శేఖర్ కమ్ముల కూడా సందీప్‌రెడ్డిని ఫాలో అవుతున్నాడే!
సినిమా రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో మరో రెండు, మూడు రోజుల్లో ట్రైలర్ రిలీజ్ చేయాలని టీమ్ ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
By: Tupaki Desk | 25 May 2025 1:00 AM ISTటాలీవుడ్‌లో కొత్త సంప్రదాయానికి తెర లేపిన దర్శకుడు సందీప్‌రెడ్డి వంగ. ఆయన విజయ్ దేవరకొండతో తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ `అర్జున్ రెడ్డి`. ఈ సినిమా నిడివి పరంగానూ అప్పట్లో సంచలనం సృష్టించింది. కొత్త హీరో, రన్ టైమ్ మూడు గంటల 6 నిమిషాలు ఈ రోజుల్లో ఎవరు చూస్తారు అని అంతా కామెంట్‌లు చేశారు. నిడివి తగ్గించమని సందీప్‌ని ఫోర్స్ చేశారు. కానీ కంటెంట్‌పై ఉన్న నమ్మకంతో సందీప్ అందుకు అంగీకరించకుండా 3 గంటల 6 నిమిషాల రన్ టైమ్‌తో ఈ మూవీని విడుదల చేయడం అది బ్లాక్ బస్టర్ కావడం తెలిసిందే.
ఈ సినిమా తరువాత రన్ టైమ్ గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. చాలా వరకు డైరెక్టర్లు ఈ విషయంలో సందీప్‌రెడ్ది వంగనే ఫాలో అవుతున్నారు. సుకుమార్ కూడా `పుష్ప 2` కోసం సందీప్‌నే ఫాలో అయ్యాడు. ఈ సినిమా రన్ టైమ్ 3 గంటల 21 నిమిషాలు. ఆ తరువాత కూడా చాలా వరకు డైరెక్టర్లు రన్ టైమ్‌ని ఫాలో అవుతూ వస్తున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో సెన్సిబుల్ మూవీస్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల చేరారు.
ఆయన తెరకెక్కిస్తున్న తాజా మూవీ `కుబేర`. ధనుష్ హీరోగా కింగ్ నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్ప ఈ మూవీలో హీరో ధనుష్ బిచ్చగాడి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఓ బిచ్చగాడికి, ఓ కోటీశ్వరుడికి మధ్య సాగే సమరం నేపథ్యంలో ఎమోషనల్ డ్రామాగా ఈ మూవీని దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమాని జూన్ 20న భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయబోతున్నారు.
సినిమా రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో మరో రెండు, మూడు రోజుల్లో ట్రైలర్ రిలీజ్ చేయాలని టీమ్ ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ మూవీ రన్ టైమ్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 50 నిమిషాలు. అంటే దాదాపుగా మూడు గంటలన్నమాట. శేఖర్ కమ్ముల మూడు గంటల నిడితో చేసిన తొలి సినిమా కావడం గమనార్హం. అయితే రన్ టైమ్ విషయంలో టీమ్ టెన్షన్‌గా ఉందని, హిట్ అంటే జనాలు చూస్తారు. ఓ మోస్తారుగా ఉందంటే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని `కుబేర`టీమ్ టెన్షన్ పడుతోందని ఇన్ సైడ్ టాక్.
