Begin typing your search above and press return to search.

స్ట్రాంగ్ ప్రొడక్షన్ లో శేఖర్ కమ్ముల మరో క్రేజీ కాంబో

ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ మొదలైంది. ఇదే ప్రొడక్షన్ లో నాగ చైతన్య, సాయిపల్లవి జోడీగా లవ్ స్టోరీ అనే మూవీని శేఖర్ కమ్ముల చివరిగా తెరకెక్కించి హిట్ అందుకున్నారు.

By:  Tupaki Desk   |   1 Feb 2024 5:22 AM GMT
స్ట్రాంగ్ ప్రొడక్షన్ లో శేఖర్ కమ్ముల మరో క్రేజీ కాంబో
X

టాలీవుడ్ క్లాస్ చిత్రాల దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న వ్యక్తి శేఖర్ కమ్ముల. చేసేది తక్కువ సినిమాలే అయిన తన మార్క్ ని మాత్రం బలంగా చూపించారు. ఈ కారణంగానే శేఖర్ కమ్ముల సినిమాలకి మంచి ఆదరణ ఉంటుంది. అయన సినిమాలంటే ఫ్యామిలీ మొత్తం చూడదగ్గ విధంగా ఉంటాయనే ఒక అభిప్రాయం ఆడియన్స్ లో ఉంది. అయితే ఇప్పుడు శేఖర్ కమ్ముల కాస్తా జోనర్ మార్చి కొత్త మూవీ చేస్తున్నాడు.


పాలిటిక్స్ ని కూడా క్లాస్ టచ్ తో లీడర్ సినిమాలో శేఖర్ కమ్ముల చూపించారు. ఇప్పుడు ధనుష్, నాగార్జున కాంబినేషన్ లో ధారావి టైటిల్ తో మాఫియా బ్యాక్ డ్రాప్ కథని సెట్స్ పైకి తీసుకొని వెళ్లారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెలుగు, తమిళ్ భాషలలో నిర్మిస్తోంది. ముంబైలో ధారావి అనే మురికివాడ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా కథ నడుస్తుందని తెలుస్తోంది.

ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ మొదలైంది. ఇదే ప్రొడక్షన్ లో నాగ చైతన్య, సాయిపల్లవి జోడీగా లవ్ స్టోరీ అనే మూవీని శేఖర్ కమ్ముల చివరిగా తెరకెక్కించి హిట్ అందుకున్నారు. అందులో ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి స్ట్రగుల్స్ ని చూపించారు. శేఖర్ కమ్ముల సినిమాలనటే, కథనం కంటే క్యారెక్టర్స్ ప్రయాణం కనిపిస్తుందని అందరూ చెప్పే మాట. ఇదిలా ఉంటే శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ లో శేఖర్ కమ్ములతో మూడో సినిమాని అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు.

ప్రొడక్షన్ 8గా ఈ సినిమా ఉంటుందని స్పష్టం చేశారు. అంటే ప్రస్తుతం చేస్తోన్న ధారావి అయిపోయిన వెంటనే మళ్ళీ శేఖర్ కమ్ములతోనే నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయనున్నట్లు ప్రకటించారు. సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ కూడా ఈ మూవీకి నిర్మాణ భాగస్వామిగా ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లొచ్చనే మాట వినిపిస్తోంది.

ప్రస్తుతం చేస్తోన్న ధారావి మూవీలో కింగ్ నాగార్జున ఒక గ్యాంగ్ స్టార్ గా కనిపిస్తాడంట. శేఖర్ కమ్ముల మొదటి స్టార్ స్టార్ క్యాస్టింగ్ తో ఈ చిత్రం చేస్తూ ఉండటంతో పాటు డిఫరెంట్ జోనర్ ట్రై చేస్తుండటంతో మూవీపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.