Begin typing your search above and press return to search.

కమ్ముల ధారావి.. పెద్ద సాహసమే..!

ముంబై లో మురికివాడైన ధారావి టైటిల్ తో సినిమా అంటే సినిమా కథ అక్కడే జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. ధారావితో మాఫియాతో ముడి పెట్టి ఈ కథ రాసుకున్నాడట శేఖర్ కమ్ముల.

By:  Tupaki Desk   |   30 Jan 2024 11:57 AM GMT
కమ్ముల ధారావి.. పెద్ద సాహసమే..!
X

లవ్ స్టోరీ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల తన నెక్స్ట్ సినిమా ధనుష్ తో ప్రకటించిన విషయం తెలిసిందే. ఏసియన్ సునీల్ నారంగ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కింగ్ నాగార్జున కూడా భాగం అవుతున్నారు. ధనుష్, నాగార్జున ఈ కాంబో ఊహించుకుంటేనే సర్ ప్రైజింగ్ గా ఉండగా ఈ ఇద్దరితో శేఖర్ కమ్ముల సినిమా తీయడం కొత్తగా ఉంది. రీసెంట్ గా మొదలైన ఈ సినిమా గురించి ఎక్స్ క్లూజివ్ డీటైల్స్ బయటకు వచ్చాయి.

తన మొదటి సినిమా ఆనంద్ నుంచి సెన్సిబుల్ సినిమాలు చేస్తూ వస్తున్న శేఖర్ కమ్ముల కెరీర్ లో ఫస్ట్ టైం ఒక భారీ యాక్షన్ మూవీని చేస్తున్నాడు. ధనుష్, నాగార్జున ఈ కలయికతో ఒక మాఫియా బ్యాక్ డ్రాప్ సినిమా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాకు ధారావి అనే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నారట. త్వరలోనే ఈ టైటిల్ అనౌన్స్ మెంట్ ఉంటుందని తెలుస్తుంది.

ముంబై లో మురికివాడైన ధారావి టైటిల్ తో సినిమా అంటే సినిమా కథ అక్కడే జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. ధారావితో మాఫియాతో ముడి పెట్టి ఈ కథ రాసుకున్నాడట శేఖర్ కమ్ముల. సినిమాలో నాగార్జున మాఫియా డాన్ గా నటిస్తారని తెలుస్తుంది. ధనుష్ పాత్ర కూడా చాలా బలంగా ఉంటుందని తెలుస్తుంది.

శేఖర్ కమ్ముల ధారావి నిజంగానే పెద్ద సాహసమని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు తను తీసిన సినిమాల్లో ఎక్కడ కూడా హై యాక్షన్ ని చూపించని శేఖర్ కమ్ముల ఒకేసారి మాఫియా బ్యాక్ డ్రాప్ తో భారీ సినిమా చేయడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. అయితే దర్శకుడిగా తను కేవలం ఒకేరకమైన సినిమాలే చేయడం కాదు అన్నిటిని చేయాలనే ఉద్దేశంతో చాలా స్ట్రాంగ్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట శేఖర్ కమ్ముల. మరి ఇప్పటివరకు ఎమోషనల్ కంటెంట్ తో హృదయాలను కదిలించిన శేఖర్ కమ్ముల ఇక మీద రక్తపాతం చూపించడానికి రెడీ అయ్యాడని చెప్పొచ్చు.

ఈ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల కూడా తనలోని మరో యాంగిల్ చూపించడానికి సిద్ధమయ్యాడు. కోలీవుడ్ లో వరుస సూపర్ హిట్లతో దూసుకెళ్తున్న ధనుష్.. నా సామిరంగతో కెరీర్ లో క్రేజీ హిట్ అందుకున్న నాగార్జున తమ నెక్స్ట్ ప్రాజెక్ట్ గా ధారావి చేయడం సినిమాపై మరింత బజ్ పెంచేస్తుంది. మరి ఈ సినిమాతో ధనుష్, నాగార్జున ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.