డెస్టినీ అంటే ఇదే..సత్యదేవ్ గ్రేట్ అచీవ్‌మెంట్!
కొంత మంది ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే రాబట్టుకుంటారు.. అదే డెస్టినీ అంటే. ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి.
By: Ravindar Gorantla | 17 April 2026 3:47 PM ISTకొంత మంది ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే రాబట్టుకుంటారు.. అదే డెస్టినీ అంటే. ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. అలాంటి అరుదైన సంఘటనే హీరో, టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ విషయంలోనూ జరిగిందట. అదే విషయాన్ని ఈ సందర్భంగా వెల్లడించి అందరిని షాక్‌కు గురి చేశాడు. సత్యదేవ్ కథానాయకుడిగా నటిస్తున్న మూవీ `రావ్ బహదూర్`. వెంకేటేష్ మహా దర్శకుడు. జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై హీరో మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ సమర్పిస్తున్నారు.
త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీపా థామస్ హీరోయిన్‌గా నటిస్తోంది. స్మరణ్ సాయి సంగీతం అందిస్తున్న ఈ మూవీ ఫస్ట్ సింగిల్‌ని ఇటీవల విడుదల చేశారు. సినిమా రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో తాజా నిర్వహించిన ప్రమోషనల్ ఈవెంట్‌లో హీరో సత్యదేవ్ ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించి ఆశ్చర్యపరిచారు. అంతే కాకుండా మహేష్ బాబుపై తనకున్న అభిమానానని ఈ సందర్భంగా చాటుకున్నాడు. ఓ అరుదైన సంఘటనని ఈ సందర్‌బంగా వెల్లడించారు.
హైదరాబాద్‌లోని ఎస్.ఆర్. నగర్ ఎక్కువగా కాలేజీలు ఉండే ఏరియాలో ఓ సినిమా షూటింగ్ కోసం ఓ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నాం. ఆ సన్నివేశాన్ని మహేష్ బాబు, నేను పాల్గొనగా చిత్రీరిస్తున్నారు. దీంతో చుట్టు పక్కల ట్రాఫిక్ జామ్ అయింది. స్టూడెంట్స్ ఎగ్జామ్స్ జరుగుతున్నా ఎగ్జామ్స్‌కు వెళ్లడం లేదు. అక్కడే ఉండి షూటింగ్ చూస్తున్నారు. కొంత మంది కిటికీల్లోంచి చూస్తూ కేకలు వేస్తున్నారు. ఆ సమయంలో మహేష్ నా భుజంపై చేయి వేసి డైలాగ్‌లు చెబుతున్నారు. ఇంతలో మా షూటింగ్ కారణంగా ట్రాఫిక్ జామ్ అయిందని తెలిసి ఓ పోలీస్ ఆయన వచ్చి షూటింగ్‌ని వాయిదా వేసుకోమన్నాడు.
దాంతో నాకు సంబంధించిన వెర్షన్ పూర్తి కాకుండానే షూటింగ్ ఆగిపోయింది. దాంతో నా సీన్‌ని సినిమాలోంచి లేపేశారు. అప్పటికే ఊళ్లో వాళ్లందరికి నేను మహేష్ బాబుతో కలిసి నటించానని చెప్పుకున్నాను. సినిమాలో లేకపోయే సరికి ఫీలయ్యాను. అయితే అలా మిస్సయిన అవకాశం మళ్లీ ఈ సినిమాతో నన్ను వెతుక్కుంటూ రావడం డెస్టినీ అన్నారు సత్యదేవ్. మహేష్‌తో నటించిన సీన్ కట్ అయినా ఆయనే నా సినిమాకు సమర్పకులుగా వ్యవహరించడంతో నా డ్రీమ్ ఫుల్ ఫిల్ అయిందన్నారు.
ఈ విషయం పక్కన పెడితే ప్రస్తుతం మహేష్ బాబు అత్యంత భారీ స్థాయిలో రూపొందుతున్న `వారణాసి`లో నటిస్తున్నారు. జక్కన్న అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న గ్లోబల్ మూవీగా అత్యంత భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇరాన్ - ఇజ్రాయోల్ వార్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తోంది. సౌదీ, దుబాయ్‌లలో కీలక సన్నివేశాలని షూట్ చేయాలని ప్లాన్ చేశారట. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ఆ షెడ్యూల్‌ని ఇండియాలోనే భారీ సెట్‌లలో పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
