హిట్ కొట్టిన కుర్ర హీరో సీక్రెట్ గర్ల్‌ఫ్రెండ్..?
శృతి చౌహాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో... జీవితాంతం దీన్ని గురించి కలలు కంటూ ఉన్న ఇతడికి మంచి విజయం దక్కింది.
By: Tupaki Desk | 22 July 2025 9:00 PM ISTబాలీవుడ్ లేటెస్ట్ సెన్షేషన్ మూవీ 'సయ్యారా' గురించి దేశం మొత్తం మాట్లాడుకుంటోంది. బాలీవుడ్‌కి పూర్వ వైభవం తీసుకు వచ్చిందని కొందరు అంటూ ఉంటే, స్టార్ హీరోలు సైతం ఈ ఫార్ములాను ఫాలో అవ్వాలని మరికొందరు సూచిస్తున్నారు. మొత్తానికి సయ్యారా సినిమా బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా ఉంది. ఈ సినిమాలో హీరోగా అనన్య పాండే బందువు అయిన అహాన్ పాండే నటించగా, హీరోయిన్‌గా అనీత్ పడ్డా నటించిన విషయం తెల్సిందే. వీరిద్దరు ఓవర్ నైట్‌లో స్టార్స్ అయ్యారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం వీరి గురించి ఏ రేంజ్‌లో చర్చ జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిని తమ సినిమాల్లో నటింపజేయాలని స్టార్ ఫిల్మ్ మేకర్స్ సైతం ఆసక్తిగా ఉన్నారు.
ఇలాంటి సమయంలో వీరి గత సినిమాలు, వీరి గత ప్రేమ వ్యవహారాలు, సోషల్ మీడియా పోస్ట్‌ల గురించి కొందరు ఆరా తీస్తున్నారు. ఇటీవల హీరో అహాన్ పాండే గర్ల్ ఫ్రెండ్ శృతి చౌహాన్ అంటూ ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్లుగా కొన్ని సాక్ష్యాలు సైతం ఉన్నాయి. శృతి చౌహాన్ బాహాటంగానే చాలా సార్లు అహాన్ పాండే గురించి పోస్ట్ చేసింది. ముఖ్యంగా సయ్యారా సినిమా విడుదల సమయంలో శృతి చౌహాన్ గురించి ప్రముఖంగా చర్చ జరిగింది. ఆమె సోషల్ మీడియాలో ఆమె అహాన్‌కి శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్ట్‌లు పెట్టిన విషయం తెల్సిందే. అంతే కాకుండా నీ డ్రీమ్ నిజం అయింది, నిన్ను చూస్తూ ఉంటే గర్వంగా ఉంది, ఐ లవ్ యూ అంటూ పోస్ట్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది.
శృతి చౌహాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో... జీవితాంతం దీన్ని గురించి కలలు కంటూ ఉన్న ఇతడికి మంచి విజయం దక్కింది. ఈ విజయం కోసం అతడు సర్వస్వం ను దార పోశాడు. అందుకు తగ్గ ఫలితం వచ్చింది. ఈ విజయానికి అతడు పూర్తి అర్హుడు, అందుకే అతడిని చూస్తూ ఉంటే గర్వంగా ఉందని పేర్కొంది. అంతే కాకుండా ప్రేమిస్తున్నాను అంటూ కూడా పోస్ట్‌లో పేర్కొనడంతో ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఉందని, అహాన్ యొక్క సీక్రెట్ గర్ల్ ఫ్రెండ్ శృతి చౌహాన్ అయ్యి ఉంటుందని చాలా మంది భావిస్తున్నారు. అసలు విషయం ఏంటి అనేది ఇప్పటి వరకు అధికారికంగా అహాన్ నుంచి క్లారిటీ రాకపోవడంతో సోషల్ మీడియాలో పుంకాను పుంకాలుగా ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం గురించి అహాన్ పాండే తరపున కొందరు స్పందించారు. ఇద్దరి మద్య ఎలాంటి రిలేషన్ లేదని, వారిద్దరూ ప్రేమించుకుంటున్నట్లు వస్తున్న వార్తలు నిజం కాదని చెప్పుకొచ్చారు. శృతి చౌహాన్ యొక్క పోస్ట్‌ల గురించి వారు స్పందిస్తూ ఒక స్నేహితురాలిగా ఆ పోస్ట్‌లు పెట్టి ఉంటుందని కొందరు అంటూ ఉంటే, కొందరు మాత్రం ఆ పోస్ట్‌లతో ఆమె పబ్లిసిటీ కోరుకుంటుందేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి సోషల్ మీడియాలో అహాన్ పాండే, శృతి చౌహాన్ యొక్క ప్రేమ వ్యవహారం గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. ఆ వార్తలపై అహాన్ పాండే అధికారికంగా స్పందిస్తే కానీ క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ప్రస్తుతం సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న అహాన్ ముందు ముందు ఈ విషయమై స్పందిస్తాడేమో చూడాలి.
