Begin typing your search above and press return to search.

మిసెస్‌ త్రివిక్రమ్‌ కి కూడా ఆమెనే కావాలట!

తన భర్త గుంటూరు కారం కోసం తీసుకున్న హీరోయిన్‌ ని తన లక్కీ భాస్కర్‌ కోసం సౌజన్య తీసుకున్నారు.

By:  Tupaki Desk   |   25 Sep 2023 6:02 AM GMT
మిసెస్‌ త్రివిక్రమ్‌ కి కూడా ఆమెనే కావాలట!
X

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న గుంటూరు కారం సినిమా హీరోయిన్‌ ల విషయంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకున్న విషయం తెల్సిందే. హీరోయిన్ గా మొదట పూజా హెగ్డేను తీసుకుని, సెకండ్‌ హీరోయిన్ పాత్రకు గాను శ్రీలీల ను ఎంపిక చేయడం జరిగింది.

కారణాలు ఏంటో కానీ పూజా హెగ్డేను గుంటూరు కారం సినిమా నుంచి తొలగించి ఆ స్థానంలో శ్రీలీలను ఎంపిక చేయడం జరిగింది. సెకండ్‌ హీరోయిన్‌ రోల్‌ లో కొత్తమ్మాయి మీనాక్షి చౌదరి ని బరిలోకి దించడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మహేష్‌ బాబు సినిమాలో సెకండ్‌ హీరోయిన్‌ పాత్ర అయినా కూడా చాలా గొప్ప విషయం అన్నట్లుగా మీనాక్షి చౌదరి సంతోషంగా ఉంది.

మహేష్ బాబు సినిమా లో ఛాన్స్‌ దక్కడంతో ముద్దుగుమ్మ మీనాక్షికి బయట మరిన్ని సినీ ఆఫర్లు తలుపు తడుతున్నాయి. ఇతర సినిమాల విషయం పక్కన పెడితే తాజాగా ఈమె లక్కీ భాస్కర్ అనే సినిమాలో నటించే ఛాన్స్ ను దక్కించుకుంది. ఆ సినిమాకు త్రివిక్రమ్‌ భార్య సౌంజన్య నిర్మాత. తన భర్త గుంటూరు కారం కోసం తీసుకున్న హీరోయిన్‌ ని తన లక్కీ భాస్కర్‌ కోసం సౌజన్య తీసుకున్నారు.

వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న లక్కీ భాస్కర్‌ సినిమాకు సంబంధించిన అధికారిక పూజా కార్యక్రమాలు తాజాగా జరిగాయి. ఆ సమయంలో మీనాక్షి సందడి చేయడంతో లక్కీ భాస్కర్ లో ఆమె హీరోయిన్‌ అనే విషయం కన్ఫర్మ్‌ అయింది.

మహేష్ తో పాటు దుల్కర్‌ సల్మాన్ వంటి హ్యాపెనింగ్ స్టార్‌ సినిమాలో ఛాన్స్ దక్కడంతో మీనాక్షి రాబోయే నాలుగు అయిదు సంవత్సరాలు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదేమో అన్నట్టు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మిస్టర్ అండ్ మిసెస్ త్రివిక్రమ్ సినిమా ల్లో నటించబోతున్న మీనాక్షి కెరీర్ ఎలా ఉంటుందో చూడాలి.