Begin typing your search above and press return to search.

సత్యదేవ్ 'కృష్ణమ్మ'.. ఈ టాక్ అందుకుంటే హిట్టే..

ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టి తనదైన యాక్టింగ్ తో ప్రేక్షకులను ఫిదా చేశారు టాలెంటెడ్ హీరో సత్యదేవ్

By:  Tupaki Desk   |   15 May 2024 5:06 PM GMT
సత్యదేవ్ కృష్ణమ్మ.. ఈ టాక్ అందుకుంటే హిట్టే..
X

ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టి తనదైన యాక్టింగ్ తో ప్రేక్షకులను ఫిదా చేశారు టాలెంటెడ్ హీరో సత్యదేవ్. సైడ్ రోల్స్ చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. హీరోగా మారిన తర్వాత విభిన్నమైన చిత్రాలు చేస్తూ అలరిస్తున్నారు. అయితే సత్యదేవ్ నటించిన మాస్ అండ్ ర్రా ఎమోషనల్ మూవీ 'కృష్ణమ్మ' ఇటీవల రిలీజైన విషయం తెలిసిందే. మే 10 వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

వీవీ గోపాలకృష్ణ తెరకెక్కించిన 'కృష్ణమ్మ' సినిమా.. సత్యదేవ్ ను కొత్తగా ఆవిష్కరించింది. సత్యదేవ్ రగ్డ్ లుక్, రస్టిక్ యాక్షన్ సన్నివేశాలకు సినీ ప్రియులు ఫిదా అవుతున్నారు. అటు ప్రేక్షకుల నుంచి.. ఇటు విమర్శకుల నుంచి సినిమాకు మంచి రివ్యూలు వచ్చాయి. తొలి రోజు బాక్సాఫీస్ వద్ద కోటి రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసి ఆశ్చర్యపరిచింది. సత్యదేవ్ సినీ కెరీర్‌లో ది బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా 'కృష్ణమ్మ' మూవీ రికార్డు సృష్టించింది.

అయితే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వల్ల సినిమాలకు కాస్త దూరంగా ఉన్న వారు.. ఇప్పుడు 'కృష్ణమ్మ' మూవీ చూసి పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. సినిమా బాగుందని చెబుతున్నారు. సత్యదేవ్ యాక్టింగ్ అదరగొట్టేశారని అంటున్నారు. మరోసారి సత్యదేవ్ తన టాలెంట్ ను చూపించారని కొనియాడుతున్నారు. మూవీలోని యాక్షన్ అండ్ ఎమోషనల్ సన్నివేశాలు కొత్త అనుభూతినిస్తున్నాయని చెబుతున్నారు సినీ ప్రియులు.

ఎన్నికల హడావుడి ముగిశాక రిలాక్స్ అవుతున్న వారు.. ప్రస్తుతం థియేటర్లలో ఆడుతున్న సినిమాల్లో చెప్పుకోదగ్గ చిత్రమైన 'కృష్ణమ్మ'ను ఆదరిస్తున్నారు. అయితే మే చివరి వరకు పెద్దగా సినిమాల రిలీజులు లేవు. దీంతో ఇప్పుడు 'కృష్ణమ్మ'కు వస్తున్న పాజిటివ్ మౌత్ టాక్ బాగా స్ప్రెడ్ అయితే మంచి వసూళ్లు వస్తాయని సినీ పండితులు చెబుతున్నారు. ఇక స్టార్ డైరెక్టర్ కొరటాల శివ.. ఈ మూవీకి సమర్పకుడిగా వ్యవహరించడం సినిమాకు మొదట్లో కొంత హైప్ వచ్చింది.

ఈ సినిమా ఓటీటీ హక్కులకు మంచి పోటీ నెలకొందని టాక్ నడుస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో సాలిడ్ డీల్ ను కుదుర్చుకున్నట్లు సమాచారం. జూన్ మూడో వారంలో ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. చేయని నేరాలు ఒప్పుకుని జైలు కెళ్లే ముగ్గురి జీవితంలో ఓ సంఘటన ఎలాంటి మార్పు తీసుకొచ్చింది? వారి జీవితం ఎలా మలుపు తిరిగిందనేది సినిమా.