Begin typing your search above and press return to search.

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన శేఖ‌ర్ క‌మ్ములా!

ఇండ‌స్ట్రీలో శేఖ‌ర్ క‌మ్ములా స‌క్సెస్ ల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ద‌ర్శ‌కుడిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ఉంది.

By:  Tupaki Desk   |   30 Jun 2025 5:45 PM IST
సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన శేఖ‌ర్ క‌మ్ములా!
X

ఇండ‌స్ట్రీలో శేఖ‌ర్ క‌మ్ములా స‌క్సెస్ ల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ద‌ర్శ‌కుడిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ఉంది. 25 ఏళ్ల కెరీర్ లో ప‌ది సినిమాలే చేసినా? వాటిలో చాలా సినిమాలు విజ‌యం సాధించిన‌వే. ద‌ర్శ‌కుడిగా ఆయ‌న స్థాయి అంత‌కంత‌కు పెరుగుతూనే ఉంది. అత‌డితో సినిమాలు చేయ‌డానికి స్టార్ హీరోలే క్యూలో ఉన్నారు. ఇటీవ‌లే `కుబేర‌`తో మ‌రో స‌క్సెస్ ఖాతాలో వేసుకున్న‌సంగ‌తి తెలిసిందే.

చిరంజీవి, నాగార్జున లాంటి స్టార్లు ఆయ‌న‌తో ప‌ని చేయ‌డానికి సిద్దంగా ఉన్నారు. ఇక యంగ్ హీరోలైతే ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా శేఖ‌ర్ కమ్ములా నేటి త‌రం ప్రేక్ష‌కుల‌ను ఉద్దేశించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. సినిమా విజయం కంటే, నేటి తరం ప్రేక్షకులకు నచ్చేలా కథను సిద్ధం చేయడమే స‌వాల్ గా మారింద‌న్నారు. ఆ పరీక్షలో నెగ్గడమే అసలైన విజయంగా భావిస్తున్నట్లు వ్యాఖ్యానించారు.

`గతంతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సోషల్ మీడియా పుణ్యమా అని ఒకప్పుడు 20 ఏళ్లకు తెలిసే విషయాలు ఇప్పుడు పదేళ్లకే తెలిసిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటి తరానికి నచ్చే కథను నేను రాయగలనా? అనే సందేహం నాలో కలిగింది. `కుబేర’ విషయంలో ఆ పరీక్షను దాటడ మే నాకు పెద్ద విజయంగా అనిపించిందన్నారు.

కుబేర సాధార‌ణ ప్రేమ క‌థ‌కాదు. ప్రేమ పాట‌లుండ‌వు. ఒక స్టార్ హీరో- మరోవైపు ఓ బిచ్చగాడి జీవితం వంటి విభిన్న అంశాల‌తో క‌థ‌ను న‌డ‌పాలి. ఈ క్రమంలో ఎన్నో పరీక్షలు దాటాల్సి వ‌చ్చింద‌న్నారు. రిలీజ్ కు ముందు త‌న‌తో పాటు త‌న టీమ్ ఎంతో ఒత్తిడికి గురైంద‌న్నారు. అలాగే కుబేర చిత్రాన్ని చెన్నైలో ధ‌నుష్ తోక‌లిసి చూడ‌టం గొప్ప అనుభూతినిచ్చింద‌న్నారు.