Begin typing your search above and press return to search.

ఆహ్లాదకరంగా సాగిన సీతా పయనం.. ఆకట్టుకున్న తండ్రి, కూతుర్లు..

సీతా పయనం సినిమా ట్రైలర్ ఈరోజు విడుదలై ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.

By:  Priya Chowdhary Nuthalapti   |   7 Feb 2026 5:43 PM IST
ఆహ్లాదకరంగా సాగిన సీతా పయనం.. ఆకట్టుకున్న తండ్రి, కూతుర్లు..
X

సీతా పయనం సినిమా ట్రైలర్ ఈరోజు విడుదలై ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ట్రైలర్ మొదట్లో సీత అనే యువతి ఒక తెలియని వ్యక్తికి లిఫ్ట్ ఇవ్వడంతో కథ మొదలవుతుంది. ఆ సమయంలో వాళ్లిద్దరి మధ్య జరిగే మాటలు చాలా క్యూట్ గా సాగాయి. చిన్న ప్రయాణం నుంచి మొదలైన ఈ కథ, క్రమంగా ఒక పెద్ద ప్రయాణంగా మారబోతుందనే భావన ట్రైలర్ ద్వారానే తెలుస్తోంది.




ఇక ట్రైలర్‌లో అసలైన ట్విస్ట్ యాక్షన్ కింగ్ అర్జున్ ఎంట్రీతో మొదలవుతుంది. ఆయన రావడంతో ట్రైలర్ మొత్తం యాక్షన్ మూడ్‌లోకి వెళ్లిపోతుంది. ఫైట్స్, ఛేజింగ్ సీన్స్‌తో పాటు కథలో ఉన్న సీరియస్ టోన్ కూడా బాగా చూపించారు. మధ్యలో హీరోయిన్ తండ్రిగా నటించిన సత్యరాజ్ ఎమోషనల్ సీన్స్ హృదయానికి హత్తుకుంటాయి. అలాగే ప్రకాష్ రా చెప్పే ఫ్యామిలీ డైలాగ్స్ సినిమా మొత్తం.. కుటుంబ ప్రేక్షకులకు దగ్గరగా ఉంటుందని అర్థమయ్యేలా ఉన్నాయి.

ఈ సినిమా కథ మొత్తం సీత చుట్టూనే తిరుగుతుందని ట్రైలర్ చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. హీరోయిన్‌గా అర్జున్ కుమార్తె ఐశ్వర్య ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవుతోంది. ఆమె పాత్ర బలంగా ఉండటం, కథలో కీలకంగా సాగడం ట్రైలర్‌లోనే చూపించారు. హీరో–హీరోయిన్ ప్రేమ ప్రయాణం ఎలా మొదలైంది, మధ్యలో వాళ్లకు ఎదురైన సమస్యలు ఏంటి, వాళ్ల చుట్టూ ఉన్న వ్యక్తులు ఎవరు అనే అంశాలు ఈ సినిమాలో ప్రధానంగా ఉండబోతున్నాయని ట్రైలర్ క్లారిటీ ఇచ్చింది.

అర్జున్ చాలా గ్యాప్ తర్వాత దర్శకుడిగా తెరకెక్కించిన ఈ సినిమా ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. ఈ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధంగా ఉంది. శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రంలో అర్జున్ ప్రత్యేక పాత్రలో కనిపించనుండగా, ఆయన మేనల్లుడు Dhruva Sarja స్పెషల్ కామియోలో కనిపించనున్నారు. ఇతన్ని రోల్ ని కూడా ఈ ట్రైలర్ లో కొద్దిసేపు చూపించారు.

మొత్తానికి సీతా పయనం ట్రైలర్ చూస్తే ఇది ప్రేమ, యాక్షన్, ఎమోషన్ అన్నీ కలిసిన ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని స్పష్టంగా అర్థమవుతుంది. ట్రైలర్‌తోనే సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. ఫిబ్రవరి 14న ఈ ప్రయాణం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.