Begin typing your search above and press return to search.

సీనియర్లని తక్కువ అంచనా వేస్తున్నారు.. కానీ..!

సీనియర్ స్టార్ హీరోయిన్స్ లో ముందు వరుసలో ఉండే అనుష్క లాస్ట్ ఇయర్ మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో సర్ ప్రైజ్ చేసింది

By:  Tupaki Desk   |   16 April 2024 7:13 AM GMT
సీనియర్లని తక్కువ అంచనా వేస్తున్నారు.. కానీ..!
X

టాలీవుడ్ లో హీరోయిన్స్ కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. టాలెంట్ ఉంటే చాలు ఫస్ట్ సినిమాకే స్టార్ పట్టం ఇచ్చి కట్టపెట్టేస్తారు తెలుగు ఆడియన్స్. అందంతో అలరించే వారితో పాటుగా అభినయంతో మెప్పించే వారిని కూడా ఆదరిస్తుంటారు. ప్రతి వారం రిలీజ్ అవుతున్న పదుల కొద్దీ సినిమాల్లో కొత్త హీరోయిస్ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నా స్టార్ హీరోయిన్స్ మాత్రం తమ హవా కొనసాగిస్తున్నారు. అందులోనూ సీనియర్ హీరోయిన్స్ తమ మార్క్ చూపిస్తున్నారు.

ఫాంలో ఉన్నా లేకపోయినా సీనియర్ హీరోయిన్స్ కు ఉండే ఆ క్రేజ్ వేరేలా ఉంటుంది. అందుకే స్టార్ హీరోలు వారితో జత కట్టాలని ఆసక్తి చూపిస్తారు. కేవలం కమర్షియల్ సినిమాలతోనే కాదు ఫిమేల్ సెంట్రిక్ సినిమాలతో కూడా సీనియర్ హీరోయిన్స్ అలరిస్తారు. అందుకే వారికంటూ ఒక సెపరేట్ క్రేజ్ ఉంటుంది. తెలుగులో ఈమధ్య సీనియర్ హీరోయిన్స్ హవా తగ్గినట్టు అనిపించినా రాబోతున్న సినిమాలతో మళ్లీ వారు తిరిగి ట్రాక్ లోకి వచ్చేలా కనిపిస్తున్నారు.

సీనియర్ స్టార్ హీరోయిన్స్ లో ముందు వరుసలో ఉండే అనుష్క లాస్ట్ ఇయర్ మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో సర్ ప్రైజ్ చేసింది. గ్యాప్ ఇచ్చినా సరే తన రేంజ్ ఏంటో చూపిస్తున్న అనుష్క ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్ లో ఘాఠి తో పాటుగా మలయాళంలో కథనార్ సినిమాలో ఛాన్స్ అందుకుంది. ఈ రెండు సినిమాలు లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ లు అవ్వడంతో అనుష్క ఫ్యాన్స్ సూపర్ హ్యాపీగా ఉన్నారు.

ఇక సీనియర్ హీరోయిన్స్ లో సూపర్ దూకుడు చూపిస్తున్న భామ త్రిష. ఇన్నాళ్లు కోలీవుడ్ లోనే తన ఫాం కొనసాగించిన చెన్నై చిన్నది ఇప్పుడు తెలుగులో కూడా వరుస ప్రాజెక్ట్ లు చేస్తుంది. ప్రస్తుతం త్రిష మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాలో నటిస్తుంది. అంతేకాదు అజిత్ హీరోగా చేస్తున్న విడాముయర్చి లో కూడా భాగం అవుతుంది. మోహన్ లాల్ రాం తో పాటుగా కమల్ హాసన్ థగ్ లైఫ్ లో కూడా త్రిష నటిస్తుంది. మలయాళంలో టోవినో థామస్ చేస్తున్న ఐడెంటిటీలో కూడా త్రిష ఛాన్స్ అందుకుంది.

సౌత్ సీనియర్ హీరోయిన్స్ లో ఎప్పటికీ టాప్ ప్లేస్ లో ఉండే నయనతార ఈమధ్య కాస్త జోరు తగ్గించినట్టు అనిపించినా తిరిగి ఫాం లోకి వచ్చేందుకు వరుస సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం నయనతార తమిళంలో టెస్ట్ అనే సినిమా చేస్తుంది. ఈ సినిమాతో పాటుగా మన్నంగట్టి సిన్స్ 1960 సినిమాతో రాబోతుంది. సీనియర్ హీరోయిన్స్ లో తన మార్క్ చూపిస్తూ వస్తుంది తమన్నా. రెండు దశాబ్దాల కెరీర్ లో తమన్నా ఇప్పటికీ తన దూకుడు కొనసాగిస్తూనే ఉంది. ప్రస్తుతం బాక్ తో ఏప్రిల్ 26న రాబోతున్న తమన్నా అరణ్మనై 4, ఓదెల 2 సినిమాల్లో నటిస్తుంది. బాలీవుడ్ లో సినిమాలు, వెబ్ సీరీస్ లతో కూడా తమన్నా అదరగొట్టేస్తుంది.

సీనియర్ భామల్లో ఆఫ్టర్ మ్యారేజ్ తన హవా కొనసాగించాలని చూస్తుంది కాజల్. ప్రస్తుతం కాజల్ సత్యభామ అనే ఫిమేల్ సెంట్రిక్ సినిమా చేస్తుంది. దీనితో పాటుగా కమల్ హాసన్ భారతీయుడు 2 లో నటిస్తుంది.

కొత్త హీరోయిన్స్ తో పాటుగా ఇప్పుడు స్టార్స్ గా కొనసాగుతున్న హీరోయిన్స్ కు కూడా సీనియర్ స్టార్ హీరోయిన్స్ షాక్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు.