కమ్ములకు నాని దొరకడం కష్టమే..?
ఇక ఆ సినిమా తర్వాత సుజిత్ డైరెక్షన్ లో సినిమా లైన్ లో ఉంది. పవర్ స్టార్ తో ఓజీ తర్వాత సుజిత్ నానితో ఒక యాక్షన్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా ప్లాన్ చేశాడు.
By: Tupaki Desk | 2 July 2025 10:19 PM ISTధనుష్ కుబేర సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు డైరెక్టర్ శేఖర్ కమ్ముల. లవ్ స్టోరీ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న శేఖర్ కమ్ముల ధనుష్ తో చేయాల్సిన సినిమా లేట్ అయినా కూడా తన పంథా మార్చి ఒక మంచి కథతో కుబేర తీసి సక్సెస్ అందుకున్నారు. కుబేర సినిమాలో నాగార్జున కూడా తన పాత్రతో ప్రేక్షకులను మెప్పించారు. హీరోగా చేస్తున్న నాగార్జున ఇలాంటి రోల్ చేయడం ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చినా.. ఎంచుకున్న పాత్రలో ఆయన ది బెస్ట్ ఇచ్చారు. అఫ్కోర్స్ నాగార్జున నటన గురించి అందరికీ తెలిసిందే కద.
కుబేర సక్సెస్ తో సూపర్ హ్యాపీగా ఉన్న డైరెక్టర్ శేఖర్ కమ్ముల నెక్స్ట్ సినిమా కోసం పని మొదలు పెట్టడానికి టైం తీసుకోనున్నాడని తెలుస్తుంది. శేఖర్ కమ్ముల హీరోల లిస్ట్ లో న్యాచురల్ స్టార్ నాని ఉన్నాడని వార్తలొచ్చాయి. ఐతే శేఖర్ కుబేర తర్వాత నానితో సినిమా చేయాలంటే మాత్రం ఏడాదిన్నర దాకా వెయిట్ చేయక తప్పదు. నాని ప్రస్తుతం ప్యారడైజ్ సినిమా చేస్తున్నాడు. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా 2026 మార్చి రిలీజ్ ఫిక్స్ చేశారు.
ఇక ఆ సినిమా తర్వాత సుజిత్ డైరెక్షన్ లో సినిమా లైన్ లో ఉంది. పవర్ స్టార్ తో ఓజీ తర్వాత సుజిత్ నానితో ఒక యాక్షన్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా ప్లాన్ చేశాడు. ఆ సినిమాను కూడా డివివి దానయ్య నిర్మిస్తారని తెలుస్తుంది. నానితో అంటే సరిపోడా శనివారం టైం లోనే డివివి బ్యానర్ రెండు సినిమాల అగ్రిమెంట్ చేసుకున్నారని టాక్. సో నాని ప్యారడైజ్ తర్వాత సుజిత్ సినిమా చేస్తాడు.
ఆ సినిమా పూర్తి అయ్యే టైం కు శేఖర్ కమ్ముల సినిమా పట్టాలెక్కే ఛాన్స్ ఉంటుంది. సో నాని దొరకాలంటే అటు ఇటుగా శేఖర్ కమ్ముల రెండేళ్లు వెయిట్ చేయాల్సిందే. మరి నాని కోసం కమ్ముల శేఖర్ వెయిట్ చేస్తాడా లేదా మరో సినిమాకు వెళ్తాడా అన్నది తెలియాల్సి ఉంది. కుబేర హిట్టు పడ్డది కాబట్టి శేఖర్ కమ్ముల తో సినిమా కోసం స్టార్స్ కూడా రెడీ అనేస్తారు. పాన్ ఇండియా స్టార్స్ అంతా ఆల్రెడీ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు కాబట్టి మిగతా హీరోలు ఎవరైనా సినిమా చేస్తారేమో చూడాలి.
శేఖర్ కమ్ముల కుబేర తర్వాత తన స్టోరీ టెల్లింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ కి వెళ్తాడని చెప్పొచ్చు. సో ఇక మీదట ఆయన సినిమాలు ఇదివరకు కన్నా చాలా పెద్దగా ఉంటాయని ఫిక్స్ అవ్వొచ్చు. మరి నాని తో శేఖర్ కమ్ముల ఉంటుందా ఉంటే ఎప్పుడు ఉంటుంది. ఆ సినిమా ఎలాంటి కథతో వస్తుంది అన్నది ఆడియన్స్ లో ఆసక్తి పెంచుతుంది. నాని మాత్రం లైన్ లో ఉన్న రెండు సినిమాలు పూర్తి చేశాక మాత్రమే మరో సినిమా అనేస్తున్నాడు.
