Begin typing your search above and press return to search.

మ‌త‌ల‌బ్ క్యా హై? అప్పుడు తిట్టి ఇప్పుడు పొగిడాడు!

సీనియ‌ర్ న‌టుడు నానా పటేకర్ ఇటీవల విడుదలైన మసాలా చిత్రాలపై పరోక్షంగా విమ‌ర్శ‌లు గుప్పిస్తూ మీడియా హెడ్‌లైన్స్ కెక్కిన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   30 Sep 2023 4:05 AM GMT
మ‌త‌ల‌బ్ క్యా హై? అప్పుడు తిట్టి ఇప్పుడు పొగిడాడు!
X

సీనియ‌ర్ న‌టుడు నానా పటేకర్ ఇటీవల విడుదలైన మసాలా చిత్రాలపై పరోక్షంగా విమ‌ర్శ‌లు గుప్పిస్తూ మీడియా హెడ్‌లైన్స్ కెక్కిన సంగ‌తి తెలిసిందే.. వాటిని `ఘినోని ఫిల్మీన్` అని కామెంట్ చేసాడు. ఆ సినిమాలను తాను ఎలా తట్టుకోలేకపోతున్నాడో కూడా ప్రస్తావించాడు. ఇటీవ‌ల బ్లాక్ బ‌స్ట‌ర్లుగా నిలిచిన‌ గదర్ 2, జవాన్ చిత్రాలను అత‌డు విమ‌ర్శిస్తున్నాడ‌ని ప్ర‌జ‌లు అర్థం చేసుకున్నారు. చాలా మంది బ్లాక్ బ‌స్ట‌ర్ల‌ను ఇలా విమ‌ర్శించ‌డ‌మేమిటీ అంటూ ఆశ్చర్యపోయారు. తాజా ఇంటర్వ్యూలో నానా మాట మార్చ‌డం హాట్ టాపిక్ అయింది.

ప్ర‌ముఖ వార్తా చానెల్ కి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో జవాన్ స్టార్ షారూఖ్‌తో మీకు ఏమైనా విభేదాలు ఉన్నాయా? అని నానా పటేకర్‌ను ఇంట‌ర్వ్యూవ‌ర్ ప్ర‌శ్నించారు. దానికి అతను బహుత్ అచ్చా కళాకార్ హై! అని బదులిచ్చారు. ఇస్కీ పెహ్లీ చిత్రం మేరే సాథ్ థీ, రాజు బన్ గయా జెంటిల్‌మన్. దూస్రీ హో గయీ, లేకిన్ పెహ్లీ వాలీ మేరే సాథ్ థీ.. అంటూ ఇంకా చాలా విష‌యాల‌ను ప్ర‌స్తావించాడు. నానా ప‌టేక‌ర్ హిందీ మాట‌ల‌కు అర్థాన్ని త‌ర్జూమా చేస్తే.. ``అతడు (షారూఖ్‌) చాలా మంచి కళాకారుడు. అతడి మొదటి సినిమా `రాజు బన్ గయా జెంటిల్‌మన్` నాతోనే. ఖాన్ నటించిన‌ మరొక చిత్రం మొదట విడుదలైంది. కానీ అతడి మొదటి చిత్రం నాతోనే. మీరు అతడిని అడగవచ్చు... ఏదో ఒక రోజు చాలా పెద్ద స్టార్ అవుతాడని అతడి మొదటి సినిమా సమయంలోనే నేను అతడికి చెప్పాను`` అని అన్నాడు.

జ‌వాన్ ని తీవ్రంగా విమ‌ర్శించిన‌ నానా పటేకర్.. షారూఖ్ ఖాన్‌ను మంచి ఆర్టిస్ట్ అని ప్ర‌శంసించ‌డం ఆస‌క్తిక‌రం. షారుఖ్ ఖాన్ తనను కలిసినప్పుడల్లా ఎంతో గౌరవప్రదంగా ప్రవర్తిస్తాడని కూడా నానా ప‌టేక‌ర్ తెలిపారు. ఖాన్ తో ఎలాంటి సమస్యలు లేవు... అతను నా సొంత మ‌నిషి. నా కంటే జూనియర్.. కాబట్టి అతనితో సమస్య ఎందుకు?.. అని కూడా వ్యాఖ్యానించారు.

తాజాగా విడుద‌లైన `వ్యాక్సిన్ వార్` చిత్రానికి మిశ్ర‌మ స్పంద‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అయితే ఈ చిత్రంలో నానా ప‌టేక‌ర్ షో స్టాప‌ర్ గా నిలిచాడ‌ని ప్ర‌శంస‌లు కురిసాయి.

జ‌వాన్ పై ఏమ‌ని కామెంట్ చేసాడు?

`ది వ్యాక్సిన్ వార్` ట్రైలర్ లాంచ్‌లో బాక్సాఫీస్ వద్ద గొప్ప‌ విజయాన్ని ఆస్వాధిస్తున్న చిత్రాన్ని తాను చూశానని నానా వెల్లడించాడు. అయితే సినిమా మొత్తం కూర్చొని తట్టుకోలేకపోయాన‌ని చెప్పాడు. ఒక నిర్దిష్ట తరహా సినిమాని నిర్మిస్తున్నారని ప్రేక్షకులు వాటిని చూసేలా ఒత్తిడి తెస్తున్నారని ఆయన ఘాటుగానే విమ‌ర్శించారు. అంతేకాదు.. మొదట్లో క్రాఫ్ట్‌లో ప్రావీణ్యం లేకపోయినా, తన కొడుకును నటుడిగా తీర్చిదిద్ది ప్రేక్షకులకు అందించాలనే తన ఉద్దేశాన్ని ప్రస్తావించాడు. 5-10 చిత్రాలలో నటించిన తర్వాత ప్రజలు క్రమంగా తనలోని లోపాలను విస్మరిస్తారని అత‌డి ప్రతిభను స్వీకరించడం నేర్చుకుంటారని కూడా నానా అన్నారు. నేటి స్టార్ల ప్ర‌ద‌ర్శ‌న‌కు, ప్రస్తుత చలనచిత్ర నిర్మాణ స్థితికి మధ్య సమాంతరాన్ని చిత్రించే ప్ర‌య‌త్నం చేసాడు. నానా ఏ సినిమా పేరును ప్ర‌స్థావించ‌క‌పోయినా కానీ, అప్ప‌టికి ఘ‌న‌విజ‌యం సాధించిన గదర్ 2 లేదా జవాన్ పైనే ఈ విమ‌ర్శ‌లు అని అంతా ఊహించ‌రు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగించిన సంగ‌తి తెలిసిందే. ది వ్యాక్సిన్ వార్ చిత్రంలో అనుపమ్ ఖేర్, నానా పటేకర్, సప్తమి గౌడ, పల్లవి జోషి కూడా ప్రధాన పాత్రల్లో నటించారు. సెప్టెంబర్ 28న థియేటర్లలోకి విడుద‌లైంది. ఈ సినిమాకి మిశ్ర‌మ స్పంద‌న‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. నార్త్ లో ఎలా ఉన్నా కానీ, సౌత్ లో ఈ చిత్రానికి ఆద‌ర‌ణ‌పై సందేహాలు వ్య‌క్త‌మ‌య్యాయి.