పెద్ద హీరోలు.. ఇకనైనా కమ్ములను నమ్ముతారా?
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ డిఫరెంట్ పాత్‌లో తనదైన మార్క్ వేసుకున్న దర్శకుల్లో శేఖర్ కమ్ముల పేరు ముందు వరుసలో ఉంటుంది. మ్యూజిక్, ఎమోషన్, డీప్ కాన్సెప్ట్ ఉన్న కథలు తెరకెక్కించడంలో ఆయనకు ప్రత్యేకమైన శైలి ఉంది.
By: Tupaki Desk | 23 Jun 2025 10:58 AM ISTతెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ డిఫరెంట్ పాత్‌లో తనదైన మార్క్ వేసుకున్న దర్శకుల్లో శేఖర్ కమ్ముల పేరు ముందు వరుసలో ఉంటుంది. మ్యూజిక్, ఎమోషన్, డీప్ కాన్సెప్ట్ ఉన్న కథలు తెరకెక్కించడంలో ఆయనకు ప్రత్యేకమైన శైలి ఉంది. కానీ ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు చిన్న మిడ్రేంజ్ హీరోలతోనే జరిగాయి. ఆనంద్, గోదావరి, లీడర్, ఫిదా, లవ్ స్టోరీ లాంటి సినిమాలు.. ఎలాంటి విజయాలను అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
గోదావరి సినిమా టైమ్‌లోనే కమ్ముల గోపిచంద్‌ను కథ చెప్పారని, కానీ ఓకే కాలేదని అప్పట్లో టాక్ వచ్చింది. అలాగే ‘ఫిదా’ సమయంలో మహేష్ బాబును కూడా కథ వినిపించాడట కానీ అప్పట్లో ఆ కథ మహేష్‌కు కథ నచ్చినా తన స్థాయికి తగ్గట్టుగా అనిపించలేదని లైట్ తీసుకున్నాడు. ఈ విధంగా శేఖర్ కమ్ముల సింపుల్ స్టోరీలతో స్టార్ హీరోల మనసును గెలవలేకపోయాడు. దీంతో అతను తన కథల్లోకి నేచురల్ స్టార్‌లు, కొత్త టాలెంట్‌ను తీసుకుంటూ వచ్చాడు.
కానీ కమ్ముల తాను పెద్ద హీరోలతో కూడా ఆడియెన్స్ కు నచ్చేలా సినిమా చేయగలనని చాలాసార్లు చెప్పాడు. రీసెంట్ గా తానేంటో నిరూపించారు. నాగార్జున, ధనుష్ లాంటి హీరోలతో కలిసి తెరకెక్కించిన కుబేర సినిమాతో శేఖర్ కమ్ముల తన రేంజ్ ఏంటో చూపించాడు. ఈ సినిమా ఆయనకు ఏ స్థాయి రెస్పాన్స్ తెచ్చిందో చూస్తే, ఇకనైనా స్టార్ హీరోలు ఆయనను ఫ్రీగా కన్సిడర్ చేయాల్సిన టైమ్ వచ్చేసిందనే చెప్పాలి.
విడుదలైన రోజునే సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్, కంటెంట్ పరంగా అందిన ప్రశంసలు చూస్తుంటే.. శేఖర్ కమ్ముల మార్క్‌ను ప్రేక్షకులు ఎంతగానో ఆశీర్వదిస్తున్నారన్నది స్పష్టమవుతోంది. ధనుష్ కెరీర్ బెస్ట్ రోల్ చేయగా.. ఈ సినిమా ద్వారా నాగార్జునకు మళ్లీ ఓ మంచి పాత్ర దొరికినట్లయ్యింది. CBI ఆఫీసర్ పాత్రలోని డెఫ్త్, ఆయన లుక్, ప్రెజెన్స్ అన్నీ సినిమాకు అసెట్‌గా నిలిచాయి.
ఈ పాజిటివ్ వేవ్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలోనే వచ్చింది. కమర్షియల్ యాంగిల్‌కు అతడి కథన శైలి ఫిట్ కాదు అనే అభిప్రాయాన్ని ఇప్పుడు కుబేర తుడిచేసేసింది. ఇప్పుడు ప్రశ్న ఒకటే.. ఇప్పటివరకు "కమ్ముల స్కెచ్ పెద్ద హీరోలకి సరిపోదు" అనేవారు ఇకనైనా ఆలోచించగలరా? కమర్షియల్ మెయిన్‌స్ట్రీమ్‌లో శేఖర్ కమ్ముల కూడా తనదైన స్థాయిలో నిలబడగలడని కుబేర చూపించింది. ఇకపై మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరోలు ఓపెన్‌గా ఈ డైరెక్టర్‌ను కన్సిడర్ చేస్తారా అన్నదే ఆసక్తికరమైన అంశం.
