Begin typing your search above and press return to search.

సీనియ‌ర్ భామ‌లంతా సాలిడ్ గా బ‌రిలోకి!

అలాగే లేడీ సూప‌ర్ స్టార్ రేసులో లేన‌ట్లే క‌నిపిస్తుంది. కానీ అమ్మ‌డి సినిమాలు రిలీజ్ అయ్యాయంటే విధ్వంస‌మే.

By:  Tupaki Desk   |   12 May 2025 10:30 PM
సీనియ‌ర్ భామ‌లంతా సాలిడ్ గా బ‌రిలోకి!
X

సీనియ‌ర్ భామ‌లంతా సాలిడ్ గా బ‌రిలోకి దిగుతున్నారా? మ‌ళ్లీ వాళ్లంద‌రి మ‌ధ్య పోటీ తధ్య‌మా? అంటే స‌న్నివేశం అలాగే క‌నిపిస్తుంది. వాళ్ల చిత్రాలు రిలీజ్ వెనకా..ముందు అయినా క్రేజీ ప్రాజెక్ట్ ల‌తో రావ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. అందాల త్రిష 'పొన్నియ‌న్ సెల్వ‌న్' తో బౌన్స్ బ్యాక్ అయిన నాటి నుంచి అమ్మ‌డు సీనియ‌ర్ హీరోలే టార్గెట్ గా ప‌నిచేస్తుంది. వ‌రుస చిత్రాల‌తో పుల్ బిజీగా ఉంది.

ఇటీవ‌లే 'గుడ్ బ్యాడ్ అగ్లీ'తో మ‌రో స‌క్సెస్ ఖాతాలో వేసుకుంది. త్వ‌ర‌లో 'థ‌గ్ లైఫ్‌'...'విశ్వంభ‌ర' చిత్రాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఈ రెండు సినిమాల‌పై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. రెండు ద‌శా బ్ధ‌లుగా చెక్కు చెద‌ర‌ని కెరీర్ ని కొన‌సాగిస్తుంది. హీరోయిన్ గా మాత్ర‌మే సినిమాలు చేస్తుంది. మ‌ధ్య‌లో లేడీ ఓరియేంటెడ్ కొన్ని ప్ర‌య‌త్నాలు చేసి ఫ‌లించ‌క‌పోయినా? టాప్ స్టార్ అనే లీగ్ మాత్రం కోల్పోలేదు.

అలాగే లేడీ సూప‌ర్ స్టార్ రేసులో లేన‌ట్లే క‌నిపిస్తుంది. కానీ అమ్మ‌డి సినిమాలు రిలీజ్ అయ్యాయంటే విధ్వంస‌మే. కోలీవుడ్ కే ప‌రిమిత‌మై సినిమాలు చేస్తున్నా? సౌత్ అంతా త‌న‌వైపు ఉంద‌ని ఎప్ప‌టిక‌ప్పుడు ప్రూవ్ చేస్తూనే ఉంది. చిరంజీవి త‌దుప‌రి సినిమా కోసం 18 కోట్లు తీసుకుంటుంద‌నే ప్ర‌చారం న‌య‌న్ రేంజ్ ని మ‌రింత పెచింది. ఇక స్వీటీ అనుష్క 'ఘాటీ'తో గ‌ట్టిగానే ప్లాన్ చేసింది.

గ‌త సినిమా 'మిస్ శెట్టి మిస్ట‌ర్ పొలిశెట్టి' అంచ‌నాలు అందుకోక‌పోవ‌డంతో'ఘాటీ'తో గొప్ప కంబ్యాక్ ఇస్తుం ద‌ని అంచ‌నాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాతో అనుష్క ఇమేజ్ మారుతుంద‌ని అభిమాన‌లు న‌మ్మ‌కంగా ఉన్నారు. మ‌రోవైపు వీళ్ల‌క‌న్నా జూనియ‌ర్ అయిన ర‌ష్మికా మంద‌న్నా 'గ‌ర్ల్ ప్రెండ్'..'రెయిన్ బో'లాంటి లేడీ ఓరియేంటెడ్ చిత్రాల‌తో స‌త్తా చాట‌డానికి రెడీ అవుతోంది. త‌క్కువ టైమ్ లోనే టాప్ స్టార్ గా ఎదిగిన భామ‌గా ర‌ష్మిక‌కు పాన్ ఇండియాలో మంచి గుర్తింపు ఉంది. ఈ భామ‌లంతా మ‌ళ్లీ ఒకే ఏడాది మ‌ళ్లీ మెరిపించ‌డానికి రెడీ అవుతున్నారు.