నేచురల్ స్టార్ తో కమ్ములా క్లాసా? మాసా?
`కుబేర` సక్సెస్ తో శేఖర్ కమ్ములా పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెట్టారు. ఇప్పటికే ఈ చిత్రం 100 కోట్ల క్లబ్ లో చేరింది.
By: Tupaki Desk | 27 Jun 2025 3:00 PM IST`కుబేర` సక్సెస్ తో శేఖర్ కమ్ములా పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెట్టారు. ఇప్పటికే ఈ చిత్రం 100 కోట్ల క్లబ్ లో చేరింది. `కుబేర`తో కమ్ములా వంద కోట్ల క్లబ్లో అడుగు పెట్టారు. ఇంత వరకూ ఈయన బాక్సా ఫీస్ వద్ద సెంచరీ కొట్టలేదు. `ఫిదా` సినిమా 91 కోట్ల వసూళ్ల వద్ద ఆగిపోవడంతో ఆ ఫీట్ సాధ్యపడలేదు. అటుపై చేసిన చిత్రాలు ఆ రేంజ్ సక్సెస్ ని అందుకోలేదు. అయితే పాన్ ఇండియాలో `కుబేర`కు ఈ రేంజ్ సక్సెస్ సరిపోదు.
పాన్ ఇండియా రిలీజ్ అంటే 500 కోట్ల క్లబ్ లో పడితేనే సిసలైన పాన్ ఇండియా సక్సస్ దక్కినట్లు. కానీ `కుబేర` తో అది సాధ్యమవ్వడం కష్టం. ఈ నేపథ్యంలో కమ్ములా తదుపరి చిత్రంతో ఆ రేంజ్ ని టచ్ చేసేలా ప్రణాళికను ఇప్పటి నుంచే సిద్దం చేస్తున్నాడు. ఆయన తదుపరి సినిమా కూడా పాన్ ఇండి యాలోనే ఉంటుందని సమాచారం. అందుకే నేచురల్ స్టార్ నానిని తన హీరోగా ఎంపిక చేసుకుం టున్నట్లు వార్త లొస్తున్నాయి.
నాని ఇమేజ్ కు తగ్గ స్టోరీ సిద్దం చేయాలని కమ్ములా రెడీ అవుతున్నాడుట. అయితే ఇప్పటికే తన వద్ద స్టోరీ లైన్ ఉందని దాన్ని డెవలెప్ చేస్తే సరిపోతుందని కమ్ములా భావిస్తున్నాడుట. అందుకే ఏడాది సమ యం పడుతుందని వినిపిస్తుంది. శేఖర్ కమ్ములా స్టోరీ కోసం ఎక్కువ సమయం తీసుకుంటారు. అందుకే ఆయన 25 ఏళ్ల కెరీర్ లో కేవలం పది సినిమాలే చేయగలిగారు. కానీ అందులో చాలా సినిమాలు విజయా లు సాధించినవే.
ఆయన నుంచి అట్టర్ ప్లాప్ సినిమా అంటూ ఇంతవరకూ లేదు. తదుపరి నానితో సినిమా అంటే భారీ ఎత్తున ఉంటుంది. కమ్ములా అంటే క్లాసిక్ చిత్రాలకు బ్రాండ్. నాని పై కూడా మాస్ ఇమేజ్ కంటే క్లాస్ ఇమేజ్ ఎక్కువగా ఉంది. కెరీర్ ఆరంభంలో క్లాసిక్ చిత్రాలతోనే మెప్పించాడు. మరి అలాంటి స్టార్ తో కమ్ములా క్లాస్ చిత్రం తీస్తాడా? మాస్ చిత్రం తీస్తాడా? అన్నది చూడాలి.
