Begin typing your search above and press return to search.

మెగా 'సత్య'కి 8 ఇంటర్నేషనల్ అవార్డ్స్‌

అంతకు ముందు అమెరికాకు చెందిన ప్రతిష్టాత్మక అవార్డులను కూడా సత్య దక్కించుకున్నట్లు చిత్ర యూనిట్‌ సభ్యులు పేర్కొన్నారు

By:  Tupaki Desk   |   16 Feb 2024 6:38 AM GMT
మెగా సత్యకి 8 ఇంటర్నేషనల్ అవార్డ్స్‌
X

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ చాలా గ్యాప్ తర్వాత విరూపాక్ష సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. సాధారణంగా ప్రముఖ హీరోలు షార్ట్‌ ఫిల్మ్స్, మెసేజ్ ఓరియంటెడ్‌ డాక్యుమెంటరీ ఫిల్మ్స్ పై ఆసక్తి చూపించరు. కానీ సాయి ధరమ్‌ తేజ్ మంచి కాన్సెప్ట్‌ కి ఎప్పుడూ డేట్లు ఇస్తూనే ఉంటాడు.


ఆ మధ్య డ్రంక్ అండ్ డ్రైవ్‌ అవగాహణ కోసం ఒక షార్ట్‌ వీడియోను చేసిన సాయి ధరమ్‌ తేజ్ తాజాగా ఒక మెసేజ్‌ ఓరియంటెడ్‌ షార్ట్‌ ఫిల్మ్‌ చేశాడు. ఆ షార్ట్‌ ఫిల్మ్‌ ఇంకా విడుదల అవ్వకుండానే అంతర్జాతీయ వేదికల మీద సందడి చేస్తూ ఉంది. అదే స్వాతి రెడ్డితో కలిసి సాయి ధరమ్ తేజ్ నటించిన 'సత్య'.

తాజాగా ప్రాన్స్ లో జరిగిన టౌలౌజ్‌ షార్ట్స్ ఫెస్ట్‌ లో సాయి ధరమ్‌ తేజ్‌, స్వాతి ల సత్య షార్ట్‌ ఫిల్మ్‌ ఏకంగా ఎనిమిది అవార్డులను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. ఉత్తమ నటుడు ,ఉత్తమ నటి, బెస్ట్‌ సౌండ్‌, ఎడిటింగ్‌, సినిమాటోగ్రఫీ, నిర్మాణం, డైరెక్టర్‌ ఇంకా ఇండీ షార్ట్‌ క్యాటగిరీ ల్లో సత్య సినిమా అవార్డులను సొంతం చేసుకుంది.

అంతకు ముందు అమెరికాకు చెందిన ప్రతిష్టాత్మక అవార్డులను కూడా సత్య దక్కించుకున్నట్లు చిత్ర యూనిట్‌ సభ్యులు పేర్కొన్నారు. ఈ షార్ట్‌ ఫిల్మ్ తో దర్శకుడిగా పరిచయం అయిన నవీన్‌ కృష్ణ కు ప్రముఖ హీరోల నుంచి కూడా పిలుపు వస్తున్నట్లు సమాచారం అందుతోంది.

ఇక సాయి ధరమ్ తేజ్ ఇతర సినిమాల సంగతికి వస్తే ఆయన ఇప్పటికే గాంజా శంకర్ అనే సినిమాలో నటిస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. కానీ ఆ సినిమా కొన్ని కారణాల వల్ల ఆగిందనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఆ విషయమై ఎలాంటి క్లారిటీ రాలేదు.