Begin typing your search above and press return to search.

డౌట్‌ లేదు.. మళ్లీ ఆయనే 'లీడర్‌'!

టాలీవుడ్‌ లో ఎన్నో పొలిటికల్‌ డ్రామా సినిమాలు వచ్చాయి. కానీ అన్నింటిలోకి చాలా ప్రత్యేకమైన సినిమా 'లీడర్‌' అనడంలో సందేహం లేదు

By:  Tupaki Desk   |   19 April 2024 4:43 AM GMT
డౌట్‌ లేదు.. మళ్లీ ఆయనే లీడర్‌!
X

టాలీవుడ్‌ లో ఎన్నో పొలిటికల్‌ డ్రామా సినిమాలు వచ్చాయి. కానీ అన్నింటిలోకి చాలా ప్రత్యేకమైన సినిమా 'లీడర్‌' అనడంలో సందేహం లేదు. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించిన లీడర్‌ సినిమాతో దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి రానా ఎంట్రీ ఇచ్చాడు.

లీడర్ వచ్చి పుష్కర కాలం దాటింది. గత కొన్నాళ్లుగా సీక్వెల్‌ గురించిన చర్చలు జరుగుతున్నాయి. సోషల్‌ మీడియాలో లీడర్‌ సీక్వెల్‌ హీరో, హీరోయిర్, కథ అంటూ ఎన్నో పుకార్లు షికార్లు చేశాయి. లీడర్ 2 లో హీరో అంటూ చాలా మంది పేర్లు వినిపించాయి.

రానా కాకుండా మరో హీరో తో లీడర్ 2 ను శేఖర్‌ కమ్ముల తీసే యోచనలో ఉన్నాడని, పాన్ ఇండియా రేంజ్ లో లీడర్‌ 2 ఉండబోతుంది అనే ప్రచారం జోరుగా సాగింది. లీడర్ 2 విషయంలో ఉన్న పుకార్లు అన్నింటికి కూడా దర్శకుడు తాజా చిట్‌ చాట్‌ లో క్లారిటీ ఇచ్చేశాడు.

శేఖర్‌ కమ్ముల మాట్లాడుతూ.. చాలా మంది నాతో హ్యాపీడేస్ 2 సినిమాని చేయమని అన్నారు. కానీ ఆ సినిమా సీక్వెల్‌ చేయడానికి పెద్దగా స్కోప్ లేదు. కానీ లీడర్‌ 2 చెయ్యడానికి అవకాశం ఉంది. రానాతో లీడర్ 2 ను చేస్తాను అంటూ ఆయన పేర్కొన్నాడు.

దర్శకుడు కమ్ముల ప్రకటనతో రానా నే మళ్లీ లీడర్‌ అని, అందులో ఎలాంటి డౌట్‌ లేదు అన్నట్లుగా తేలిపోయింది. అయితే ఎప్పుడు ఈ సీక్వెల్‌ మూవీ పట్టాలు ఎక్కుతుంది, ఎప్పటికి ప్రేక్షకుల ముందుకు వస్తుంది అనేది మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.

ప్రస్తుతం శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా ఒక సినిమా రూపొందుతోంది. ఆ సినిమాలో నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నాడు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే. ధనుష్‌ సినిమా పూర్తి అయిన వెంటనే లీడర్ ను రెడీ చేస్తాడేమో చూడాలి.