Begin typing your search above and press return to search.

ఛాతి నొప్పితో ఆసుప‌త్రిలో షాయాజీ షిండే

న‌టుడు షాయాజీ షిండే ఛాతి నొప్పికి గురైన‌ట్లు ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

By:  Tupaki Desk   |   12 April 2024 7:57 AM GMT
ఛాతి నొప్పితో ఆసుప‌త్రిలో షాయాజీ షిండే
X

న‌టుడు షాయాజీ షిండే ఛాతి నొప్పికి గురైన‌ట్లు ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. గురువారం నొప్పి రావ‌డంతో కుటుంబ స‌భ్యులు హుటాహుటిన ఆసుప‌త్రికి త‌ర‌లించిన విష‌యం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఉన్న‌ట్లుండి ఒక్క‌సారిగా ఛాతీలో తీవ్ర‌మైననొప్పి రావ‌డంతో ఆందోళ‌న చెందిన కుటుంబ స‌భ్యులు కారులో ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అనంత‌రం డాక్ట‌ర్లు వైద్యం ప్రారంభించ‌డంతో గుండెకు ర‌క్తం స‌ర‌ఫారా చేసే నాళాల్లో బ్లాక్స్ ఏర్ప‌డిన‌ట్లు గుర్తించారు.

అనంత‌రం యాంజియోప్లాస్టీ చేసిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉన్న‌ట్లు డాక్ట‌ర్లు తెలిపారు. కొన్ని రోజుల పాటు ఆసుప‌త్రిలో ఉంచి కోలుకున్న అనంత‌రం డిశ్చార్చ్ చేస్తార‌ని స‌మాచారం. అయితే షిండి ఛాతిలో నొప్పి రావ‌డం ఇది తొలిసారి కాదు. గ‌తంలో కూడా ఓ సారి తీవ్ర‌మైన నొప్పి రావ‌డంతో అప్పుడు ఇలాంటి ప‌రిస్థితే ఎదుర్కున్నారు. తాజాగా రెండ‌వ సారి అలాంటి నొప్పి రావ‌డంతో డాక్ట‌ర్లు మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించిన‌ట్లు తెలుస్తోంది.

షాయాజీ షిండే ఎన్నో తెలుగు చిత్రాల్లో న‌టించాడు. న‌టుడిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును ద‌క్కించు కున్నారు. విలన్ గా- తండ్రిగా- సహాయక పాత్రలో నటించి తనకంటూ ఓ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు. అత‌ని తెలుగు డ‌బ్బింగ్ లో వైవిథ్య‌త ఉంటుంది. దీంతో ఆయ‌న వాయిస్ కి ప్ర‌త్యేక‌మైన అభిమానులున్నారు. మహారాష్ట్ర చెందిన షిండే మరాఠీతో పాటు హిందీ.. తమిళ.. మలయాళం.. కన్నడ భాషాల్లోనూ న‌టించారు.

సినిమాల్లోకి రాకముందు మరాఠీలో నాటకాలు వేసేవారు. అక్కడ నుంచి వెండితెర పై అడుగుపెట్టారు. ఇప్ప‌టి వ‌ర‌కూ దాదాపు 200 పైగా చిత్రాల్లో నటించారు. అయితే కొంతకాలంగా షాయాజీ షిండే తెలుగులో పెద్ద‌గా సినిమాలు చేయ‌డం లేదు. న‌టుడు పాత బ‌డ‌టంతో అవ‌కాశాలు కూడా త‌గ్గాయి. ఇత‌ర భాష‌ల్లో కూడా ఆయ‌న సినిమాలు చేస్తున్న‌ట్లు క‌నిపించ‌లేదు. మ‌రి అక్క‌డ అవ‌కాశాలు రాక చేయలేదా? ఆరోగ్యం దృష్ట్యా దూరంగా ఉంటున్నారా? అన్న‌ది తెలియాలి.