శేఖర్ కమ్ముల నెక్స్ట్ ఫోకస్ అదేనా?
ఇప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన కుబేర మూవీతో శేఖర్ కమ్ముల రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 30 Jun 2025 8:00 PM ISTటాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ములకు ఉన్న క్రేజే వేరు. స్పెషల్ ఫ్యాన్ బేస్ ఆయన సొంతం. ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ను, ఆడియన్స్ మదిలో ఎప్పటికీ ఎన్నో గుర్తుండిపోయే చిత్రాలను ఇప్పటికే ప్రేక్షకుల అందించారు. ఆనంద్, హ్యాపీ డేస్, లవ్ స్టోరీ సహా అనేక చిత్రాలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్. ఆయా సినిమాలను ఎప్పటికప్పుడు మూవీ లవర్స్ చూస్తూనే ఉంటారు.
ఇప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన కుబేర మూవీతో శేఖర్ కమ్ముల రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అత్యంత ధనవంతుడికి, అతి పేదవాడికి మధ్య సంఘర్షణను సినిమాగా తీసి వరల్డ్ వైడ్ గా గత శుక్రవారం థియేటర్స్ లో రిలీజ్ చేశారు. మూవీ విడుదలైన తక్కువ టైమ్ లోనే రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరారు.
అయితే అందులో ఎక్కువ భాగం తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేసినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ లో ఫస్ట్ వారం భారీ కలెక్షన్స్ సాధించిన కుబేర.. రెండో వీకెండ్ లో మోస్తరు వసూళ్లు సాధించింది. దీంతో తెలుగులో మంచి హిట్ గా నిలిచేలా కనిపిస్తోంది. కానీ ఓవరాల్ గా మేకర్స్ పెట్టిన బడ్జెట్ వస్తుందా రాదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఎందుకంటే తమిళనాడులో కుబేర మూవీ అనుకున్నంత స్థాయిలో రాణించడం లేదు. సినిమాలో లీడ్ రోల్ పోషించిన ధనుష్ అక్కడ హీరో అయినప్పటికీ.. రూ.20 కోట్లు కూడా రాబట్టలేదని తెలుస్తోంది. ఓవర్సీస్ లో మాత్రం మంచి వసూళ్లను రాబడుతోంది కుబేర. 2.2 మిలియన్ డాలర్లను ఇప్పటి వరకు వసూలు చేసినట్లు సమాచారం.
ఏదేమైనా శేఖర్ కమ్ములకు ప్రధాన బలం తెలుగు ఆడియన్సేనని ఎప్పటి నుంచో తెలిసిందే. ఇప్పుడు మరోసారి కుబేర మూవీ అదే ప్రూవ్ చేసింది. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయినా.. తెలుగు మార్కెట్టే మెయిన్ గా నిలిచింది. దీంతో ఇప్పుడు శేఖర్ కమ్ముల.. తెలుగు మార్కెట్ పై స్పెషల్ ఫోకస్ చేయనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది.
టాలీవుడ్ స్టార్ హీరోలతో సినిమాలు తీసే విషయంపై దృష్టి పెట్టనున్నారని సమాచారం. పాన్ ఇండియా ప్రాజెక్ట్ కు ఆయన కథ చెప్పే శైలి సెట్ అవ్వదని కొందరు అభిప్రాయపడుతున్నారు. కానీ మరికొందరు మాత్రం.. తమిళనాడులో కుబేర క్లిక్ అవ్వక పోయినంత మాత్రాన.. సెట్ అవ్వదని చెప్పలేమని అంటున్నారు. మరి శేఖర్ కమ్ముల నెక్స్ట్ ఎవరితో వర్క్ చేయనున్నారో.. ఎలాంటి సినిమా తీయనున్నారో వేచి చూడాలి.
