Begin typing your search above and press return to search.

సత్యదేవ్ కృష్ణమ్మ రిలీజ్ డేట్ ఫిక్స్.. తారక్ రిఫరెన్స్ తో!

సత్యదేవ్ నటిస్తున్న కృష్ణమ్మ సినిమా టీజర్ ఏడాది క్రితం రిలీజ్ అయింది.

By:  Tupaki Desk   |   5 April 2024 1:37 PM GMT
సత్యదేవ్ కృష్ణమ్మ రిలీజ్ డేట్ ఫిక్స్.. తారక్ రిఫరెన్స్ తో!
X

సత్యదేవ్.. జూనియర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి ఇప్పుడు విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా వరుస మూవీలు చేస్తూ విలక్షణ నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. సత్యదేవ్ చివరగా గుర్తుందా శీతాాకాలం సినిమాతో 2022లో ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయారు. ఈ మూవీ తర్వాత నాలుగు సినిమాలు ప్రకటించారు సత్యదేవ్. అందులో ఒక్కటి కూడా ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు.


సత్యదేవ్ నటిస్తున్న కృష్ణమ్మ సినిమా టీజర్ ఏడాది క్రితం రిలీజ్ అయింది. అందులో సత్యదేవ్ వైలెంట్ గా కనిపించారు. టీజర్ తో పాటు ఫస్ట్ లుక్ కు అప్పట్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. వేసవి కానుకగా మే3వ తేదీన విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు. విడుదల తేదీతో పాటు గ్లింప్స్ కూడా సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.

సత్యదేవ్ జైలు నుంచి విడుదల అవ్వడానికి సిద్ధమైనట్టు గ్లింప్స్ లో చూపించారు. జైల్లో సత్యదేవ్ ఉండగా భద్ర.. రిలీజ్ అవ్వబోతున్నాం రా అని అవతలి వ్యక్తి అంటారు. వెంటనే సత్యదేవ్ ఎప్పుడు అంటూ అని అరుస్తారు. పలు యాక్షన్ సీక్వెన్స్ తో గ్లింప్స్ ఆకట్టుకుంది. సత్యదేవ్ యమా వైలెంట్ గా కనిపిస్తున్నారు. ఆ తర్వాత మేకర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ తో గ్లింప్స్ ముగియగా.. ప్రస్తుతం వైరల్ గా మారింది.

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాను కృష్ణ కొమ్మలపాటి నిర్మిస్తున్నారు. డైరెక్టర్ వీవీ గోపాల కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. కాల భైరవ సంగీతం అందిస్తుండగా.. అతిరా రాజీ హీరోయిన్ గా నటిస్తున్నారు. లక్ష్మణ్ మీసాల, కృష్ణ, అర్చన, రఘు కుంచె, నందగోపాల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సింహాద్రి మూవీ రిఫరెన్స్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

టీజర్ లో ఇప్పటికే సింహాద్రి రిఫరెన్స్ చూపించిన విషయం తెలిసిందే. తాజా గ్లింప్స్ చివర్లో కూడా సింహాద్రి సినిమాకు చెందిన తారక్ కటౌట్ సత్యదేవ్ వెనక ఉన్నట్టు చూపించారు. కృష్ణా న‌ది ప‌క్క‌న ఉండే ఓ గ్రామానికి చెందిన ముగ్గురు స్నేహితులకు ఓ విలన్ తో జరిగిన గొడవే ఈ సినిమా స్టోరీ. మరి ఈ మూవీతో సత్యదేవ్ ఎలాంటి హిట్ కొడతారో చూడాలి.