సీనియర్ స్టార్ సెకండ్ ఇన్నింగ్స్ కేకో కేక!
హీరోగా `సొగసు చూడతరమా` మూవీతో అలరించినా ఆ తరువాత హీరో వేషాలకు గుడ్ బై చెప్పేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలతో సెకండ్ ఇన్నింగ్స్‌ని స్టార్ట్ చేశారు.
By: Tupaki Desk | 20 Jan 2026 2:00 PM ISTటాలీవుడ్‌లో స్ట్రాంగ్ సపోర్టింగ్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు సీనియర్ నరేష్. 90వ దశకంలో కామెడీ ప్రధాన చిత్రాలతో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్‌తో పోటీపడి వరుస విజయాల్ని సొంతం చేసుకున్నారు. అంతే కాకుండా కామెడీ సినిమాలతో తన కంటూ ప్రత్యేకతను చాటుకున్నారు. హీరోగా `సొగసు చూడతరమా` మూవీతో అలరించినా ఆ తరువాత హీరో వేషాలకు గుడ్ బై చెప్పేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలతో సెకండ్ ఇన్నింగ్స్‌ని స్టార్ట్ చేశారు. మొదట్లో కామెడీ టచ్ తక్కువ సీరియస్ టచ్ ఎక్కువ ఉన్న క్యారెక్టర్లలో కనిపించారు.
హైపర్ వరకు నరేష్ పోషించిన పాత్రలు ఫరవాలేదనిపించాయే కానీ కథకు పెద్దగా ప్లస్ కాలేకపోయాయి. అయితే ఆ లోటుని గమనించారో ఏమో కానీ నితిన్, త్రివిక్రమ్‌ల కలయికలో రూపొందిన `అఆ` మూవీ నుంచి నరేష్ ట్రాక్ మార్చారు. తన క్యారెక్టర్‌కు ప్రాధాన్యత ఉండేలా చూసుకుంటూ కామెడీ టచ్‌తో సినిమాకు ప్లస్ అయ్యేలా చూసుకుంటున్నారు. ఈ సినిమాతో ఫర్‌ఫెక్ట్‌గా సెకండ్ ఇన్నింగ్స్‌ని ప్లాన్ చేసుకున్న సీనియర్ నరేష్ అప్పటి నుంచి తన మార్కు క్యారెక్టర్లతో ప్రేక్షకుల్ని అలరిస్తూ సినిమా విజయంలో తన వంతు పాత్ర పోషిస్తున్నారు.
1995లో వచ్చిన మార్పులకు తగ్గట్టుగా హీరో క్యారెక్టర్లని పక్కన పెట్టి హీరో సపోర్టింగ్ క్యారెక్టర్లపై దృష్టి పెట్టారు. అదే ఆయన కెరీర్‌ని మరో మలుపు తిప్పి ఆర్టిస్ట్‌గా ఊహించని విధంగా బిజీ అయ్యేలా చేసింది. శతమానం భవతి, రంగస్థలం, మహానటి, ప్రతిరోజు పండగే, భీష్మ వంటి సినిమాల్లో కామెడీతో నిండిన క్యారెక్టర్‌లు పోషించి ఆకట్టుకున్నారు. టాలీవుడ్‌లో హీరో పాత్రలకు స్ట్రాంగ్ సపోర్టింగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లకు కొరత ఏర్పడింది. ఆ కొరతని నరేష్ తీరుస్తూ యంగ్ హీరోల సినిమాల సక్సెస్‌లకు ప్రధాన భూమిక పోషిస్తున్నారు.
సెకండ్ ఇన్నింగ్స్‌లో ఎక్కువగా రెగ్యులర్ క్యారెక్టర్‌లకు ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రయోగాత్మక పాత్రలకే పెద్ద పీట వేస్తున్నారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ `సామజవరగమన`లో డిగ్రీ పాస్ కావడం కోసం శ్రమించే తండ్రి క్యారెక్టర్. రీసెంట్‌గా సంక్రాంతికి విడుదలైన `నారీ నారీ నడుమ మురారీ` మూవీలో ఎదిగిన కొడుకు ఉన్నా కానీ మళ్లీ పెళ్లి చేసుకునే తండ్రి పాత్రలో నరేష్ నటించిన తీరు థియేటర్లలో నవ్వులు పూయిస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే సినిమాకు తన క్యారెక్టర్ మరింత ప్లస్ అయిందని చెప్పొచ్చు.
`రంగస్థలం`లాంటి సీరియస్‌తో సాగే భావోద్వేగా క్యారెక్టర్‌లతో ఆకట్టుకుంటూనే సామజవరగమన, నారీ నారీ నడుము మురారీ` అంటి సినిమాల్లో తనదైన మార్కు హాస్యరస పాత్రలతోనూ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తున్నారు. నటుడిగా బాహుఖ ప్రజ్ఞని ప్రదర్శిస్తున్న నరేష్‌ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం యంగ్ డైరెక్టర్స్‌కొత్త తరహా పాత్రలని సృష్టిస్తున్నారు. బలమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ల కొరత ఏర్పడిన నేపథ్యంలో కొత్త తరహా పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన నరేష్ ప్రస్తుతం గరివిడి లక్ష్మి, క్రేజీ కల్యాణం, శుభకృత్ నామ సంవత్సరం, హే భగవాన్ వంటి సినిమాల్లో నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో నటిస్తున్నారు. ఇవి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
