నాగ చైతన్యలో శేఖర్ కమ్ములా తెచ్చిన భారీ మార్పు!
టాలీవుడ్ లో అలాంటి డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా? అంటే అది శేఖర్ కమ్ములా. అతడో పెద్ద స్టార్ డైరెక్టర్. కానీ అతడి జీవితం ఎంతో సింపుల్ గా ఉంటుంది.
By: Tupaki Desk | 21 Jun 2025 12:46 PM ISTప్రపంచం దుఖమయం.. దుఖానికి కారణం కోరికలు. కోరికలు జయించడానికి అష్టాంగ మార్గాన్ని అనుసరించాలి అని గౌతమ్ బుద్దుడు ఎంతో బలంగా చెప్పాడు. జీవితంలో ఇలా ఉండగలిగేది ఎంత మంది. సరైన అవగాహన, సరైన ఆలోచన, సరైన మాట, సరైన క్రియ, సరైన జీవన విధానం, సరైన ప్రయత్నం, సరైన శ్రద్ధ , సరైన ఏకాగ్రత అన్నదే అష్టాంగ మార్గం. బాధలు తొలగిపోవాలన్నా...జ్ఞానదోయం కలగలన్నా అష్టాంగ మార్గాన్ని అనుసరించాలి.
టాలీవుడ్ లో అలాంటి డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా? అంటే అది శేఖర్ కమ్ములా. అతడో పెద్ద స్టార్ డైరెక్టర్. కానీ అతడి జీవితం ఎంతో సింపుల్ గా ఉంటుంది. నిరాడంబర జీవితాన్ని గడుపుతారు. డైరెక్టర్లు అంతా జూబ్లీహిల్స్ ..బంజారాహిల్స్ లో ఉంటే ఆయన మాత్రం పద్మారావ్ నగర్ లోనే ఉంటారు. ఆ బోర్డర్ దాటి బయటకు రారు. సెలబ్రిటీ కల్చర్ లోనూ పెద్దగా కనిపించరు. వీఐపీలు,వీవీఐపీలంటూ ఆయనకు తెలియదు.
ఆయన డిక్షనరీలో ఈ పదాలకు చోటు లేదు. శేఖర్ కమ్ములా విలువలకు దర్శక దిగ్గజం రాజమౌళి సైతం ఫిదా అయిన వారే. ఇటీవలే ఓ ఈవెంట్ లో కమ్ములా వ్యక్తిత్వాన్ని ఉద్దేశించి రాజమౌళి ఎంతో గొప్పగా మాట్లాడారు. తాజాగా యువసామ్రాట్ నాగచైతన్య కూడా కమ్ములా సింప్లిసిటీకి ఫిదా అయ్యాడని ఆయన మాటల్ని బట్టి అర్దమవుతుంది. 'ఏదో కావాలనుకుంటాం. అది ఉన్ననప్పుడు మరోటి కావాలనుకుంటాం. ఇంకా ఏదేదో చేయాలని...అవ్వాలని అనుకుంటాం. అదీ చేసిన తర్వాత ఇంకా ఏదో కావాలనుకుంటాం. ఖరీదైనవి కొనాలనుకుంటాం. ఆ ప్రపంచంలోనే ఉండాలనుకుంటాం.
కానీ మీతో 'లవ్ స్టోరీ' జర్నీ చేసినప్పుడు మీ అందర్నీ అక్కడ చూసినప్పుడు చాలా సంతోషంగా ఉన్నా రు. ఎలాంటి ఎక్స్ పక్టేషన్స్ లేవు. సింపుల్ గా బ్రతికేస్తున్నారు. వాళ్లెవ్వరూ ఏం కోరుకోవడం లేదు. ఇవన్నీ చూసి నేనెంతో రియలైజ్ అయ్యాను. మీ గ్యాంగ్ అందర్నీ చూసిన తర్వాత నా ఖర్చులు కూడా తగ్గాయి. బ్రాండెడ్ ధరించాలనే ఆలోచనే తొలగిపోయింది. ఇలా ఉండటం నిజంగా గొప్ప విషయం' అని అన్నాడు.
నాగ చైతన్య సెలబ్రిటీ కిడ్. చిన్నప్పటి నుంచి గోల్డ్ స్పూన్. కష్టాలన్నవే తెలియదు. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు. డౌన్ టూ ఎర్త్ ఉండటం అలవాటు చేసుకున్నాడు. సెల బ్రిటీ వరల్డ్ దాటొచ్చి చూస్తే బయట ప్రపంచం ఎలా ఉంటుందో? ఇండస్ట్రీలో కష్టపడి ఎదిగిన వారిని చూస్తే తెలుస్తుందన్నాడు. వీటన్నింటిని చైతన్య ఇంత క్లోజ్ గా గమనించడం అన్నది అతడి గొప్పతనం.
