Begin typing your search above and press return to search.

నీట మునిగిన‌ చెన్నైని ఆదుకోండి: AR రెహమాన్

చెన్నై వరదల్లో చిక్కుకున్న లోతట్టు ప్రాంతాల నుండి ప్ర‌జ‌ల‌ను ఖాళీ చేయిస్తున్న క్ర‌మంలో స‌హాయ‌క‌చ‌ర్య‌ల‌లో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్, త‌మిళ న‌టుడు విష్ణు విశాల్, బ్యాడ్మింటన్ ప్లేయర్ జ్వాలా గుత్తా ఉన్నారు.

By:  Tupaki Desk   |   6 Dec 2023 4:53 PM GMT
నీట మునిగిన‌ చెన్నైని ఆదుకోండి: AR రెహమాన్
X

నీటమునిగిన ఇళ్లు, జ‌ల‌మ‌య‌మైన‌ వీధులు..విద్యుత్తు అంతరాయంతో చెన్నైవాసులు ఇబ్బందులు పడుతుండగా, తన స్వగ్రామంలో కొనసాగుతున్న సహాయక చర్యలకు సహకరించాలని లెజండ‌రీ మ్యూజిక్ మాస్ట్రో AR రెహమాన్ ప్రజలను కోరారు. X లో ప్ర‌స్థావిస్తూ.. ఆస్కార్-విజేత రెహ‌మాన్ ఇలా రాసారు. ``బాధితులైన వారి కోసం హృదయాలు స్పందిస్తున్నాయి. మ‌న‌మంతా మద్దతుగా కలిసి నిలబడదాం. అవగాహనను వ్యాప్తి చేద్దాం.. సహాయక చర్యలకు సహకరిద్దాం. ప్రతి స‌హాయం చాలా ముఖ్యమైనది`` అని రాసారు.

చెన్నై వరదల్లో చిక్కుకున్న లోతట్టు ప్రాంతాల నుండి ప్ర‌జ‌ల‌ను ఖాళీ చేయిస్తున్న క్ర‌మంలో స‌హాయ‌క‌చ‌ర్య‌ల‌లో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్, త‌మిళ న‌టుడు విష్ణు విశాల్, బ్యాడ్మింటన్ ప్లేయర్ జ్వాలా గుత్తా ఉన్నారు. ప్ర‌తిసారీ సెలబ్రిటీలు ప్ర‌కృతి వైప‌రీత్యాల వేళ అద్భుతంగా స్పందించారు. ఈసారి చెన్నై వ‌ర‌ద‌ల స‌మ‌యంలో ప‌లువురు త‌మ వంతు సాయాన్ని కొన‌సాగిస్తున్నారు. మునిగిపోయిన ఇళ్లలో చిక్కుకుపోయిన ప్రజలను చేరుకోవడానికి రెస్క్యూ సిబ్బంది పడవలను ఉపయోగించారు.

మంగళవారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీరాన్ని తాకిన మైచాంగ్ తుఫానుకు ముందు కుండపోత వర్షాల వల్ల సంభవించిన వరదలలో 13 మంది మరణించినట్లు అంచనా. 6 మిలియన్ల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరం చెన్నై అల్ల క‌ల్లోలం అయింది. ప్రధానంగా ఆటోమొబైల్ రంగం, సాంకేతికత ప‌రిక‌రాల‌ తయారీ కేంద్రమైన చెన్నైలో లోత‌ట్టు ప్రాంతాల‌ ప్రజలను వారి ఇళ్ల నుండి బయటకు తీసుకుని రావ‌డానికి రక్షకులు గాలితో కూడిన తెప్పలు, తాళ్ల‌ను ఉపయోగించారు.

రెస్క్యూ వర్కర్లు నడుము లోతు నీటిలో తిరుగుతున్న వీడియోలు, నీటిలో మునిగిన వాహనాల వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వైమానిక దళం హెలికాప్టర్లు కూడా వరదలతో ఇళ్లలో చిక్కుకుపోయిన ప్రజలకు ఆహారం, రేషన్‌లను అందించాయి. ఈ వారం చెన్నైలో సంభవించిన వరదలు ఎనిమిదేళ్ల క్రితం సుమారు 290 మందిని చంపిన వరదల వల్ల సంభవించిన అపారమైన నష్టాన్ని జ్ఞ‌ప్తికి తెచ్చాయి. కొంతమంది నివాసితులు తీవ్రమైన వాతావరణాన్ని త‌ట్టుకునేందుకు నగరంలో మౌళిక సదుపాయాల సామర్థ్యాన్ని ప్రశ్నించారు. 5,000 కోట్లు నష్టపరిహారం ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.

సివిల్ ఇంజనీర్ - జియో-అనలిటిక్స్ నిపుణుడు రాజ్ భగత్ పి మాట్లాడుతూ ``నగరంలోని మురికినీటి పారుదల వ్యవస్థలు వరదలను నిరోధించలేకపోయాయ‌ని అన్నారు. ఈ వెసులుబాటు ఒక‌ మోస్తరు భారీ వర్షపాతంలో చాలా సహాయపడింది కానీ.. అతి భారీ వర్షాలలో కాదు!`` అని ఆయన చెప్పారు.