Begin typing your search above and press return to search.

సీ బ్యాక్ డ్రాప్ లో కోట్లు కొల్ల‌గొట్టే కాన్సెప్ట్ లు!

స‌ముద్రం నేప‌థ్యాన్ని ఆధారంగా చేసుకుని తెర‌కెక్కించిన చిత్రాల‌కు తిరుగులేద‌ని 'ఉప్పెన‌'...'వాల్తేరు వీర‌య్య' లాంటి సినిమాలు రుజువు చేసాయి

By:  Tupaki Desk   |   29 Dec 2023 11:30 AM GMT
సీ బ్యాక్ డ్రాప్ లో కోట్లు కొల్ల‌గొట్టే కాన్సెప్ట్ లు!
X

స‌ముద్రం నేప‌థ్యాన్ని ఆధారంగా చేసుకుని తెర‌కెక్కించిన చిత్రాల‌కు తిరుగులేద‌ని 'ఉప్పెన‌'...'వాల్తేరు వీర‌య్య' లాంటి సినిమాలు రుజువు చేసాయి. మెగా మెన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ ని తొలి సినిమాతోనే 100 కోట్ల హీరోని చేసింది 'ఉప్పెన‌'. ఎలాంటి ఇమేజ్..అంచ‌నాలు లేకుండా రిలీజ్ అయినా 100 కోట్లు తేవ‌డం ఇండ‌స్ట్రీనే ఆశ్చ‌ప‌రిచింది. ఆ బ్యాక్ డ్రాప్ కి ఎంత వెయిట్ ఉంద‌న్న‌ది మ‌రోసారి తేట‌తెల్ల‌మైంది. అటుపై మామ మెగాస్టార్ చిరంజీవి కూడా 'వాల్తేరు వీర‌య్య' కోసం అదే నేప‌థ్యాన్ని తీసుకున్నారు.

స‌ముద్రంంలో వీర‌య్య బిగినింగ్ ఎపిసోడ్ ఎంత హైలైట్ అయిందో తెలిసిందే. మ‌త్స‌కారుడిగా గెట‌ప్ లో చిరు ఆక‌ట్టుకున్న విధానం మాస్ లోకి దూసుకుపోయింది. 200 కోట్ల వ‌సూళ్ల‌కు కార‌ణ‌మైంది. అలా సీ బ్యాక్ డ్రాప్ అంటే ఓ క్రియేట్ అయింది మార్కెట్ లో. అప్ప‌టికే ఇదే నేప‌థ్యాన్ని బేసుకుని కొన్ని క‌థ‌లు రెడీ అవుతున్నాయి. ఓసారి ఆ వివ‌రాల్లోకి వెళ్తే..

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ క‌థానాయ‌కుడిగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో 'దేవ‌ర' సీ బ్యాక్ డ్రాప్ లోనే తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో అండ‌ర్ వాట‌ర్ స‌న్నివేశాలు సినిమాకే హైలైట్ అవుతాయ‌ని యూనిట్ ఇప్ప‌టికే రివీల్ చేసింది. వాటిని ఎంతో ప్ర‌త్యేకంగా...కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేసి రిచ్ గా తెర‌కెక్కిస్తున్నారు. దేవ‌ర ఓ కొత్త ప్ర‌పంచంలోకే తీసుకెళ్తుంద‌ని అంచ‌నాలున్నాయి. ఇక యంగ్ టైగ‌ర్ మాస్ లుక్ గురించైతే చెప్పాల్సిన ప‌నిలేదు.

స‌రిగ్గా ఇదే రేంజ్లో లాంచ్ అయింది నాగ‌చైత‌న్య 'తండేల్'. చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ సినిమా మ‌త్స‌కార జీవిత క‌థ‌ల్ని ఆధారంగా చేసుకుని పూర్తిగా స‌ముద్రం మీద‌నే క‌థ‌ని న‌డిపించ బోతున్నారు. కొన్ని వాస్త‌వ సంఘ‌ట‌న‌లు ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. స్టోరీ రీసెర్చ్ కోసం డైరెక్ట‌ర్ తో పాటు చైత‌న్య కూడా రంగంలోకి దిగ‌డం మ‌రింతగా హైప్ తెస్తుంది. దీంతో అంచ‌నాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్ప‌టికే చైత‌న్య లుక్ అక్కినేని అభిమానుల్లో కిక్ లా మారిపోయింది.

ఇక ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ -సుజిత్ కాంబినేషన్ లో తెర‌కెక్కుతోన్న 'ఓజీ' కూడా పోర్ట్ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కుతోంది. ఇది గ్యాంగ్ స్ట‌ర్ స్టోరీ. సీ బ్యాక్ డ్రాప్ లో అక్ర‌మ ర‌వాణా థీమ్ ని మెయిన్ గా హైలైట్ చేస్తున్నారు. దీంతో ఈ క‌థ కూడా సీ తో ముడిప‌డిన‌ట్లే క‌నిపిస్తోంది. అలాగే 'కేజీఎఫ్' ప్రాంచైజీ నుంచి మూడ‌వ భాగం పూర్తిగా స‌ముద్ర నేప‌థ్యంలోనే క‌థ సాగుతుంద‌ని తెలుస్తుంది. బంగారం బిస్కెట్ల‌తో ఎస్కేప్ అయిన రాఖీభాయ్ ఏ తీరానానికి చేరాడు? అన్న‌ది పార్ట్ -3 కాబోతుంది. మొత్తంగా ఈ కాన్సెప్ట్ ల‌న్నీ స‌ముద్రం ఆధారంగా అల్లుకున్న‌వే.