Begin typing your search above and press return to search.

సీనియ‌ర్ బ్యూటీలు గ్లామ‌ర్ తో గుద్దెస్తున్నారు!

ప్ర‌స్తుతం టాలీవుడ్ లో కొత్త భామ‌ల‌దే హ‌వా. ముఖ్యంగా సౌత్ నుంచి వ‌స్తోన్న భామ‌లు స్థిర‌ప డిపోతన్నారు.

By:  Tupaki Desk   |   4 July 2025 6:00 AM IST
సీనియ‌ర్ బ్యూటీలు గ్లామ‌ర్ తో గుద్దెస్తున్నారు!
X

ఇండ‌స్ట్రీలో పోటీ స‌హ‌జం. కొత్త నీరు వ‌చ్చే కొద్ది పాత నీరు పోతుంటుంది. కానీ కొంత పాత నీరు మాత్రం కొత్త నీరుతో పోటీగా ప్ర‌వ‌హిస్తుంది. ఇలాంటి పోటీ ప్ర‌తీ ఇండ‌స్ట్రీలోనూ క‌నిపిస్తుంది. కానీ ఆ పోటీ అంత ఈజీ కాదు. న‌వ నాయిక‌ల పోటీని సీనియ‌ర్ భామ‌లు త‌ట్టుకుని నిల‌బ‌డాలంటే అంతే ధీటుగా ప‌ని చేయాల్సి ఉంటుంది. ఆ విషయంలో కొంత మంది సీనియ‌ర్ బ్యూటీలు ఏమాత్రం త‌క్కువ కాద‌ని నిరూపిస్తున్నారు. ప్ర‌స్తుతం టాలీవుడ్ లో కొత్త భామ‌ల‌దే హ‌వా. ముఖ్యంగా సౌత్ నుంచి వ‌స్తోన్న భామ‌లు స్థిర‌ప డిపోతన్నారు.

వాళ్ల పోటీని త‌ట్టుకోవ‌డం కోసం సీనియ‌ర్లు కూడా ఏమాత్రం త‌గ్గ‌లేదు. త‌మ‌దైన మార్క్ లాజిక్ తో కొడుతున్నారు. ఇందులో న‌య‌న‌తార ముందు వ‌రుస‌లో ఉంది. న‌య‌న్ పాలోయింగ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. కోలీవుడ్, టాలీవుడ్ లో అసాధార‌ణ‌మైన ఫాలోయింగ్ ఉంది. కానీ సినిమాలు లైన‌ప్ వ‌చ్చే స‌రికి వీక్ గానే ఉంది. అందుకు కార‌ణం సెల‌క్టివ్ గా ఉండ‌ట‌మే. ఈ క్ర‌మంలో కొత్త భామ‌ల తాకిడిని మాత్రం గ్లామ‌ర్ షోతోనే త‌ట్టుకుంది. ఆన్ స్క్రీన్ అయినా ఆఫ్ ది స్క్రీన్ అయినా న‌య‌న్ గ్లామ‌ర్ షోకి మ‌తి పోవాల్సిందే.

కెరీర్ ఆరంభం నుంచి ఇదే దూకుడుతో ఉంది. ఇప్ప‌టీకి అలాగే కొన‌సాగుతుంది. అందుకే న‌య‌న్ ఇమేజ్ ఎక్క‌డా చెక్కు చెద‌ర‌లేదు. స‌మంత ఈ మ‌ధ్య కాలంలో సినిమాలు చేయ‌లేదు. అయినా స‌మంత అంటే మ‌రుపు రాకుండా చేస్తుంది. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ ఫోటోల‌తో ద‌ర్శ‌న మిస్తుంది. జిమ్, యోగా ఫిట్ నెస్ పేరుతో వ‌దులుతోన్న వీడియోల‌తోనే అటెన్ష‌న్ డ్రా చేస్తుంది. ఈ విష‌యంలో కీర్తి సురేష్ కూడా అప్ డేట్ అయింది. గ్లామ‌ర్ పాత్ర‌లకు దూరంగా ఉండే కీర్తి కూడా ఆఫ్ ది స్క్రీన్ లో గ్లామ‌ర్ ఎలివేష‌న్ల‌తో అర‌ద‌గొడుతుంది.

అలాగ‌ని శ్రుతిమించిన హాట్ షోలు చేయ‌లేదు. ఆ విష‌యంలో బ్యాలెన్స్ గా ఉంటూనే యువ‌త అటెన్ష‌న్ డ్రా చేస్తోంది. మిల్కీబ్యూటీ త‌మ‌న్నా గురించైతే చెప్పాల్సిన ప‌నిలేదు. త‌మ‌న్నా గ్లామ‌ర్ తో నే ఇప్ప‌టికీ అవ‌కాశాలు అందుకుంటుంది. అది న‌టైనా? న‌ర్త‌కి అయినా? త‌మ‌న్నా ఎలివేష‌న్ ఉంటే చాలు. అంత‌కు మించి మ‌రే అవ‌స‌రం లేదంటూ మేక‌ర్స్. ఇలా న‌లుగురు భామ‌లు జూనియ‌ర్ భామ‌ల నుంచి పోటీని ఎదుర్కుని అవ‌కాశాలు అందుకుంటున్నారు.