Begin typing your search above and press return to search.

మ్యూజిక్‌ను చంపేస్తున్న హీరోలు..!

కునాల్‌ కోహ్లీ మాట్లాడుతూ.. హీరోయిన్స్‌ పాత్రలను తగ్గించాలని చాలా మంది హీరోలు బాలీవుడ్‌ మ్యూజిక్‌ను చంపేస్తున్నారు.

By:  Tupaki Desk   |   18 July 2025 7:00 PM IST
మ్యూజిక్‌ను చంపేస్తున్న హీరోలు..!
X

బాలీవుడ్‌లో పెద్ద సినిమాలు సైతం మినిమం వసూళ్లు రాబట్టడానికి కిందామీదా పడుతున్న ఈ సమయంలో చిన్న సినిమాగా వచ్చిన 'సయ్యారా' సినిమా సంచలన ఓపెనింగ్స్‌ను నమోదు చేసింది. ఆషికి 2 దర్శకుడు మోహిత్‌ సూరి దర్శకత్వంలో రూపొందిన సయ్యారా సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు ముందు నుంచే పాజిటివ్‌ బజ్‌ క్రియేట్‌ కావడంతో డీసెంట్‌ ఓపెనింగ్స్ వస్తాయని అంతా భావించారు. కానీ అంతకు మించి అన్నట్లుగా ఈ సినిమా వసూళ్లు నమోదు చేస్తుంది. బాక్సాఫీస్ వద్ద సాలిడ్ ఓపెనింగ్స్‌ను ఈ సినిమా నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సినిమాకు ఉన్న డిమాండ్ నేపథ్యంలో మిడ్‌ నైట్‌ షో లు సైతం వేయడం జరిగింది.

యూత్‌లో ఈ సినిమాకు మంచి క్రేజ్‌ దక్కింది. దాంతో తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్‌ ద్వారా దాదాపుగా రూ.10 కోట్ల వసూళ్లు నమోదు అయ్యాయి. ఫస్ట్‌ డే పూర్తి అయ్యేప్పటికీ ఈ నెంబర్‌ డబుల్‌, అంతకు మించి అయినా ఆశ్చర్యం లేదని బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సయ్యారా సినిమాకు పాజిటివ్‌ టాక్‌ రావడంలో మ్యూజిక్ కీలక పాత్ర పోషించింది. చక్కని సంగీతం కారణంగా సినిమా యూత్‌ ఆడియన్స్‌ కి బాగా రీచ్‌ అవుతుందని, తప్పకుండా ఈ సినిమా బాలీవుడ్‌లో మరో ట్రెండ్‌ సెట్టర్‌ మూవీగా నిలుస్తుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు, నటుడు కునాల్‌ కోహ్లీ ఈ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

కునాల్‌ కోహ్లీ మాట్లాడుతూ.. హీరోయిన్స్‌ పాత్రలను తగ్గించాలని చాలా మంది హీరోలు బాలీవుడ్‌ మ్యూజిక్‌ను చంపేస్తున్నారు. ఐటెం సాంగ్స్‌ ఉంటే చాలు, అవి పెద్ద హిట్‌ అయితే చాలు అనుకునే హీరోలు చాలా మంది ఉన్నారు. సినిమాలో హీరోయిన్‌ పాత్ర తగ్గించి, ఆమె స్క్రీన్‌ ప్రజెన్స్‌ తగ్గించడం కోసం హీరోలు గతంలో మాదిరిగా పాటలు లేకుండా చేస్తున్నారని, కమర్షియల్‌ సినిమాలంటే కనీసం నాలుగు అయిదు పాటలు ఉంటే బాగుంటుందనే అభిప్రాయం ను ఆయన వ్యక్తం చేశారు. సయ్యారా సినిమా మ్యూజిక్ పరంగా బాగుందని అన్నారు. ఇండియన్‌ సినిమాలో నేడు లెజెండరీ డే అని సయ్యారా విడుదల నేపథ్యంలో కోహ్లీ సోషల్ మీడియా ద్వారా ట్వీట్‌ చేశారు.

సినిమాకు మొదటి నుంచి పాజిటివ్ బజ్‌ క్రియేట్‌ కావడంలో కీలక పాత్ర పోషించింది మ్యూజిక్ అనే విషయం తెల్సిందే. ఆ తర్వాత వచ్చిన ట్రైలర్‌కి సైతం మంచి స్పందన దక్కింది. బాక్సాఫీస్‌ వద్ద సినిమా భారీ విజయం సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తుంది అంటే అది మ్యూజిక్‌కు ఇచ్చిన ప్రాధాన్యత వల్ల అంటూ కునాల్‌ పేర్కొన్నారు. హిందీ లో పెద్ద హీరోలు సైతం ఇలాంటి జోనర్‌లో, ఇలాంటి తరహా మ్యూజిక్‌తో సినిమాలు చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయం ను పలువురు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒక క్యూట్‌ లవ్‌ స్టోరీతో ఈ సినిమా వచ్చింది. అహాన్‌ పాండే హీరోగా, అనీత్‌ పడ్డా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా సౌత్‌ ఇండియాలోనూ ముందు ముందు విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.