Begin typing your search above and press return to search.

రాజమౌళి స్టార్ అనడం కన్నా హ్యాపీనెస్ ఏముంటుంది..?

టాలీవుడ్ లో టాలెంట్ ఉండి కెరీర్ ఒక మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న హీరో సత్యదేవ్.

By:  Tupaki Desk   |   9 May 2024 1:30 PM GMT
రాజమౌళి స్టార్ అనడం కన్నా హ్యాపీనెస్ ఏముంటుంది..?
X

టాలీవుడ్ లో టాలెంట్ ఉండి కెరీర్ ఒక మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న హీరో సత్యదేవ్. ముందు చిన్న చిన్న పాత్రలతో కెరీర్ మొదలు పెట్టి చిన్నగా లీడ్ రోల్స్ చేస్తూ సక్సెస్ అయ్యాడు. వెరైటీ కథలు.. కొత్త ప్రయోగాలతో ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేయాలని చూసే సత్యదేవ్ ఈమధ్య కాస్త ట్రాక్ తప్పినట్టు అనిపించినా మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు కృష్ణమ్మ అనే సినిమాతో వస్తున్నాడు. శుక్రవారం రిలీజ్ అవుతున్న ఈ సినిమా కోసం ఏకంగా టాలీవుడ్ దిగ్గజ దర్శకులంతా కూడా ఈవెంట్ కు వచ్చి ప్రమోట్ చేశారు.

గోపాలకృష్ణ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను కృష్ణ నిర్మించారు. కొరటాల శివ ఈ సినిమాకు సమర్పకుడిగా ఉన్నారు. కథ వినగానే నచ్చడంతో కొరటాల శివ సినిమాలో భాగం అయ్యారు. అయితే ఆయన అంత పెద్ద డైరెక్టర్ అయినా కూడా కృష్ణమ్మ సినిమాలో మార్పులు సూచించలేదు. డైరెక్టర్ విజన్ ని నమ్మి ఆయన చెప్పినదానికే ఓకే అన్నారు.

ఇక కృష్ణమ్మ ఈవెంట్ లో రాజమౌళి గారు ఈ సినిమా సత్యదేవ్ కి స్టార్ డం తెచ్చిపెడుతుందని అన్నారు. ఆ మాట రాజమౌళి నుంచి రావడం హ్యాపీగా అనిపించిందని అన్నారు సత్యదేవ్. కెరీర్ లో వైవిధ్యమైన పాత్రలు చేయాలని ఉందని అంటున్నారు సత్యదేవ్. చిరంజీవి ఆపద్భాందవుడు, కమల్ హాసన్ నాయగన్ లాంటి సినిమాలు చేయాలని ఉందని. కొత్త కథలతో సరికొత్త ప్రయోగాలతో ప్రేక్షకులను మెప్పించాలని అంటున్నారు.

కృష్ణమ్మ సినిమాలో సత్యదేవ్ సరసన అతీరా రాజ్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు కాల భైరవ మ్యూజిక్ అందించారు. అందమైన జీవితం ఊహించుకున్న ముగ్గురు స్నేహితుల జీవితంలో ఏం జరిగింది అన్నదే కృష్ణమ్మ కథ. తప్పకుండా సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని అంటున్నారు సత్యదేవ్.

సత్యదేవ్ చేసిన సినిమాల వైపు ఒక లుక్కేస్తే నిజంగానే కథ పరంగా ఏదైనా కొత్త అంశం ఉంటేనే అతను నటించాడు. అయితే కమర్షియల్ సక్సెస్ విషయంలో మాత్రం సత్యదేవ్ కాస్త వెనకపడ్డాడు. అందుకే తనలోని టాలెంట్ ని చాటి చెప్పే సినిమాగా కృష్ణమ్మ వస్తుందని చెబుతున్నారు. కొరటాల శివ సమర్పించడంతో ఆ డైరెక్టర్ ఫ్యాన్స్ కూడా కృష్ణమ్మ మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి రాజమౌళి చెప్పినట్టుగా కృష్ణమ్మ సత్యదేవ్ కి స్టార్ ఇమేజ్ తెచ్చిపెడుతుందా లేదా అన్నది తెలియాలంటే మరికొద్ది గంటలు వెయిట్ చేస్తే సరిపోతుంది.