కథలో కోత వేయాలనుకున్న ఏకైక డైరెక్టర్!
సినిమా సక్సెస్ కి స్టోరీ అన్నది కీలకం. ఆ సక్సెస్ ను డిసైడ్ చేసేది తెరపై ఆవిష్కరించిన విధానం.
By: Tupaki Desk | 22 Jun 2025 1:01 PM ISTసినిమా సక్సెస్ కి స్టోరీ అన్నది కీలకం. ఆ సక్సెస్ ను డిసైడ్ చేసేది తెరపై ఆవిష్కరించిన విధానం. ఈ రెండింటి విషయంలో డైరెక్టర్లు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. ఏ విషయంలోనూ రాజీ పడరు. స్టోరీ స్పాన్ పెరిగితే అందుకు తగ్గట్టు సరంజామా సిద్దం చేసుకుంటారు. సెట్ కి వెళ్లిన తర్వాత బడ్జెట్ పెరిగినా చేసేదేం లేదు. నిర్మాత దర్శకుడు చెప్పినట్లు చేయాల్సిందే. బడ్జెట్ ఎంతైనా ఖర్చు చేయాల్సిందే. ఎందుకంటే అక్కడ రాజీ పడే పరిస్థితి ఉండదు.
ఆ విషయంలో నిర్మాతతో రాజీకి ఏ డైరెక్టర్ అంగీకరించడు. అవసరమైతే ప్రాజెక్ట్ వదులుకుంటారు తప్ప రాజీ అనే మాట ఉండదు. అలా రద్దయిన ప్రాజెక్ట్ లు ఎన్నో ఉన్నాయి. కానీ శేఖర్ కమ్ములా మాత్రం అలాం టి డైరెక్టర్లు అందరికీ భిన్నం. పాన్ ఇండియాలో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన కుబేర పెద్ద సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా సెట్స్ లో ఉండగా శేఖర్ కమ్ములా అనుకున్న బడ్జెట్ మించిపోతుందిట.
పేపర్ పై తాను వేసుకున్న బడ్జెట్ ఒకటైతే సెట్ కి వెళ్లిన తర్వాత స్టోరీ అంతకంతకు బడ్జెట్ డిమాండ్ చేసిందిట. దీంతో కమ్ములా అప్పుడే ఏ డైరెక్టర్ తీసుకోని నిర్ణయం తీసుకున్నాడు. అదనంగా బడ్జెట్ పెండచం కంటే కథలోనే కోత వేస్తే ఆ బడ్జెట్ తగ్గిపోతుంది? కదా? అన్న ఐడియాతో కథలో కోత మొదలు పెట్టారుట. ఈ విషయంలో తన టీమ్ ఎంతో అండగా నిలబడ టంతోనే ఇది సాధ్యమైందన్నారు.
ఇదే కమ్ములా స్థానంలో మరో డైరెక్టర్ ఉంటే నిర్మాతను మరో 30 కోట్లు పట్టుకురా? అని ఆదేశిస్తాడు. అ లాగైతేనే సినిమా పూర్త వుతుందని హెచ్చరిస్తారు. అలాగని అక్కడ దర్శకుల స్వార్దం ఏదీ ఉండదు. దాదాపు 80 శాతం సినిమాలకు ఇలాగా జరుగుతుంది. కమ్ములా మాటల్ని బట్టి బట్టి నవతరం దర్శకులే కాదు కొందరు సీనియర్లు కూడా తెలుసుకోవాల్సింది చాలా ఉంది.
