Begin typing your search above and press return to search.

సితారే జ‌మీన్ ప‌ర్ ట్రైల‌ర్

వైక‌ల్యం ఉన్న‌వారితో ఆట ఆడించ‌డంలో ఉన్న స‌వాళ్ల‌ను ఎంతో ఫ‌న్నీగా, ఉద్విగ్నంగా ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించార‌ని ట్రైల‌ర్ చెబుతోంది. ఈ చిత్రం జూన్ 20న థియేట‌ర్ల‌లోకి రానుంది.

By:  Tupaki Desk   |   13 May 2025 10:31 PM IST
సితారే జ‌మీన్ ప‌ర్ ట్రైల‌ర్
X

2007 క్లాసిక్ హిట్ 'తారే జమీన్ పర్' స్ఫూర్తితో, ఒక కొత్త క‌థ‌ను ఎంచుకుని ఇప్పుడు 'సీతారే జ‌మీన్ ప‌ర్' చిత్రాన్ని రూపొందించాడు అమీర్ ఖాన్. ఇంత‌కుముందు కలర్‌ఫుల్ పోస్టర్ ని రిలీజ్ చేసి ఆస‌క్తిని పెంచిన అమీర్ తాజాగా ట్రైల‌ర్ ని రిలీజ్ చేసాడు. భావోద్వేగం, హాస్యం క‌ల‌బోత‌తో ఈ ట్రైల‌ర్ ఆద్యంతం హృద‌యాల‌ను ట‌చ్ చేసింది.

త‌న చిత్రాల‌తో చ‌క్క‌ని మెసేజ్ ఇచ్చే అల‌వాటు అమీర్ కి ఉంది. ఇప్పుడు ''సబ్కా అప్నా అప్నా నార్మల్'' అనే సందేశాన్ని ఈ సినిమా ద్వారా ప్ర‌జ‌ల‌కు ఇస్తున్నాడు. ఈ చిత్రంలో అత‌డు ప‌ది మంది మాన‌సిక విక‌లాంగుల టీమ్ కి బాస్కెట్‌బాల్ కోచ్‌గా నటించాడు. వైక‌ల్యం ఉన్న‌వారితో ఆట ఆడించ‌డంలో ఉన్న స‌వాళ్ల‌ను ఎంతో ఫ‌న్నీగా, ఉద్విగ్నంగా ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించార‌ని ట్రైల‌ర్ చెబుతోంది. ఈ చిత్రం జూన్ 20న థియేట‌ర్ల‌లోకి రానుంది.

ఈ చిత్రంతో ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ పది మంది నూతన నటీన‌టులను తెర‌కు పరిచయం చేస్తోంది. అరౌష్ దత్తా, గోపీ కృష్ణ వర్మ, సంవిత్ దేశాయ్, వేదాంత్ శర్మ, ఆయుష్ భన్సాలీ, ఆశిష్ పెండ్సే, రిషి షహాని, రిషబ్ జైన్, నమన్ మిశ్రా, సిమ్రాన్ మంగేష్కర్ ఈ చిత్రంలో న‌టించారు. శుభ్ మంగళ్ సావధాన్ ఫేం ఆర్.ఎస్. ప్రసన్న ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో జెనీలియా దేశ్‌ముఖ్ కోచ్ అమీర్ ఖాన్‌కి జంట‌గా న‌టించింది. పాటలను శంకర్-ఎహ్సాన్-లాయ్ స్వరపరిచారు. అమితాబ్ భట్టాచార్య పాట‌లు రాశారు. నేపథ్య సంగీతం: రామ్ సంపత్, స్క్రీన్‌ప్లే: దివి నిధి శర్మ. ఈ చిత్రాన్ని ఆమిర్ ఖాన్ - అపర్ణ పురోహిత్ సంయుక్తంగా నిర్మించారు.