Begin typing your search above and press return to search.

హీటెక్కించేలా సీరత్ కపూర్ స్టన్నింగ్ లుక్స్

ఇక లేటెస్ట్ గా షేర్ చేసుకున్న ఈ ఫోటోషూట్‌లో సీరత్ కపూర్ మేకప్ నుంచి జ్యువెలరీ వరకు ప్రతి అంశం హైలెట్ అయ్యింది.

By:  Tupaki Desk   |   20 Aug 2025 12:11 AM IST
హీటెక్కించేలా సీరత్ కపూర్ స్టన్నింగ్ లుక్స్
X

తెలుగు సినీప్రేక్షకులకు సుపరిచితమైన నటి సీరత్ కపూర్, ఇటీవల తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న కొత్త ఫోటోషూట్‌తో మళ్లీ అందరి దృష్టిని ఆకర్షించింది. క్లాసిక్ వైట్ గౌన్‌తో పాటు స్టైలిష్ బ్లేజర్ కలయికలో కనిపించిన ఆమె, సంప్రదాయానికి ఆధునికతను జోడించినట్లు అనిపించింది. రెడ్ బ్యాక్‌డ్రాప్ ముందు మరింత మెరిసిన ఈ లుక్, అందంగా, అలాగే బలమైన కాన్ఫిడెన్స్‌ను ప్రతిబింబించేలా ఉంది.

సీరత్ కపూర్ మోడలింగ్ రంగం నుంచి సినిమాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. 2014లో వచ్చిన ‘రన్ రాజా రన్’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఆ తరువాత టైగర్, కొలంబస్, రాగల 24 గంటల్లో, కృష్ణా అండ్ హిస్ లీలా, వంటి సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా రాజుగారి గది 2లో చేసిన పాత్ర ద్వారా విభిన్నమైన నటనను చూపించగలదని నిరూపించింది.

ఇక లేటెస్ట్ గా షేర్ చేసుకున్న ఈ ఫోటోషూట్‌లో సీరత్ కపూర్ మేకప్ నుంచి జ్యువెలరీ వరకు ప్రతి అంశం హైలెట్ అయ్యింది. సింపుల్ గోల్డ్ జ్యువెలరీ, లైట్ మేకప్, కర్లీ హెయిర్‌స్టైల్ కలిపి ఆమె గ్లామరస్ లుక్‌ను మరింత హైలైట్ చేశాయి. ఈ లుక్ వెనుక ఉన్న స్టైలిస్ట్ డిజైనర్ ఈవబెల్ డిజైన్స్ పనితనానికి నెటిజన్లు కూడా మంచి ప్రశంసలు అందజేస్తున్నారు.

సినిమాల్లో విభిన్న పాత్రలు చేస్తూ, ఆన్‌స్క్రీన్‌లో యాక్టర్‌గా తనకంటూ స్థానం సంపాదించుకున్న సీరత్ కపూర్, ఆఫ్‌స్క్రీన్‌లో కూడా ఫ్యాషన్‌తో అందరినీ ఆకర్షిస్తోంది. కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ, స్టైల్ స్టేట్మెంట్స్ ఇవ్వడంలో ఆమె ఎప్పుడూ ముందుంటుంది. మొత్తానికి, సీరత్ కపూర్ ఈ కొత్త ఫోటో లుక్, అభిమానులనే కాదు, ఫ్యాషన్ వర్గాల దృష్టినీ ఆకర్షించింది. రాబోయే సినిమాలు, ప్రాజెక్టులపై మంచి ఎక్స్‌పెక్టేషన్స్ సృష్టించిన ఆమె, గ్లామర్‌తో పాటు నటనలో కూడా మరింత బలమైన అడుగులు వేస్తుందని చెప్పొచ్చు.