శేఖర్ కమ్ములా అందుకే అంత బక్కగా!
టాలీవుడ్ లో శేఖర్ కమ్ములా ప్రస్థానం గురించి చెప్పాల్సిన పనిలేదు. 'ఆనంద్' తో మొదలైన ఆయన సినీ ప్రయాణం లవ్ స్టోరీ వరకూ దిగ్విజయంగా కొనసాగింది.
By: Tupaki Desk | 16 Jun 2025 10:15 AM ISTటాలీవుడ్ లో శేఖర్ కమ్ములా ప్రస్థానం గురించి చెప్పాల్సిన పనిలేదు. 'ఆనంద్' తో మొదలైన ఆయన సినీ ప్రయాణం లవ్ స్టోరీ వరకూ దిగ్విజయంగా కొనసాగింది. దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక శైలి ఉందని తన సినిమాలతో రుజువు చేసాడు. ఆయన ఏ సినిమా తీసినా? అందులో సెన్సిబిలిటీస్ హైలైట్ అవుతుంటాయి. అప్ కమింగ్ చిత్రం 'కుబేర' లో కూడా తనమార్క్ సెన్సిబిలిటీ కనిపిస్తుంది. గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో చేస్తోన్న చిత్రమిది.
ఇంత వరకూ ఈ జానర్ ను కమ్ములా టచ్ చేయలేదు. ఆయన టచ్ చేసాడంటే? ఏదో ప్రత్యేకత ఉంటుం దనే అంచనాలు బలంగా ఉన్నాయి. రెగ్యులర్ గ్యాంగ్ స్టర్ చిత్రాలకు భిన్నంగా కుబేర ఉంటుందని అంతా భావిస్తున్నారు. ఆ సంగతి పక్కనబెడితే శేఖర్ కమ్ములా బక్క పలచని శరీరంతోనే కనిపిస్తారు. కెరీర్ ఆరంభం నుంచి ఇప్పటి వరకూ అదే పర్సనాల్టీ మెయింటెన్ చేస్తున్నారు.
సినిమా డైరెక్టర్ అయినప్పటి నుంచే కాదు అంతకు ముందు నుంచి కూడా ఆయన అంతే బక్కగా ఉన్నట్లు కమ్ములా ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసారు. తాను అసలు పుడీ కాదట. అది కావాలి..ఇది కావాలని అడిగి టైపు అంతకన్నా కాదుట. టైమ్ అయింది తినాలి అన్న ఆలోచన కూడా ఉండదట. ఇంట్లో ఉంటే ఇదే తీరుతో ఉంటారట. ఇక సినిమా సెట్ లో అయితే పని తప్ప మరో ధ్యాష ఉండదన్నారు.
అందులోనూ తిండి ఆలోచనైతే అస్సలు రాదుట. పనిలో పడితే తినడం కూడా మర్చిపోతానన్నారు. అందుకే తాను ఏ సినిమా షూటింగ్ చేసినా అది పూర్తయ్యే సరికి మరింత బక్కగా మారిపోతానన్నారు. ఇలా సన్నగా ఉండటం తనకెంతో ఆరోగ్యకంగా ఉందన్నారు.
