Begin typing your search above and press return to search.

చిరు గురించి షాకింగ్ నిజం చెప్పిన మహానటి కూతురు

మెగాస్టార్‌ చిరంజీవి సినీ కెరీర్ మరియు వ్యక్తిగత జీవితం అందరికి కూడా తెరిచిన పుస్తకం.

By:  Tupaki Desk   |   3 April 2024 4:27 AM GMT
చిరు గురించి షాకింగ్ నిజం చెప్పిన మహానటి కూతురు
X

మెగాస్టార్‌ చిరంజీవి సినీ కెరీర్ మరియు వ్యక్తిగత జీవితం అందరికి కూడా తెరిచిన పుస్తకం. ఆయన వ్యక్తిగత విషయాలను కూడా ఎప్పటికప్పుడు అభిమానులతో మరియు మీడియాతో షేర్ చేసుకుంటూ ఉంటారు. ఆయన ఫ్యామిలీతో పాటు అన్ని విషయాలు కూడా ఫ్యాన్స్ కి తెలిసిందే.

ఆయన ఉదయం నుంచి రాత్రి వరకు ఏం చేస్తారు, ఆయన ప్రాముఖ్యతలు ఏంటి, ఆయన ఎక్కువ సమయం ఎక్కడ స్పెండ్‌ చేస్తాడు అనే విషయాలు కూడా ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులకు తెలిసిందే. అయితే తాజాగా జరిగిన మహానటి సావిత్రికి సంబంధించిన కార్యక్రమంలో చిరంజీవి గురించి ఆసక్తికర విషయం తెలిసింది.

సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి మాట్లాడుతూ... చిరంజీవి లేవగానే సావిత్రమ్మ ఫొటోను చూస్తారు. నేను మొదటి సారి వారి ఇంటికి వెళ్లిన సమయంలో నాకు ఈ విషయం తెలిసింది. అమ్మ అంటే చిరంజీవికి ఎంత అభిమానమో నాకు అప్పుడే అర్థం అయ్యిందని ఆమె అన్నారు.

చిరంజీవి విశ్వంభర సినిమా షూటింగ్‌ తో ఎంతో బిజీగా ఉన్నా కూడా సావిత్రమ్మ పై ఆయనకు ఉన్న అభిమానంతో షూటింగ్‌ కు బ్రేక్ ఇచ్చి మరీ కార్యక్రమంలో హాజరు అయ్యారు. మహానటి కి సంబంధించిన ఏ చిన్న కార్యక్రమం జరిగిన ఆయన హాజరు అవ్వడం గతంలో కూడా పలు సార్లు మనం చూశాం.

ఇప్పుడు సావిత్రి గారు అంటే చిరంజీవికి ఎంతటి అభిమానం ఉందో మరోసారి నిరూపితం అయ్యింది. సాధారణంగా నిద్ర లేచిన వెంటనే దేవుడి ఫోటోను చూస్తారు. కానీ చిరంజీవి తనకు ఎంతో ఇష్టం అయిన సావిత్రి గారి ఫోటోను చూస్తారు అంటే ఆమె అంటే ఆయనకు ఎంతటి అభిమానమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.