Begin typing your search above and press return to search.

బాక్సాఫీస్‌ : యూత్‌ లవ్‌ స్టోరీతో సీనియర్‌ థ్రిల్లర్‌ వార్‌!

సయ్యారా సినిమా ఒక వైపు బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తున్న ఈ సమయంలోనే సోనాక్షి సిన్హా నటించిన 'నికితా రాయ్‌' సినిమా వసూళ్లు సాధించడానికి కిందా మీదా పడుతోంది.

By:  Tupaki Desk   |   20 July 2025 2:00 AM IST
బాక్సాఫీస్‌ : యూత్‌ లవ్‌ స్టోరీతో సీనియర్‌ థ్రిల్లర్‌ వార్‌!
X

గత కొన్నాళ్లుగా బాలీవుడ్‌లో విడుదలైన సినిమాల్లో ఎక్కువ శాతం డిజాస్టర్‌ ఫలితాలను చవిచూస్తున్నాయి. మినిమం వసూళ్లను సైతం దక్కించుకోలేక కిందామీదా పడుతున్న విషయం తెల్సిందే. స్టార్‌ హీరోల సినిమాలు సైతం బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్‌ ఫలితాలను చవిచూస్తున్న సమయంలో వచ్చిన 'సయ్యారా' సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. విడుదలకు ముందు నుంచే పాజిటివ్‌ బజ్‌ క్రియేట్‌ చేయడంలో సక్సెస్‌ అయిన సయ్యారా సినిమా విడుదల తర్వాత కూడా వసూళ్ల విషయంలో చాలా పాజిటివ్‌ రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఈ మధ్య కాలంలో విడుదలైన హిందీ సినిమాలన్నింటిలోకి సయ్యారా సినిమా వసూళ్ల విషయంలో టాప్‌లో ఉండటం ఖాయం అంటూ బాక్సాఫీస్‌ వర్గాల వారు నమ్మకంగా చెబుతున్నారు.

సయ్యారా సినిమా ఒక వైపు బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తున్న ఈ సమయంలోనే సోనాక్షి సిన్హా నటించిన 'నికితా రాయ్‌' సినిమా వసూళ్లు సాధించడానికి కిందా మీదా పడుతోంది. నికితా రాయ్ సినిమాకు పాజిటివ్‌ రివ్యూలు వచ్చాయి. మంచి థ్రిల్లర్‌ ఎలిమెంట్స్ ఉన్న సినిమా అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. సినిమాకు మంచి వసూళ్లు సైతం వస్తాయని అంతా భావించారు. కానీ సయ్యారా సినిమాకు వచ్చిన రెస్పాన్స్‌ నేపథ్యంలో, ఆ సినిమా యూత్‌ నుంచి దక్కించుకున్న పాజిటివ్‌ రెస్పాన్స్‌ కారణంగా నికితా రాయ్‌ కి వసూళ్ల విషయంలో చాలా పెద్ద డ్యామేజ్‌ జరగబోతుంది అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సోనాక్షి సిన్హా చాలా గ్యాప్‌ తర్వాత నికితా రాయ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నటిగా ఈ సినిమాతో మరోసారి తనను తాను నిరూపించుకోబోతున్నాను అంటూ ప్రమోషన్‌ సమయంలో చెప్పుకొచ్చింది. కమర్షియల్‌గా సినిమా ఏ మేరకు ఆడుతుంది అనేది మాత్రం ముందుగా ఊహించలేదు. సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వచ్చిన నేపథ్యంలో ఓపెనింగ్స్ ఒక మోస్తరుగా నమోదు అవుతున్నాయి. కానీ సయ్యారా సినిమా బాక్సాఫీస్‌ జోరు ముందు నికితా రాయ్ నిలిచే అవకాశాలు పెద్దగా కనిపించడం లేదు. రాంగ్‌ టైమింగ్‌లో నికితా రాయ్ వచ్చిందని విశ్లేషకులతో పాటు, ప్రేక్షకులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోనాక్షి సిన్హా మంచి అవకాశం మిస్‌ చేసుకుంది.

ఒక వారం ముందు లేదా ఒక వారం తర్వాత సినిమా విడుదల ఉండి ఉంటే ఖచ్చితంగా బాక్సాఫీస్‌ వద్ద డబుల్‌ వసూళ్లను మేకర్స్‌ చూసేవారు అనేది కొంతమంది అభిప్రాయం. మొత్తానికి బాలీవుడ్‌లో ఈ తరహా బాక్సాఫీస్ వార్‌ చూసి చాలా కాలం అయిందని, ఒక సినిమాను మించి మరో సినిమా ఉండి, వసూళ్ల విషయంలో పోటీ పడటం అనేది బాలీవుడ్‌లో చూసి చాలా కాలం అయిందని నెటిజన్స్‌, సినీ ప్రేమికులు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఉన్న వరుస ఫ్లాప్స్‌ ఫోబియాకి ఈ రెండు సినిమాలు కాస్త అయినా చెక్‌ పెట్టే అవకాశం ఉందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముందు ముందు అయినా సినిమాలను ప్లాన్‌ చేసుకుని విడుదల చేసుకుంటే, బాక్సాఫీస్ వార్‌ తప్పించుకోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.