు ఆమె చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు. జిమ్ యోగా అంటూ తన అధిక బ‌రువును త‌గ్గించి ఇటీవ‌ల స్లిమ్ అయ్యారు. ప్ర‌గ‌తి రెగ్యుల‌ర్ ఫిట్ నెస్ వీడియోలు, డ్యాన్సింగ్ వీడియోలు ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. ఒక ఆర్టిస్టు ఎదగాలంటే ఎలాంటి ఫ్లెక్సిబిలిటీ అవ‌స‌రం అన్న‌ది ఔత్సాహిక న‌టీమ‌ణులు ప్ర‌గ‌తిని చూసి నేర్వాలి.

అయితే ఇప్పుడు ఈ సీనియ‌ర్ న‌టీమ‌ణిపై ఊహించ‌ని క‌థ‌నాలు మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ప్ర‌గ‌తి ఒక నిర్మాతను పెళ్లి చేసుకోబోతున్నట్లు క‌థ‌నాలు వ‌చ్చాయి. అయితే ఇలాంటి వాటిని చదివిన త‌ర్వాత‌ ప్రగతి త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డ్డారు. ఈ వార్తను ప్రచురించిన తెలుగు దినపత్రికను ప్రగతి ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో విమర్శించారు. ఇంత నిరాధారమైన కథనాన్ని ఒక పేరున్న మీడియా సంస్థ ధృవీకరించకుండా ఎలా ప్రచురిస్తుందని స‌ద‌రు న‌టీమ‌ణి ప్రశ్నించారు.

గతంలోను త‌న‌పై ఇలాంటి రూమ‌ర్లు వ‌చ్చాయి. కానీ ఈసారి ఎవ‌రినీ క్ష‌మించ‌లేదు. వెంట‌నే అధికారిక వీడియో ద్వారా ఆ పుకార్ల‌ను ఖండించారు. ఇవ‌న్నీ నిరాధారమైనవే కాకుండా, బాధాకరమని కూడా పేర్కొన్నారు. ప్ర‌గ‌తికి ఒక కుమారుడు ఉన్నాడు. ఎదిగిన కొడుకుతో కలిసి చెన్నైలో నివసిస్తున్నార‌ని తెలిసింది.

ఇంత‌కీ తెలుగు మీడియా క‌థ‌నంలో ఏం రాసారు? అంటే.. ప్రగతి- తెలుగు నిర్మాత ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. కానీ ఇంత‌లోనే వారు కొత్త జీవితాన్ని ప్రారంభించాలని యోచిస్తున్నారు.. అంటూ ఆ క‌థ‌నంలో రాసారు. కానీ ఈ గాసిప్పులు ప్ర‌గ‌తిని తీవ్రంగా హ‌ర్ట్ చేసాయి. అందుకే అధికారికంగా వాటిని ఖండించారు. త‌న లైఫ్ లోని ఏ విష‌యాన్ని అయినా బ‌హిరంగంగా సోష‌ల్ మీడియాల్లో షేర్ చేసే ప్ర‌గ‌తి కెరీర్ లో ఎన్నో విల‌క్ష‌ణ పాత్ర‌ల‌తో అల‌రించారు. అమ్మ‌, అక్క త‌ర‌హా పాత్ర‌ల్లో ఒదిగిపోయి న‌టించారు.