శేఖర్ కమ్ముల కోరిక నెరవేరుతుందా?
శేఖర్ కమ్ముల తెరకెక్కించిన పాన్ ఇండియా మూవీ `కుబేర`. ధనుష్ హీరోగా నటించిన ఈ సినిమాలోని కీలక పాత్రలో కింగ్ నాగార్జున నటించారు.
By: Tupaki Desk | 24 Jun 2025 3:00 AM ISTశేఖర్ కమ్ముల తెరకెక్కించిన పాన్ ఇండియా మూవీ `కుబేర`. ధనుష్ హీరోగా నటించిన ఈ సినిమాలోని కీలక పాత్రలో కింగ్ నాగార్జున నటించారు. ఇందవులో ధనుష్‌కు జోడీగా రష్మిక మందన్న తొలి సారి నటించింది. ఓ బిచ్చగాడికి అపర కోటీశ్వరుడికీ మధ్య సాగే విభిన్నమైన కథగా ఈ మూవీని దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించారు. రిలీజ్‌కు ముందు నుంచే అంచాల్ని పెంచేసిన ఈ సినిమాలో హీరో ధనుష్ బిచ్చగాడిగా కనిపించిన విషయం తెలిసిందే. కీలక పాత్రలో మాజీ సీబీఐ ఆఫీసర్‌గా నాగ్ నటించిన ఈ మూవీ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది.
తొలి షో నుంచే పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుని విజయవంతంగా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు శేఖర్ కమ్మల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట ఆసక్తికరంగా మారాయి. ఇప్పటి వరకు ఎమోషనల్ డ్రామాలని తెరకెక్కించి విజయాల్ని అందుకున్న శేఖర్ కమ్ముల `కుబేర` కోసం కూడా అదే ఎమోషన్ని ప్రధాన కోర్ పాయింట్‌గా తీసుకుని ఈ సినిమాని చేశారు. అదే ఇప్పుడు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటూ `కుబేర`ని బాక్సాఫీస్ వద్ద హిట్ సినిమాగా నిలబెట్టింది.
ఈ సందర్బంగా ఓ మీడియాతో ముచ్చటిస్తూ దర్శకుడు శేఖర్ కమ్ముల తనకున్న కొన్ని కోరికల్ని బయటపెట్టారు. ఏ హీరోతో ఎలాంటి సినిమాలని చేయాలనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు శేఖర్ కమ్ముల ఆసక్తికరంగా స్పందించారు. ఎన్టీఆర్‌తో సినిమా చేయాల్సి వస్తే తనతో రెబల్ ఉండే మూవీ చేస్తానన్నారు. అంతే కాకుండా యంగ్ హీరోలు సిద్దూ జొన్నలగడ్డ, అడివి శేష్‌లతో ఇంటెన్స్ ఉన్న మూవీస్ చేస్తానని చెప్పారు. ఇక రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో మాంచి లవ్ స్టోరీని ప్లాన్ చేస్తారట.
ఇక హీరోయిన్స్ శ్రీలీలతో అయినా డ్యాన్స్ ప్రధానంగా సాగే సినిమా చేస్తానని, కీర్తిసురేష్‌తో అయితే ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ తీస్తానని తెలిపారు. ఇదే సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఎలాంటి సినిమా చేస్తారని అడిగితే మాత్రం తనతో ఓ రొమాంటిక్ ఫ్లిల్మ్ చేస్తానని చెప్పడం గమనార్హం. గతంలో మహేష్‌తో శేఖర్ కమ్ముల `గోదావరి` మూవీని ఏయాలనుకున్నారు. కానీ కుదరకపోవడంతో దాన్ని సుమంత్ హీరోగా తీసి హిట్టు కొట్టారు. జక్కన్నతో సినిమా చేస్తున్న మహేష్ ..శేఖర్ కమ్ముల అన్నట్టు తనతో రొమాంటిక్ లవ్‌స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇస్దాడా? అంటే డౌటే అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంటే శేఖర కమ్ముల కల నెరవేరే అవకాశం లేదని ఇన్ సైడ్ టాక్.
