Begin typing your search above and press return to search.

కృష్ణ‌మ్మ ట్రైల‌ర్: అనాథ‌ల జీవితాల్లో క్రైమ్ క‌థేంటో కానీ..!

తాము చేయని నేరానికి ఒక తీవ్రమైన కేసులో చిక్కుకున్న ముగ్గురు అనాథ‌ల కథతో రూపొందింది.

By:  Tupaki Desk   |   1 May 2024 5:08 PM GMT
కృష్ణ‌మ్మ ట్రైల‌ర్: అనాథ‌ల జీవితాల్లో క్రైమ్ క‌థేంటో కానీ..!
X

సత్యదేవ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన‌ రివెటింగ్ థ్రిల్లర్ `కృష్ణమ్మ`. వివి గోపాలకృష్ణ దర్శకత్వం వహించారు. ప్ర‌ముఖ పంపిణీ సంస్థలు, మైత్రీ మూవీ మేకర్స్ - ప్రైమ్ షో ఎంటర్‌టై*న్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మే 10న విడుదల కానుంది. ఈరోజు, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, కొరటాల శివ, అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఈ చిత్రం గ్రామీణ నేప‌థ్యం.. యాక్షన్‌ ఎమోషన్స్ తో ఆక‌ట్టుకోనుంది. కృష్ణా ప్రాంతంలో సాగే ఈ చిత్రం ముగ్గురు స్నేహితుల క‌థ‌తో తెర‌కెక్కింది. తాము చేయని నేరానికి ఒక తీవ్రమైన కేసులో చిక్కుకున్న ముగ్గురు అనాథ‌ల కథతో రూపొందింది.

ట్రైలర్ రివర్టింగ్ యాక్షన్ - స్నేహం నేప‌థ్యంలో ఆక‌ట్టుకుంది. ఇందులో స్నేహితుల‌ను తీవ్రమైన చిక్కుల్లో ప‌డేసే కేసు ఏమిటి? ఇంత గందరగోళంలో వారు ఎలా చిక్కుకున్నారు? అనేది తెర‌పైనే చూడాలి. ట్రైల‌ర్ ఆద్యంతం గ్రిప్పింగ్ గా ఆక‌ట్టుకుంది. ``ఎందుకు స‌త్తున్నాము ..ఎవ‌డి సేతులో స‌త్తున్నామో తెలీక‌పోడ‌మే అస‌లైన బాధ నా కొ*కా.. లాంటి ఎమోష‌న‌ల్ డైలాగ్స్ కి కొద‌వేమీ లేదు. స‌ర్ కేసేంటి స‌ర్...?`` అంటూ క్రైమ్ స్టోరీ స‌స్పెన్స్ ఎలిమెంట్ ని మెయింటెయిన్ చేయ‌డం ఆస‌క్తిక‌రం.

కాల భైరవ అద్భుతమైన నేప‌థ్య సంగీతం ప్రతి ఫ్రేమ్‌ను ఎలివేట్ చేస్తున్నాయి. సత్యదేవ్ న‌ట‌న విలేజ‌ర్ గెట‌ప్ .. యాక్షన్ సన్నివేశాలు ర‌క్తి క‌ట్టిస్తున్నాయి. ఎమోషనల్‌గా కదిలించే యాక్షన్ డ్రామా ఇద‌ని అర్థ‌మ‌వుతోంది. ట్రైల‌ర్ చూడ‌గానే ఇందులో ప‌లాస త‌ర‌హాలో విష‌యం ఉంద‌ని అర్థ‌మ‌వుతోంది. గ్రిప్పింగ్ స్టోరి, స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేసే చిత్ర‌మిద‌ని అర్థ‌మ‌వుతోంది.

ట్రైలర్‌లో ప్రధాన పాత్రల్లో లక్ష్మణ్ మీసాల, కృష్ణ, అర్చన అయ్యర్, రఘు కుంచె, నందగోపాల్‌లను కూడా పరిచయం చేశారు. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్మాలపాటి నిర్మిస్తున్న ఈ సినిమాలో సత్యదేవ్‌కి జోడీగా అతిరా రాజ్ నటించారు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ సమర్పిస్తున్న ఈ చిత్రం మే 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.