Begin typing your search above and press return to search.

సేవ్ ద టైగర్స్ 2.. ఈసారి మరింత మాస్ ఫన్ రైడ్

డిస్నీ+ హాట్‌స్టార్ లో బాగా పాపులర్ వెబ్ సిరీస్ లలో 'సేవ్ ది టైగర్స్ సీజన్ 1' కూడా అలాటి

By:  Tupaki Desk   |   5 March 2024 6:08 AM GMT
సేవ్ ద టైగర్స్ 2.. ఈసారి మరింత మాస్ ఫన్ రైడ్
X

డిస్నీ+ హాట్‌స్టార్ లో బాగా పాపులర్ వెబ్ సిరీస్ లలో 'సేవ్ ది టైగర్స్ సీజన్ 1' కూడా అలాటి. 2023లో భారీ విజయాన్ని అందుకున్న ఈ సీరీస్ కు తేజా కాకుమాను దర్శకత్వం వహించగా చిన వాసుదేవరెడ్డి నిర్మించారు. మహి వి. రాఘవ, ప్రదీప్ 'సేవ్ ది టైగర్స్' సీజన్ కు క్రియేటర్స్ గా వర్క్ చేశారు. ఇక సీజన్ 1 కు సానుకూల స్పందన రావడంతో అప్పుడే సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చేశారు.

మొదటి సీజన్లో కామెడీతోపాటు ఫ్యామిలీ డ్రామా కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అంతేకాకుండా కాస్త ఎమోషనల్ టచ్ కూడా ఇచ్చిన మేకర్స్ ఈసారి దానికి సిక్వల్ గా తీసుకురాబోతున్న మరో వెబ్ సిరీస్ పై కూడా అంచనాలను పెంచేశారు. ఎక్కడ వారి కథ పూర్తయిందో మళ్ళీ అక్కడి నుంచి మొదలుపెట్టే విధంగా కథను లీడ్ తీసుకోబోతున్నట్లు ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది.

ఇక సేవ్ ద టైగర్స్ సెకండ్ పార్ట్ కు సంబంధించిన ట్రైలర్ ను రీసెంట్ గా విడుదల చేశారు. అందులో ప్రియదర్శి అభినవ్ చైతన్య ముగ్గురు కూడా పోలీసుల బారిన పడి తీవ్ర స్థాయిలో దెబ్బలు తింటూ ఉంటారు. హంసలేఖను ఎక్కడ అనే అనే పాయింట్ తో మొదలైన ట్రైలర్ లో వివిధ రకాల అంశాలను కూడా హైలెట్ చేశారు.

ఈసారి మెయిన్ క్యారెక్టర్స్ మధ్యలో ఉండే కామెడీ సన్నివేశాలు చాలా కొత్తగా ఉన్నాయి. అంతే కాకుండా ప్రతి క్యారెక్టర్ లో కూడా ఈసారి మరిన్ని షేడ్స్ కనిపించబోతున్నట్లు కూడా అర్థమవుతుంది. ముఖ్యంగా విక్రమ్ క్యారెక్టర్ లో చాలా మార్పులు వచ్చాయి అని అతని భార్య ఆరోపణలు చేస్తుంది. ఇక గౌతమ్ కూడా జాబ్ మానేసినప్పటినుంచి అతనిలో కూడా చాలా మార్పులు వచ్చాయి అని అతని సతీమణి అంటుంది.

జోర్డార్ సుజాత క్యారెక్టర్ కూడా ఇందులో మరింత హైలెట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఆమె భర్తను మార్చాలని అనుకుంటుంది. కానీ ప్రియదర్శి మాత్రం పాత పద్దతిలోనే ఉండాలని అనుకుమాటాడు. అలాగే భార్యపై సెటైర్లు వేస్తూ ఉంటాడు. ఈసారి ఫ్యామిలీ డ్రామాలో మరిన్ని నవ్వులు ఉండబోతున్నట్లు ప్రతి డైలాగ్ కనిపిస్తోంది.

విలేజ్ క్యారెక్టర్ నుంచి సుజాత మరింత స్టైలిష్ గా హైలైట్ అవుతుంది. ఇక ట్రైలర్ చివరలో ఉండే డ్రామా కూడా మేజర్ ప్లస్ పాయింట్ గా కనిపిస్తోంది. మొత్తానికి సేవ్ ది టైగర్స్ 2 హీరోలు ఈసారి ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటారో చూడాలి. మార్చి 15 నుంచి ఈ సీరీస్ డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.