Begin typing your search above and press return to search.

న‌గ్నంగా న‌టించిన న‌టుడు

అప్పుడు అక్క‌డ టీమ్ కూడా త‌క్కువ మందే ఉన్నారు. కొన్ని స‌న్నివేశాల్లో న‌గ్నంగానూ న‌టించాను. లైట్ల‌న్నీ ఆపేసి కేవ‌లం ఒకే లైట్ లో సీన్లు తీసారు. ఎటూ చూసినా చీకటి చూసే స‌రికి భ‌య‌మేసింది.

By:  Tupaki Desk   |   2 Nov 2023 3:59 PM GMT
న‌గ్నంగా న‌టించిన న‌టుడు
X

సీన్ డిమాండ్ చేస్తే న‌టులు ఎలాంటి స‌న్నివేశాల్లోనైనా ఒదిగిపోతున్నారు. న‌ట‌న‌కు హ‌ద్దులు లేవ‌ని ఎంతో మంది న‌టీన‌టులు నిరూపించారు. సాహ‌సోపేత‌మైన పాత్ర‌ల‌తో పాటు స‌వాళ్లతో కూడిన పాత్ర‌ల్లోనూ మెప్పిస్తున్నారు. ఈ క్ర‌మంలో న‌గ్నంగా..అర్ధ‌న‌గ్నంగా న‌టించ‌డానికి సైతం వెన‌క‌డుగు వేయ‌లేదు. తాజాగా క‌మెడియ‌న్ క‌మ్ న‌టుడు స‌త్యం రాజేష్ అలాంటి సాహ‌సం చేసిన‌ట్లు తెలుస్తోంది.

ఆయ‌న ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన పొలిమేర మొద‌టి భాగం ఓటీటీలో మంచి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. చేత‌బ‌డుల నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఆ సినిమా అందులో న‌టీన‌టీలంద‌రికీ మంచి పేరు తీసుకొచ్చింది. ఈ నేప‌థ్యంలో పొలిమేర‌-2 కూడా తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాపై అంచ‌నాలు బాగానే ఉన్నాయి. ఈ చిత్రాన్ని నేరుగా థియేట‌ర్ల‌లోనే రిలీజ్ చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో ఆన్ సెట్స్ అనుభ‌వాల్ని స‌త్యం రాజేష్ మీడియాతో పంచుకున్నారు. 'పొలిమేర మొద‌టి భాగం షూటింగ్ స‌మ‌యంలో నా స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తుంటే నాకే భ‌య‌మేసింది. అర్ద‌రాత్రి రెండున్న‌ర స‌మ‌యంలో స్మ‌శానంలో కొన్ని సీన్లు తెర‌కెక్కించాం. అప్పుడు అక్క‌డ టీమ్ కూడా త‌క్కువ మందే ఉన్నారు. కొన్ని స‌న్నివేశాల్లో న‌గ్నంగానూ న‌టించాను. లైట్ల‌న్నీ ఆపేసి కేవ‌లం ఒకే లైట్ లో సీన్లు తీసారు. ఎటూ చూసినా చీకటి చూసే స‌రికి భ‌య‌మేసింది.

'పొలిమేర 2' లో కొన్ని భ‌యంక‌ర‌మైన స‌న్నివేశాలున్నాయి. అందుకే సినిమాకి ఏ స‌ర్టిపికెట్ వ‌చ్చింది. ఆ స‌ర్టిఫికెట్ వ‌స్తుంద‌ని ముందే ఊహించాం. అది మా సినిమాకి స‌మ‌స్య కాదు. హార‌ర్ ప్రేక్ష‌కుల‌కు కావాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. మొద‌టి భాగాన్ని మించి భ‌య‌పెడ‌తాం. కానీ ఇందులో రొమాంటిక్ స‌న్నివేశాలు పెద్దగా ఉండ‌వు. ఈ సినిమాని విదేశాల్లోనూ రిలీజ్ చేస్తున్నాం. నా జీవితంలో ఇదే పెద్ద మూవ్ మెంట్' అని అన్నారు.