Begin typing your search above and press return to search.

సంతకం ద్వారా బయటపడ్డ సావిత్రి పెళ్లి విషయం..!

కానీ సావిత్రి పెళ్లి విషయం బయట పడేలా చేసింది ఆమె సంతకం అని కొందరు చెబుతుంటారు.

By:  Tupaki Desk   |   6 Dec 2023 6:40 AM GMT
సంతకం ద్వారా బయటపడ్డ సావిత్రి పెళ్లి విషయం..!
X

మహానటి సావిత్రి గురించి సినీ పరిశ్రమ ఉన్నంత కాలం చెప్పుకుంటూనే ఉంటారు. తెలుగు సినిమా ద్వారా పరిచయమై తెలుగు తో పాటుగా మిగతా భాషల్లో కూడా నటించి మెప్పించారు సావిత్రి. గుంటూరు జిల్లా తాడేపల్లె మండల్మ్ చిత్రావూరులో 1934 డిసెంబర్ 6న సావిత్రి జన్మించారు. నేటితో ఆమె 89 వసంతాలు పూర్తి చేసుకున్నారు. సావిత్రి జీవిత కథతో మహానటి సినిమా తీశారు నాగ్ అశ్విన్. ఆ సినిమా కూడా సెన్సేషనల్ హిట్ గా నిలిచింది.

సావిత్రి జెమిని గణేశన్ పెళ్లి గురించి ఒక్కొక్కరు ఒక్కోలా చెబుతారు. ఆల్రెడీ పెళ్లైన జెమినీ గణేశన్ సావిత్రిని ప్రేమించి రెండో వివాహం చేసుకున్నారు. పెళ్లి టైం కి సావిత్రి వయసు కేవలం 18 ఏళ్లు మాత్రమే. జెమినీ గణేశన్ సావిత్రిని ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి విషయం బయటకు వచ్చాక సంచలనంగా మారింది. సావిత్రి జెమిని గణేశన్ పెళ్లి విషయం వారి ప్రేమలేఖలు వల్ల బయట పడిందని అందరికీ తెలుసు.

కానీ సావిత్రి పెళ్లి విషయం బయట పడేలా చేసింది ఆమె సంతకం అని కొందరు చెబుతుంటారు. అప్పటికే స్టార్డం సంపాధించిన సావిత్రి సినిమాలతో పాటు కొన్ని కంపెనీలకు బ్రాండింగ్ కూడా చేస్తున్నారు. ఆ టైంలో మహానటికి ఒక సబ్బు కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలని కోరారు. అందుకు ఓకే చెప్పిన సావిత్రి ఆ అగ్రిమెంట్ టైం లో సావిత్రి గణేశన్ అని సైన్ చేశారట. అలా హడావిడిలో తన పెళ్లి మ్యాటర్ బయట పెట్టేశారు సావిత్రి. సావిత్రి జెమినీ గణేశన్ లకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మొదట కూతురు పుట్టగా ఆమెకు విజయ చాముండేశ్వరి అనే పేరు పెట్టారు. ఆ తర్వాత బాబు పుట్టగా అతనికి సతీష్ కుమార్ అని పేరు పెట్టారు. సావిత్రి చివరి రోజుల్లో చాలా ఇబ్బందులు పడ్డారు. 19 నెలలు పాటు కోమాలో ఉన్న సావిత్రి 47 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు.

వెండితెర మీద మహానటిగా వెలుగులు వెదజల్లిన సావిత్రి చివరి రోజుల్లో చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు. సావిత్రి జీవిత కథతో నాగ్ అశ్విన్ తెరకెక్కిన మహానటి ఒక సిన్సియర్ ఎఫర్ట్ గా ప్రేక్షకుల మన్ననలు పొందగలిగారు. అభినయ తారగా మహానటి సావిత్రి నటనను చూసి ఎంతోమంది కథానాయికలు వెండితెర వైపు అడుగులు వేశారు.