Begin typing your search above and press return to search.

అందుకే పెళ్లి చేసుకోలేదు..నాటి పంచదార చిలుక

అందంగా ఉంటూనే.. ఆకర్షణీయంగా ఉండే హీరోయిన్లు కాస్త తక్కువే.

By:  Tupaki Desk   |   7 Sep 2023 4:55 AM GMT
అందుకే పెళ్లి చేసుకోలేదు..నాటి పంచదార చిలుక
X

అందంగా ఉంటూనే.. ఆకర్షణీయంగా ఉండే హీరోయిన్లు కాస్త తక్కువే. కలువల్లాంటి కళ్లు.. కొటేరు ముక్కు.. తీర్చిదిద్దినట్లుగా ఉండే పెదాలు.. వీటన్నింటికి తోడు సన్నజాజి మొగ్గలా ఉండే పంచదార చిలుక పేరుకు తగ్గట్లే ఉంటారు కర్ణాటక నటి కౌసల్య. టీన్స్ లో ఉన్నప్పుడు ‘‘ఏప్రిల్ 19’’ అనే మలయాళీ మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఆమె తెలుగులో పంచదార చిలుక మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఇండస్ట్రీకి వచ్చి దాదాపు పాతికేళ్లు దాటిన ఆమె.. హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించి.. ప్రస్తుతం సహాయ నటి క్యారెక్టర్లు చేస్తున్నారు.

కొంతకాలం ఆరోగ్య సమస్యల కారణంగా సినిమాలకు దూరంగా ఉన్న మళ్లీ.. వరుస చిత్రాలకు కమిట్ మెంట్ ఇస్తూ బిజీ అవుతున్నారు. నలభైమూడేళ్ల వయసులోనూ పెళ్లి చేసుకోని ఆమె.. అందుకు కారణంపై తాజాగా పెదవి విప్పారు. పెళ్లిపై తనకు మంచి ఉద్దేశమే ఉందన్న ఆమె.. పెళ్లి చేసుకోకపోవటానికి వేరే కారణాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.

సరైన వ్యక్తి లైఫ్ లోకి అడుగు పెట్టినప్పుడు పెళ్లి బంధం అందంగా ఉంటుందన్న ఆమె.. ‘‘పెళ్లి మీద ఎన్నో ఆలోచనలు ఉండేవి. పెళ్లికి మొదట్లో సెట్ కానని అనుకునేదాన్ని. సరైన వ్యక్తి దొరకడేమోనని భయపడేదాన్ని. ఒక దశలో సరైన బంధం కోసం చూశా. కానీ.. అది సెట్ కాలేదు. దీంతో పేరెంట్స్ తో ఉండాలనుకున్నా. అదే టైంలో పెళ్లైతే అత్తమామలతో ఎలా ఉంటానో అన్న సందేహం వెంటాడేది. దీంతో కొంతకాలం రిలేషన్.. పెళ్లి అనే వాటికి దూరంగా ఉన్నా. కొంతకాలం క్రితం అనారోగ్యానికి గురయ్యా. బరువు బాగా పెరిగా. అప్పట్లో చేసిన సినిమాలు సంత్రప్తి ఇవ్వలేదు. దీంతో బ్రేక్ తీసుకున్నా’’ అని చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం తన ఆరోగ్యం సెట్ అయ్యిందని.. తానిప్పుడు బాగానే ఉన్నానని చెప్పిన కౌసల్య.. ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూ.. బిజీగా ఉన్నారు. మరి.. ఇప్పటికైనా పెళ్లి మీద క్లారిటీతో.. ఆ దిశగా అడుగులు వేస్తారో లేదో కాలమే డిసైడ్ చేయాలి.