Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 7 : ఈ సీజన్ రెండో కెప్టెన్ ఎవరంటే..?

బిగ్ బాస్ హౌస్ మొదటి కెప్టెన్ గా పల్లవి ప్రశాంత్, రెండో కెప్టెన్ గా యావర్ ఇద్దరు శివాజి ప్రోత్సాహంతో ఆటని ఆడుతున్నారు.

By:  Tupaki Desk   |   14 Oct 2023 6:07 AM GMT
బిగ్ బాస్ 7 : ఈ సీజన్ రెండో కెప్టెన్ ఎవరంటే..?
X

బిగ్ బాస్ సీజన్ 7 లో రెండో కెప్టెన్ గా యావర్ నిలిచాడు. మొదటి నుంచి ఆటలో తన సత్తా చాటుతూ వస్తున్న యావర్ పవర్ అస్త్ర కోసమే బాగా ట్రై చేశాడు. రెండు సార్లు పవర్ అస్త్ర కంటెండర్ గా కూడా అతను నిలిచాడు. అయితే చివరి నిమిషంలో అతను ఆట నుంచి తొలగించబడ్డాడు. అయితే ఈసారి మాత్రం సక్సెస్ ఫుల్ గా కెప్టెన్సీ టాస్క్ గెలిచి కెప్టెన్ గా నిలిచాడు. బిగ్ బాస్ సీజన్ 7 లో రెండో కెప్టెన్ గా యావర్ గెలిచాడు.

హౌస్ లోకి కొత్తగా వచ్చిన కంటెస్టెంట్స్ ని పోటుగాళ్లుగా పేరు పెట్టిన బిగ్ బాస్ ఆల్రెడీ హౌస్ లో ఉన్న వారిని ఆటగాళ్లుగా పిలిచాడు. ఈ క్రమంలో ఈ వీక్ మొత్తం ఆటగాళ్లు వర్సెస్ పోటుగాళ్లు అన్నట్టుగా రకరకాల టాస్క్ లు ఇచ్చాడు. జరిగిన ఏడు ఆటల్లో ఆటగాళ్ల టీం నాలుగింటిలో గెలిచింది. అందుకే వారి నుంచి ఒకరు కెప్టెన్ గా గెలిచే అవకాశం ఉందని బిగ్ బాస్ చెప్పాడు.

అయితే ఇందులో పోటుగాళ్లు కూడా టాస్క్ ఆడాల్సి ఉందని ట్విస్ట్ ఇచ్చాడు. పోటుగాళ్లు బజర్ మోగాక ఎవరైతే మొదటి పిన్ తీసుకుని తమకు నచ్చిన ఆటగాళ్లలో ఒకరికి ఇవ్వాలి వారు కెప్టెన్సీ నుంచి ఎవరు తొలగించాలనుకుంటున్నారో వారి బెలూన్ పొగల కొట్టాల్సి ఉంటుంది. సో అలా ఫైనల్ గా యావర్ బెలూన్ సేఫ్ గా ఉండటం వల్ల యావర్ ఇంటి కెప్టెన్ గా నిలిచాడు.

బిగ్ బాస్ హౌస్ మొదటి కెప్టెన్ గా పల్లవి ప్రశాంత్, రెండో కెప్టెన్ గా యావర్ ఇద్దరు శివాజి ప్రోత్సాహంతో ఆటని ఆడుతున్నారు. యావర్ కెప్టెన్ గా గెలవడం శివాజీకి సంతోషాన్ని ఇచ్చింది. కెప్టెన్ గా యావర్ ఎలా చేస్తాడు. హౌస్ లో ఎవరెవరికి ఏయే డ్యూటీస్ ఇస్తాడు. బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ ఎలా ఉండబోతుంది ఈరోజు చూడాలి. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చిన ఈ వారం ఎవరి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అన్నది హోస్ట్ నాగార్జున వారి గురించి ఎలా మాట్లాడుతాడు అన్నది చూడాలి. పల్లవి ప్రశాంత్ యావర్ ఇలా ఇద్దరు అన్ నోన్ పర్సన్స్ కెప్టెన్ గా మారడం హౌస్ లో ఉన్న స్టార్ కంటెస్టెంట్స్ కి షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు.