Begin typing your search above and press return to search.

సీక్వెల్ కోసం కమ్ముల చర్చలు...!

విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరు దక్కించుకున్న శేఖర్ కమ్ముల స్లో అండ్ స్టడీ అన్నట్లుగా సినిమాలు చేస్తున్నాడు.

By:  Tupaki Desk   |   1 Feb 2024 8:08 AM GMT
సీక్వెల్ కోసం కమ్ముల చర్చలు...!
X

విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరు దక్కించుకున్న శేఖర్ కమ్ముల స్లో అండ్ స్టడీ అన్నట్లుగా సినిమాలు చేస్తున్నాడు. మెల్లగా సినిమాలు చేస్తున్న శేఖర్ కమ్ముల ప్రస్తుతం ధనుష్ హీరోగా ఒక సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమాలో నాగార్జున కీలక పాత్రలో నటించబోతున్నాడు.

ధనుష్ సినిమాకు ఎక్కువ సమయం తీసుకున్న శేఖర్ కమ్ముల తదుపరి సినిమాకు ఏమాత్రం ఆలస్యం చేకూడదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇప్పటికే తన తదుపరి సినిమాను కన్ఫర్మ్‌ చేశాడు. ఏషియన్‌ సినిమాస్‌ తో కలిసి తాను చేయబోతున్న మూడో సినిమాకు అఫిషియల్‌ అనౌన్స్మెంట్‌ వచ్చింది.

ఇదే సమయంలో శేఖర్ కమ్ముల లీడర్‌ సీక్వెల్‌ కి సంబంధించిన చర్చలు జరుపుతున్నాడనే వార్తలు వస్తున్నాయి. విభిన్న పొలిటికల్‌ డ్రామాగా సాగిన లీడర్‌ సినిమా హిట్ గా నిలిచింది. రానా కు టాలీవుడ్ లో మంచి ఎంట్రీ మూవీగా కూడా లీడర్ నిలిచింది అనడంలో సందేహం లేదు.

అలాంటి లీడర్‌ కి సీక్వెల్‌ చేయాలని చాలా కాలంగా శేఖర్‌ కమ్ముల కోరుకుంటున్నాడనే వార్తలు వస్తున్నాయి. లీడర్ కథకు కొనసాగింపుగా లేదంటే ఆ పాత్ర లతో కొత్త కథ తో సీక్వెల్‌ గా లీడర్ 2 ని రూపొందించాలని శేఖర్‌ కమ్ముల భావిస్తున్నాడనే వార్తలు వచ్చాయి.

లీడర్‌ 2 కి సంబంధించిన స్క్రీప్ట్‌ వర్క్‌ జరుగుతుందని తెలుస్తోంది. ఈ సినిమాను రానా తోనే చేయాలా లేదంటే మరెవరైనా పెద్ద హీరో తో చేస్తే బాగుంటుందా అనే ఆలోచనలో కూడా కమ్ముల ఉన్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఆ మధ్య తమిళ స్టార్‌ హీరో సూర్య తో శేఖర్ కమ్ముల మూవీ ఉంటుందనే ప్రచారం జరిగింది. ఒక వేళ లీడర్‌ 2 ను సూర్య తో చేస్తే బాగుంటుందని కూడా కమ్ముల భావిస్తున్నాడేమో అనే చర్చ జరుగుతోంది. మొత్తానికి లీడర్‌ 2 కోసం శేఖర్ కమ్ముల చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం అందుతోంది.