ప్రతి హీరో పాన్ ఇండియా.. డిస్ట్రిబ్యూటర్ హాట్ కామెంట్స్
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న క్రేజీ స్టార్లపై, దర్శకుడు రాజమౌళిపై ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్, అండ్ ఎగ్జిబిటర్ సత్యనారాయణ తాజాగా హాట్ కామెంట్స్ చేశారు.
By: Tupaki Desk | 15 May 2025 2:30 PMటాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న క్రేజీ స్టార్లపై, దర్శకుడు రాజమౌళిపై ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్, అండ్ ఎగ్జిబిటర్ సత్యనారాయణ తాజాగా హాట్ కామెంట్స్ చేశారు. అంతే కాకుండా బడ్జెట్‌లు, రెమ్యూనరేషన్‌లు పెంచేస్తున్న నిర్మాతలపై కూడా ఫైర్ అయ్యారు. ఒక్కో సినిమాకు పది కోట్లు తీసుకుంటున్న హీరోలకు నెక్ట్స్ సినిమాకు వారే రూ.15 కోట్లు ఇచ్చేస్తున్నారని, పాన్ ఇండియా సినిమాల పేరుతో థియేటర్ వ్యవస్థని నిర్వీర్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు రాజమౌళిపై క్రేజీ కామెంట్స్ చేశారు. పాన్ ఇండియా సినిమాల పేరుతో దర్శకుడు రాజమౌళి ఇండస్ట్రీని పాడుచేశారన్నారు. రాజమౌళి టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రైడ్ అని, ఇండస్ట్రీని ఎక్కడో కూర్చోబెట్టారని అంతా ప్రశంసలు కురిపిస్తుంటే ఆయన మాత్రం జక్కన్నపై విమర్శలు చేశారు. రాజమౌళి తెలుగు ఇండస్ట్రీ గౌరవాన్ని పెంచారన్నది నిజమేనని ఒప్పుకుంటూనే ఆయన వళ్ల ఇండస్ట్రీకి ఇబ్బందులు కూడా ఉన్నాయన్నారు.
ఎక్జాంపుల్ మహేష్ బాబు అందరికి ఇష్టమైన హీరో అలాంటి హీరోని రాజమౌళి తన పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం మూడేళ్లు బ్లాక్ చేయడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు. ఏడాదికి ఒక సినిమా చేసే ఇలాంటి పెద్ద స్టార్లని రాజమౌళి మూడేళ్లు బ్లాక్ చేస్తే ఎలా? అని వాపోయారు. గతంలో RRR కోసం ఇద్దరు స్టార్లని రాజమౌళి మూడేళ్లు బ్లాక్ చేశారు. దాంతో ఆ హీరోలు తదుపరి ప్రాజెక్ట్‌లని కూడా అదే స్థాయిలో ప్లాన్ చేసుకుంటున్నారు. వారితో పాటు మిగతా హీరోలు కూడా పాన్ ఇండియా అంటున్నారు. వందల కోట్ల బడ్జెట్‌లతో మాత్రమే సినిమాలు చేయాలనుకుంటున్నారు.
ఈ కారణంగానే రాజమౌళి ఇండస్ట్రీని పాడుచేశారని తాను అంటున్నానని తెలిపారు. అంతే కాకుండా నిర్మాతలు హీరోలు దొరికారని ప్రాజెక్ట్‌లు మొదలు పెట్టేస్తున్నారే కానీ స్టోరీ ఏంటీ అన్నది మాత్రం చూసుకోవడం లేదని మరో బాంబ్ పేల్చారు. అయితే ఈ డిస్ట్రిబ్యూటర్ కమ్ ఎగ్జిబిటర్ చేస్తున్న కామెంట్స్‌ని కొంత మంది సమర్ధిస్తుంటే మరి కొంత మంది మాత్రం సెటైర్లు వేస్తున్నారు. ఇతను ఎవరు రాజమౌళిని, స్టార్ హీరోలని విమర్శించడానికి, జనసేన పార్టీలో చేరిన తరువాతే ఇతనెవరనేది కొంత వరకు తెలిసింది. అంతకు ముందు ఇతనెవరో కూడా ఎవరికీ తెలియదు. రాజమౌళి, పాన్ ఇండియా అంటూ తను చేసిన వ్యాఖ్యలు తమకు నచ్చలేదని సినీ లవర్స్ ఫైర్ అవుతున్నారు.