ఆమె ఎవరో కూడా తెలియదు
టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
By: Tupaki Desk | 26 April 2025 7:30 PMటాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ కొరియోగ్రాఫర్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్న శేఖర్ మాస్టర్ ఖాతాలో ఎన్నో హిట్ సాంగ్స్ ఉన్నాయి. రీసెంట్ గా ఆయన కొరియోగ్రఫీ చేసిన సాంగ్స్ లోని స్టెప్స్ వల్ల సోషల్ మీడియాలో శేఖర్ మాస్టర్ విపరీతమైన విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.
గతేడాది, ఈ ఇయర్ శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన కొన్ని పాటల్లోని హుక్ స్టెప్పులపై ట్రోల్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ విమర్శలపై రీసెంట్ గా ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న శేఖర్ మాస్టర్ క్లారిటీ ఇచ్చాడు. తనకు, ఓ డ్యాన్స్ షో లో పాల్గొనే పార్టిసిపేట్ కు మధ్య సంబంధం ఉందని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై శేఖర్ మాస్టర్ రెస్పాండ్ అయి మాట్లాడారు.
ఓ మహిళా డ్యాన్సర్ తో తనకు మధ్య ఏదో ఉందని సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయని, ఆ కామెంట్స్ తనను ఎంతగానో బాధించాయని శేఖర్ మాస్టర్ తెలిపారు. నిజానిజాలు తెలుసుకోకుండా అలాంటి కామెంట్స్ ఎలా చేస్తారని ప్రశ్నించిన శేఖర్ మాస్టర్ ఆ విషయంలో క్లారిటీ ఇచ్చారు. తాను జడ్జిగా వ్యవహరిస్తున్న డ్యాన్స్ షో లో అందరికంటే ఆమే బాగా డ్యాన్స్ చేస్తుందనిపించి, ఆమెను మెచ్చుకున్నానని శేఖర్ మాస్టర్ తెలిపారు.
ఆమెను మెచ్చుకుని బాగా చేశావని చెప్పినదాన్ని అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారని, టాలెంట్ ఉన్న వాళ్లను ఎంకరేజ్ చేయడం కూడా తప్పా అని ఆయన ప్రశ్నించారు. తన వల్లే ఆమె విన్నర్ అయిందని, తమ గురించి ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేస్తూ, సోషల్ మీడియాలో తన పోస్టులకు ఆమె గురించి కామెంట్స్ పెడుతున్నారని, ఆ టైమ్ లో తానెంతో బాధ పడ్డానని, వాస్తవానికి ఆ షో తర్వాత ఆమె ఎవరో కూడా తనకు తెలియదని శేఖర్ మాస్టర్ వెల్లడించారు.
అదే పాడ్‌కాస్ట్ లో ఇండస్ట్రీలో తనకు ఓ ప్రముఖ కొరియోగ్రాఫర్ తో పడదని వస్తున్న వార్తలను కూడా శేఖర్ మాస్టర్ ఖండించారు. తనకు ఇండస్ట్రీలోని అందరితో మంచి సంబంధాలున్నాయని, అందరం కలిసినప్పుడు సరదాగా మాట్లాడుకుంటామని బయటవాళ్లు అవన్నీ తెలియక మా మధ్య గొడవలున్నట్టు మాట్లాడుకుంటారని చెప్పిన శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా ఉండటం కాస్త ఒత్తిడిగా ఉంటుందని, కానీ జడ్జ్ గా ఉండటం మాత్రం చాలా రిలాక్డ్స్ గా అనిపిస్తుందని తెలిపారు.