Begin typing your search above and press return to search.

సీనియ‌ర్ భామ‌లు క్ష‌ణం ఖాళీ లేకుండా!

హీరోల‌కు ఉన్నంత లాంగ్ కెరీర్ హీరోయిన్ల‌కు ఉండ‌దు. ఫాం..ఫేం ఉన్నంత కాల‌మే చ‌ల‌మాణీ అయ్యేది.

By:  Tupaki Desk   |   21 Jun 2025 5:00 AM IST
సీనియ‌ర్ భామ‌లు క్ష‌ణం ఖాళీ లేకుండా!
X

హీరోల‌కు ఉన్నంత లాంగ్ కెరీర్ హీరోయిన్ల‌కు ఉండ‌దు. ఫాం..ఫేం ఉన్నంత కాల‌మే చ‌ల‌మాణీ అయ్యేది. ఒక్క‌సారి ఫాం కోల్పోతే తిరిగి కోలుకోవ‌డం అన్న‌ది అంత వీజీ కాదు. దాదాపు అసాధ్యంగానే ప‌రిగ‌ణించాలి. కానీ బాలీవుడ్ లో కొంత‌మంది భామ‌లు ఇలాంటి ఫేజ్ లు అన్నింటిని దాటుకుని కొంత మంది సీనియ‌ర్ భామ‌లు ఇప్ప‌టికీ అదే ఛ‌రిష్మాతో ఇంస్ట్రీలో కొన‌సాగుతున్నారు. వ‌య‌సుతో పాటు అవ‌కాశాలు కూడా పెరుగుతున్నాయి.

సాహ‌సానికి వ‌య‌సు అడ్డంకి కాదంటూ ఎలాంటి పాత్ర వ‌చ్చినా నో చెప్ప‌కుండా న‌టిస్తున్నారు. వాళ్లే ట‌బు, కాజోల్, రాణీ ముఖ‌ర్జీ, విద్యాబాల‌న్, క‌రీనా క‌పూర్ వంటి భామ‌లు ఇప్ప‌టీకి గొప్ప కెరీర్ ని కొన‌సా గిస్తున్నారు. మేటి నాయిక‌ల‌తో పోటీ ప‌డి మ‌రి అవ‌కాశాలు అందుకుంటున్నారు. అవ‌కాశాలు అందు కోవ‌డంలో స్ట్రాట‌జీ కూడా భిన్నంగా క‌నిపిస్తుంది. ట‌బు బాలీవుడ్ తె ర‌పై మెరుస్తోన్న వైనం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు.

50 ఏళ్లు దాటినా ఎక్క‌డా త‌గ్గ‌లేదు. బోల్డ్ అండ్ రొమాంటిక్ పాత్ర‌ల విష‌యంలోనూ ఏమాత్రం రాజీ పడ‌కుండా న‌టిస్తోంది. ఇటీవ‌ల రిలీజ్ అయిన `హౌస్ ఫుల్ 5`తోనూ అల‌రించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ `బూత్ బంగ్లా`లో న‌టిస్తోంది. అలాగే విద్యాబాల‌న్ `భూల్ భులయ్య 3` త‌ర్వాత మ‌ళ్లీ ప్రేక్ష‌కుల ముందుకు రాలేదు. కానీ క‌మిట్ అయిన కొన్ని చిత్రాలున్నాయి. అవి ప‌ట్టాలెక్కాల్సి ఉంది.

కాజోల్ కూడా అంతే దూకుడు చూపిస్తోంది. `ల‌స్ట్ స్టోరీస్ -2`, ` దో ప‌త్తి`, `మా `లాంటి చిత్రాల‌తో మంచి విజ‌యాలు అందుకుంది. ఇటీవ‌ల రిలీజ్ అయిన `హౌస్ ఫుల్ 5`లోనూ న‌టించింది. ప్ర‌స్తుతం` క్వీన్ ఆఫ్ క్వీన్స్ `అనే లేడీ ఓరియేంటెడ్ చిత్రంలో న‌టిస్తోంది. అలాగే `స‌ర్జ‌మీన్` అనే సినిమాకు క‌మిట్ అయింది. ఇక రాణీ ముఖ‌ర్జీ గ‌త రెండేళ్ల‌గా ఖాళీగా ఉన్నా ఆ గ్యాప్ ను ఒకే ఏడాదిలో భ‌ర్తీ చేసేలా ముందుకెళ్తోంది. ప్ర‌స్తుతం `కింగ్`, `మ‌ర్దానీ 3`లో న‌టిస్తోంది. మర్దానీ హిట్ ప్రాంచైజీ నుంచి రిలీజ్ అవుతున్న థ‌ర్డ్ ఇన్ స్టాల్ మెంట్. ఈ చిత్రంపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. ఇలా సీనియ‌ర్ బ్యూటీలంతా సినిమాలో బిజీగా ఉన్నారు.